బాత్ టబ్‌లో హాట్ హాట్‌గా బిగ్ బాస్ బ్యూటీ.. పాలిటిక్స్‌లోకి వెళ్లాక రెచ్చిపోతోందేంటి!

By Manoj Kumar P

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ షో వల్ల ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఎన్నో అవకాశాలను దక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో ప్రముఖ హీరోయిన్ నందినీ రాయ్ ఒకరు. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. ఎక్కువ గుర్తింపును దక్కించుకుందీ హీరోయిన్. ఇక, తాజాగా ఈమె హాట్ షోతో రెచ్చిపోయింది. దీంతో ఆమె అభిమానులందరూ షాక్ అయిపోతున్నారు. ఇంతకీ నందినీ ఏం చేసింది.? ఆ సంగతులు మీకోసం.!

హైదరాబాదీ అమ్మాయే.. అలా వచ్చింది

హైదరాబాదీ అమ్మాయే.. అలా వచ్చింది

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న నందినీ రాయ్‌ది హైదరాబాదే. సింధీ కుటుంబానికి చెందిన ఈమె.. నగరంలోనే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లింది. చదువు పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్ వచ్చేసిన ఈ అమ్మడు.. తన కెరీర్‌పై దృష్టి సారించింది.

అందంతో ఎన్నో కొల్లగొట్టేసిన నందినీ రాయ్

అందంతో ఎన్నో కొల్లగొట్టేసిన నందినీ రాయ్

చదువు పూర్తి చేసిన తర్వాత నందినీ రాయ్ నేరుగా మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ సమయంలోనే మిస్ హైదరాబాద్, మిస్ ఆంధ్రప్రదేశ్, మిస్ పాంటలూన్స్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వంటి అవార్డులు దక్కించుకుంది. ఆ తర్వాత దాదాపు వంద వరకు జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు మోడల్‌గా నటించింది.

ఇక్కడి అమ్మాయే.. అక్కడికి వెళ్లిపోయింది

ఇక్కడి అమ్మాయే.. అక్కడికి వెళ్లిపోయింది

హైదరాబాద్‌కు చెందిన నందినీ రాయ్.. మోడలింగ్ చేస్తున్న సమయంలోనే సినిమా అవకాశాలను దక్కించుకుంది. అయితే, అవి ఇక్కడి సినిమాలు కాదు.. బాలీవుడ్ పరిశ్రమవి. ఈ క్రమంలోనే ఆమె ‘ఫ్యామిలీ ప్యాక్' అనే హిందీ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తెలుగులోకి ఎంటర్ అయింది. ఇక్కడ నందినీకి ‘మాయ', ‘మోసగాళ్లకు మోసగాడు' మంచి పేరు తెచ్చాయి.

కెరీర్‌ను మలుపు తిప్పిన నిర్ణయం ఇదే

వరుసగా సినిమాల్లో నటిస్తున్న సమయంలో నందినీ రాయ్‌కు బిగ్ బాస్ నిర్వహకుల నుంచి పిలువు వచ్చింది. దీంతో ఆమె వెంటనే వాళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. హౌస్‌లోకి ఎంటర్ అయిన తర్వాత తన అందంతో మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ.. కొద్ది రోజులకే బయటకు వచ్చేసింది. అయినప్పటికీ ఎంతో పాపులారిటీని సంపాదించడంతో పాటు అవకాశాలను దక్కించుకుంటోంది.

హాట్ షోతో రెచ్చిపోతోన్న బిగ్ బాస్ బ్యూటీ

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫేమస్ అయిపోయిన నందినీ రాయ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే హాట్ షోతో రెచ్చిపోతోంది. ఇక, ఈ మధ్య అయితే అమ్మడు తన అందాలతో కనువిందు చేస్తోంది. మరీ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో నందినీ షేర్ చేస్తున్న హాట్ హాట్ ఫొటోలను భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.

Recommended Video

AR Rahman Is Annoyed By The Remix Of His Songs
రాజకీయాల్లోకి వెళ్లాక ఇలా మారిపోయిందేంటి.!

రాజకీయాల్లోకి వెళ్లాక ఇలా మారిపోయిందేంటి.!

నందినీ రాయ్ ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమాతో పాటు హిందీలోనూ ‘నందీ' అనే మూవీలో చేస్తోంది. కొత్త దర్శకుడు హుస్సేన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఆమె రాజకీయ నాయకురాలిగా నటిస్తోంది. దీంతో బాలీవుడ్‌లోకి వెళ్లాక ఆమె వ్యవహార శైలి పూర్తిగా మారిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో నందినీ రాయ్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X