అలా చూపిస్తేనే అవకాశాలు.. బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్ హీరోయిన్ మాధవీ లతకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 'నచ్చావులే', 'స్నేహితుడా' వంటి సినిమాలతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న మాధవీ లత, ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతూ, సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఆమె సినిమా అవకాశాలు, డ్రెస్సింగ్, స్కిన్ షో, సోషల్ మీడియా వైఖరి గురించి చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. అలాగే సమాజం చూపిస్తున్న ద్వంద్వ వైఖరిని కూడా ఆమె ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలతో మాధవీ లత మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా నిలిచారు. వివరాల్లోకెళ్తే..

ఇటీవల ఆడవారి డ్రెస్సింగ్‌పై జరిగిన చర్చ నేపథ్యంలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు మాధవీ లత. ఈ అంశాన్ని చాలా ఓపెన్ గా మాట్లాడారు. 'మంచిదో చెడేదో తెలియని ప్రజలతో వాదించాలనే ఆసక్తి నాకు లేదు. నా అభిప్రాయం అడిగితే చెబుతా'అంటూ స్పష్టంగా చెప్పారు. 'అమ్మాయిలు పద్ధతిగా బట్టలు వేసుకోవాలి, అదే సమయంలో మోడ్రన్‌గా కూడా ఉండాలి. అందంగా అలంకరించుకోవాలి కానీ అందరూ అసహ్యంగా చూసేలా ప్రవర్తించకూడదు' అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

Bigg Boss fame Madhavi Latha s Shocking Remarks on Film Opportunities and Skin Show Spark Debate

'ఓ అమ్మాయిని చూసినప్పుడు 'బాగుందిరా' అనిపించాలి కానీ, అభ్యంతరంగా మాట్లాడాల్సిన పరిస్థితి రాకూడదు. ఆడవాళ్లకే అలా అనిపిస్తే, మగవాళ్లకు అనిపించడంలో తప్పేం ఉంది?' అంటూ డ్రెస్సింగ్ విషయంలో విచక్షణ అవసరమని సూచించారు. అసభ్యకరంగా బట్టలు వేసుకోవడం మంచిది కాదని స్పష్టం చేశారు. తాను ఫ్యాషన్ డిజైనింగ్ చదివిన వ్యక్తినని గుర్తుచేస్తూ.. డ్రెస్సింగ్ అనేది వ్యక్తిత్వానికి, శరీరాకృతికి సరిపడేలా ఉండాలని చెప్పారు.

ఇతరులను గుడ్డిగా ఫాలో అవడం ప్రమాదకరమని ఆమె అభిప్రాయపడింది. 'ఇతరులు వేసుకున్నారు కాబట్టి మనం కూడా అలాగే వేసుకోవడం కరెక్ట్ కాదు. మనం వేసుకునే బట్టలు మనకు అందాన్ని ఇవ్వాలి. మనకు నచ్చుతుందా? మన పర్సనాలిటీకి సెట్ అవుతుందా? అన్నదీ చూసుకోవాలి' అంటూ హితవు పలికారు. ఇక సోషల్ మీడియాలో స్కిన్ షో పెరుగుతున్న తీరుపై మాధవీ లత చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి.

'ఈ మధ్య కొంతమంది ఎక్కువగా స్కిన్ చూపిస్తూ వీడియోలు చేస్తున్నారు. అలాంటి వారికి లైకులు, ఫాలోవర్స్ పెరుగుతున్నారు. అదే సమయంలో వాళ్లను బూతులు తిడుతూ, రిపోర్ట్ చేస్తూ ద్వంద్వ వైఖరి చూపిస్తున్నారు'అంటూ సమాజాన్ని ప్రశ్నించారు. 'ఇక్కడ తప్పు ఒక్క ఆడవారిదే అని చెప్పలేం. వాళ్లను ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా మార్చింది ఎవరు? లైకులు కొట్టి, ఫాలో చేసి, ఎంకరేజ్ చేసింది ఈ సమాజమే కదా?' అంటూ స్పష్టంగా చెప్పారు. 'ఈరోజు హేట్ చేస్తారు... మరుసటి రోజు అదే అమ్మాయి పెట్టిన ఫోటోలను మళ్లీ చూస్తారు. నచ్చకపోతే బ్లాక్ చేయొచ్చు, రిపోర్ట్ చేయొచ్చు. కానీ అది చేయరు' అంటూ సోషల్ మీడియా డబుల్ స్టాండర్డ్స్‌ను ఎండగట్టారు.

అంతటితో తగ్గకుండా మాధవిలత ఇంకా మాట్లాడుతూ.. స్కిన్ షో చేసే వారు క్రమంగా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా మారుతున్నారని, ఆ తర్వాత వారికి సీరియల్స్, సినిమాలు, వెబ్ సిరీస్‌లలో అవకాశాలు వస్తున్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. 'గుడ్డలు తీస్తేనే ఆఫర్లు వస్తున్నాయన్న భావన ఇండస్ట్రీలో పెరుగుతోంది. ఇందులో ప్రధానంగా సమాజమే వారిని పెంచి పోషిస్తోంది'అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

తన సర్కిల్‌లోని కొందరి ఉదాహరణలను కూడా మాధవీ లత ప్రస్తావించారు. 'మొదట్లో శారీల్లో సంప్రదాయంగా కనిపించిన కొందరు, క్రమంగా నడుము చూపించడం మొదలుపెట్టారు. అలా ఫాలోవర్స్ పెరిగారు. తర్వాత మరింత అతిగా చూపించడంతో కోలాబరేషన్స్, షాప్ ఓపెనింగ్స్, సీరియల్స్, వెబ్ సిరీస్ అవకాశాలు వచ్చాయి. వాళ్లు కూడా 'పొట్టకూటి కోసం ఇలా చేస్తున్నాం' అని తమను తాము సమర్థించుకుంటున్నారు' అంటూ సమాజ తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా మాధవీ లత వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీ, సోషల్ మీడియా, సమాజం అన్నింటినీ ఒకేసారి ప్రశ్నించేలా ఉన్నాయి. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

More from Filmibeat

Read more about: tollywood madhavi latha anasuya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X