పబ్లిక్‌ ప్లేస్‌లోనే రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ: ప్రియుడితో పాడుపనులు.. రొమాన్స్ వీడియోతో వైరల్

బుల్లితెర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో రికార్డులను క్రియేట్ చేసి.. ప్రసారమైన అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన షో బిగ్ బాస్. దీని వల్ల ఎంతో మంది బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో కోలీవుడ్ బ్యూటీ మీరా మిథున్ ఒకరు. చేసింది కొన్ని సినిమాలే అయినా.. ఈ షో వల్ల దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకుందీ బ్యూటీ. అదే సమయంలో వివాదాల కారణంగా హాట్ టాపిక్ అయిపోయింది. ఇక, ఈ మధ్య ప్రియుడితో కలిసి రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా తన బాయ్‌ఫ్రెండ్‌తో పబ్లిక్ ప్లేస్‌లోనే రొమాన్స్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

 మోడల్‌గా మొదలైన మీరా మిథున్ కెరీర్

మోడల్‌గా మొదలైన మీరా మిథున్ కెరీర్

చిన్న వయసులోనే తన సత్తాను నిరూపించుకుని ఉన్నత చదువులను అభ్యసించింది తమిళనాడు చిన్నది మీరా మిథున్. ఆ సమయంలోనే కొరియోగ్రాఫర్ గణేష్ సలహా మేరకు మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అప్పటి నుంచి ఎన్నో అందాల పోటీలలో పాల్గొనడంతో పాటు కొన్ని బ్రాండ్‌ల యాడ్‌లలోనూ నటించి మెప్పించింది. దీంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.

 సినిమాల్లోకి ఎంట్రీ.. గుర్తింపు మాత్రం భారీ

సినిమాల్లోకి ఎంట్రీ.. గుర్తింపు మాత్రం భారీ

మోడలింగ్ రంగంలో తన అందచందాలతో ఆకట్టుకున్న మీరా మిథున్.. ఆ తర్వాత వెండితెరపైకి అడుగు పెట్టింది. 2015లో వచ్చిన 'ఎన్నై అరిందాల్' అనే సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత 'గఘనం', '8 తొట్టక్కల్', 'తానా సెర్న్‌దా కొట్టం', 'బాదై ఏరి బుద్ది మారి' వంటి సినిమాల్లో నటించింది. చేసిన సినిమాలు తక్కువే అయినా మరెవరికీ సాధ్యం కాని రీతిలో పాపులర్ అయింది.

 బిగ్ బాస్‌లోకి ప్రవేశం.. పెరిగిపోయిన క్రేజ్

బిగ్ బాస్‌లోకి ప్రవేశం.. పెరిగిపోయిన క్రేజ్

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే మీరా మిథున్‌కు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. ఇందులో భాగంగానే రెండేళ్ల క్రితం వచ్చిన మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ప్రవేశించింది. షోలో ఇచ్చిన టాస్కుల ప్రకారం ఆట ఆడుతూ ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకోవడంతో పాటు తరచూ గొడవల్లో ఉంటూ విమర్శలు ఎదుర్కొంది. ఈ షో వల్ల ఫాలోయింగ్ పెంచుకుంది.

స్టార్ హీరోలు, హీరోయిన్లపై దారుణ పోస్టు

స్టార్ హీరోలు, హీరోయిన్లపై దారుణ పోస్టు

సినిమా నటిగా అందుకున్న పేరును కొన్ని వివాదాల కారణంగా పోగొట్టుకుందీ బ్యూటీ. మరీ ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూనే ఉంది. మొదట్లో స్టార్ హీరోలు విజయ్, అజిత్ తనను ఇబ్బంది పెడున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత సూర్య, స్టార్ హీరోయిన్ త్రిష, జ్యోతిక, ఐశ్వర్య రాజేశ్ సహా ఎంతో మందిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

మోడీకి లేఖ.. నిత్యానందపై ఇష్టం అంటూ

మోడీకి లేఖ.. నిత్యానందపై ఇష్టం అంటూ

మీరా మిథున్ సినిమా వాళ్లను టార్గెట్ చేయడమే కాదు.. తమిళనాడు రాష్ట్రాన్ని నాశనం చేయమని ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖను రాసింది. దీంతో ఆమెపై పోలీస్ కేసు నమోదైంది. ఆ తర్వాత రాష్ట్రం నుంచి ఆమెను బహీష్కరించారు. అంతేకాదు, వివాదాస్పద స్వామీజీ నిత్యానంద అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన కోరితే ఏమైనా చేస్తానని స్టేట్‌మెంట్ ఇచ్చి షాకిచ్చిందామె.

ఎప్పుడూ అందులోనే.. రచ్చ చేస్తుందిగా

ఎప్పుడూ అందులోనే.. రచ్చ చేస్తుందిగా

వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది మీరా బోల్డ్ బ్యూటీ మిథున్. దీని ద్వారానే సమాజంలో జరిగే ఎన్నో అంశాలపై స్పందిస్తోన్న ఈ భామ.. వివాదాలకు కేంద్ర బిందువులా మారింది. అలాగే, తన వ్యక్తిగత, కెరీర్‌కు సంబంధించిన అంశాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే తరచూ తన హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది.

Recommended Video

Meera Chopra Vs Jr NTR Fans Issue Maybe A Political Game
పబ్లిక్ ప్లేస్‌లోనే ప్రియుడితో రొమాన్స్ చేసి

పబ్లిక్ ప్లేస్‌లోనే ప్రియుడితో రొమాన్స్ చేసి

తాజాగా మీరా మిథున్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌తో సన్నిహితంగా కనిపించింది. అంతేకాదు, పబ్లిక్ ప్లేస్‌లోనే వీళ్లిద్దరూ ముద్దులు గట్టిగా హత్తుకుని ఉండడంతో పాటు ముద్దులు కూడా పెట్టుకున్నారు. అలాగే తన అందాలను పైకీ కిందకూ చూపిస్తూ ఈ బ్యూటీ రచ్చ చేసింది. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X