బాత్‌టబ్‌లో ఉన్న ఫొటో షేర్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ: తొలిసారి అలా కనిపించడంతో అంతా షాక్

సినిమాల్లో నటించినా చాలా మందికి పెద్దగా గుర్తింపు దక్కదు. అలాంటి వారిలో ప్రముఖ హీరోయిన్ నందినీ రాయ్ ఒకరు. చాలా కాలం క్రితం సినిమాల్లోకి ప్రవేశించిన ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మ.. పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అయినప్పటికీ సక్సెస్‌ను అందుకోలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 2లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా బాత్‌టబ్‌లో స్నానం చేస్తున్న ఫొటోను షేర్ చేసి షాకిచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

మిస్ ఆంధ్రాగా ఎంపిక.. ఫుల్ ఫేమస్

మిస్ ఆంధ్రాగా ఎంపిక.. ఫుల్ ఫేమస్

చదువుకుంటోన్న సమయంలోనే మోడల్‌‌గా కెరీర్‌ను ఆరంభించింది నందినీ రాయ్. ఆ సమయంలోనే అందాల్లో పోటీల్లో పాల్గొన్నది. అప్పుడు మిస్ ఆంధ్రాగా ఎంపికైంది. దాని తర్వాత ఎన్నో షోలలో పాల్గొని దాని ద్వారా వచ్చిన ఫాలోయింగ్‌తో ఎన్నో ప్రపంచ స్థాయిలో సంస్థల వ్యాపార ప్రకటనల్లో నటించింది. దీని ద్వారా దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ స్థాయిలో గుర్తింపు అందుకుంది.

హిందీ చిత్రం ద్వారా పరిచయమైంది

హిందీ చిత్రం ద్వారా పరిచయమైంది

హైదరాబాదీనే అయినా ఉత్తరాదిలో ఎక్కువగా ఫేమస్ అయింది నందినీ రాయ్. దీంతో తెలుగులో కాకుండా బాలీవుడ్‌లోనే మొదటి అవకాశం దక్కించుకుంది. ఈ క్రమంలోనే ‘ఫ్యామిలీ ప్యాక్' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘మాయ' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది. ఈ క్రమంలోనే ‘మోసగాళ్లకు మోసగాడు', ‘సిల్లీ ఫెలోస్' వంటి చిత్రాల్లో నటించింది.

బిగ్ బాస్ షోలోకి వెళ్లడంతో మారింది

బిగ్ బాస్ షోలోకి వెళ్లడంతో మారింది

సినిమాల్లో నటించినా నందినీ రాయ్‌కు పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ, బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె కెరీర్‌కు ఒక్కసారిగా ఊపొచ్చింది. షోలో ఎంతో క్యూట్‌గా కనిపించిన ఈ అమ్మాయి.. కొందరితో క్లోజ్‌గా ఉంటూ హాట్ టాపిక్ అయింది. అదే సమయంలో టాస్కుల్లో చక్కగా ఆడుతూ మంచి పేరు తెచ్చుకుంది. కానీ, చివరి వరకూ ఉండేలేకపోయింది.

అప్పటి నుంచి రచ్చ చేస్తోన్న భామ

అప్పటి నుంచి రచ్చ చేస్తోన్న భామ

బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయి వచ్చిన తర్వాత నందినీ రాయ్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్ అయిపోయింది. ఈ క్రమంలోనే తరచూ హాట్ ఫొటోషూట్లతో హల్‌చల్ చేసింది. ఇలానే బాలీవుడ్‌లో సినిమా ఛాన్స్ కూడా పట్టేసింది. మరోవైపు... ఆ మధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. ఓ టాలీవుడ్ డైరెక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి కలకలం రేపింది.

బాత్‌టబ్ ఫొటోతో షాకిచ్చిన బ్యూటీ

బాత్‌టబ్ ఫొటోతో షాకిచ్చిన బ్యూటీ

తరచూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తోన్న నందనీ రాయ్.. తాజాగా ఓ హాట్ ఫొటోను వదిలింది. ఇటీవల ఉత్తరాది పర్యటనకు వెళ్లిన ఆమె.. బస చేసిన హోటల్‌లో స్నానం చేస్తూ ఫొటో దిగింది. ఇందులో బాత్‌టబ్‌లో నగ్నంగా కనిపిస్తోంది. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఇలా ఈ ఫొటో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది.

ఐటమ్ గర్ల్‌గా మారిన నందనీ రాయ్

ఐటమ్ గర్ల్‌గా మారిన నందనీ రాయ్

తెలుగులో సినిమాలు పెద్దగా చేయకున్నా.. మిగిలిన భాషల్లో మాత్రం ఛాన్స్‌లు అందుకుంటోంది నందినీ రాయ్. ఇందులో భాగంగానే ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్‌లలో సైతం నటిస్తోంది. అయితే, హీరోయిన్‌గా అవకాశాలు సన్నగిల్లడంతో సపోర్టింగ్ క్యారెక్టర్లు సైతం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘కోతి కొమ్మచ్చి' అనే సినిమా కోసం ఐటమ్ సాంగ్ చేసింది ఈ హైదరాబాదీ హీరోయిన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X