Monal Gajjar ఇన్‌స్టా నుంచి పిచ్చి పిచ్చి ఫొటోలు: అనుమానాలు మొదలు.. షాకింగ్ న్యూస్ చెప్పిన అఖిల్

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. కానీ, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. మిగిలిన వాళ్లు టాలెంట్‌, గ్లామర్ ఉన్నా అవకాశాలను అందుకోలేకపోతున్నారు. అలాంటి వారిలో గుజరాతీ బ్యూటీ మోనాల్ గజ్జర్ ఒకరు. పదేళ్ల క్రితమే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ వెంటనే కనుమరుగైపోయింది. మళ్లీ బిగ్ బాస్ షో ద్వారా తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఊహించని రీతిలో ఫాలోయింగ్‌ను అందుకుంది. ఇలా ఆఫర్లు అందుకుంటూ దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో మోనాల్ గజ్జర్‌కు సోషల్ మీడియాలో ఊహించని షాక్ తగిలింది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

చిన్న వయసులోనే.. అలా పరిచయం

చిన్న వయసులోనే.. అలా పరిచయం

చాలా చిన్న వయసులోనే హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించింది మోనాల్ గజ్జర్. ఈ క్రమంలోనే 'సుడిగాడు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత తెలుగులో రెండు మూడు చిత్రాల్లో నటించినా ఆమెకు అంతగా గుర్తింపును, ఆఫర్లను తీసుకు రాలేదు. దీంతో టాలీవుడ్‌కు దూరమైంది. అయితే, వేరే భాషల్లో మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటింది.

 బిగ్ బాస్ ఆఫర్.. లవ్ ట్రాకుతో ఫేమస్

బిగ్ బాస్ ఆఫర్.. లవ్ ట్రాకుతో ఫేమస్

మోనాల్ గజ్జర్‌కు హీరోయిన్‌గా పెద్దగా ఫేమ్ దక్కకున్నా.. బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే అవకాశాన్ని అందుకుంది. షో ఆరంభంలోనే ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో ఫేమస్ అయిందామె. ఆ తర్వాత అఖిల్ సార్థక్‌తో కలిసి ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలతో మరింత పాపులర్ అయింది. ఇలా గేమ్ పరంగా కంటే లవ్ ట్రాకుల కారణంగానే మోనాల్ ఫోకస్ అయిపోయింది.

అక్కడే కాదు.. ఇక్కడా రెచ్చిపోతోందిగా

అక్కడే కాదు.. ఇక్కడా రెచ్చిపోతోందిగా

అఖిల్ సార్థక్‌తో కలిసి బిగ్ బాస్ షోలో మోనాల్ గజ్జర్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. చుట్టూ ఎంతో మంది ఉన్నా.. వీళ్లిద్దరే జంటగా కనిపిస్తూ ఉండేవారు. అదే సమయంలో హగ్గులు, ముద్దులతో హల్‌చల్ చేసేవారు. ఇలా హౌస్‌లో మాత్రమే కాదు.. బయటకు వచ్చిన తర్వాత కూడా తరచూ కలుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో నిత్యం వార్తల్లోకి ఎక్కుతూ ఉంటోందామె.

వరుస ఆఫర్లతో సత్తా.. మకాం మార్చేసి

వరుస ఆఫర్లతో సత్తా.. మకాం మార్చేసి

బిగ్ బాస్ వల్ల మోనాల్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్‌లో క్రేజ్ వచ్చేసింది. దీంతో ఆమెకు ఆఫర్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఆ మధ్య 'అల్లుడు అదుర్స్'లో స్పెషల్ సాంగ్ చేసిన ఈ బ్యూటీ.. ప్రముఖ ఛానెల్‌లో 'డ్యాన్స్ ప్లస్' అనే షోలో జడ్జ్‌గా చేసింది. అలాగే, మరికొన్ని సినిమాలు, షోలు చేస్తూ బిజీగా మారింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు మకాం మార్చేసింది మోనాల్.

అక్కడ మాత్రం రచ్చ చేస్తోన్న బ్యూటీ

అక్కడ మాత్రం రచ్చ చేస్తోన్న బ్యూటీ

ఆఫర్లు ఉన్నా లేకున్నా.. మోనాల్ గజ్జర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ రచ్చ చేస్తోంది. తద్వారా ఫాలోవర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటూ దూసుకుపోతోందీ గుజరాతీ బ్యూటీ.

మోనాల్ ఇన్‌స్టా నుంచి పిచ్చి ఫొటోలు

మోనాల్ ఇన్‌స్టా నుంచి పిచ్చి ఫొటోలు

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మోనాల్ గజ్జర్.. తరచూ ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటోంది. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఎక్కువగా ఫొటోలను, వీడియోలను వదులుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఆమె అకౌంట్ నుంచి పిచ్చి పిచ్చి ఫొటోలు (డార్క్) పోస్ట్ అవుతున్నాయి. అలాగే, యూజర్ నేమ్ కూడా మారిపోయింది. దీంతో డౌట్లు వస్తున్నాయి.

Recommended Video

Bigg Boss ని కోర్టుకు ఈడుస్తా.. వాళ్ళు రాజకీయాల్లో ఫెయిల్ అవుతారు - CPI Narayana
షాకింగ్ న్యూస్ చెప్పేసిన అఖిల్ సార్థక్

షాకింగ్ న్యూస్ చెప్పేసిన అఖిల్ సార్థక్

మోనాల్ గజ్జర్ ఇన్‌స్టా అకౌంట్‌ పేరు మారడం.. ఏవేవో ఫొటోలు పోస్ట్ అవుతుండడంపై అఖిల్ సార్థక్ తాజాగా స్పందించాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'మోనాల్ గజ్జర్ ఇన్‌స్టా అకౌంట్‌ను ఎవరో హ్యాక్‌ చేశారో. ఈ పని చేసిన వాళ్లను త్వరలోనే గుర్తిస్తాము' అంటూ పోస్ట్ చేశాడు. మోనాల్ అకౌంట్ హ్యాక్ అవడంపై ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X