అలా సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. తెలుగు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
సినీ రంగం పైకి చూసేందుకు ఎంతో కలర్ ఫుల్ గా కనిపించినా లోపల మాత్రం చెప్పుకోలేని వ్యధలుంటాయి. అనేక సమస్యలను ఎదుర్కొన్ని చివరికీ వారు ఒక స్టార్ గా ఎదుగుతారు. అనేక ఆటుపోటుల నుంచి తప్పించుకునేందుకు తనువు కూడా చాలిద్దామని అనుకునేవారు కూడా లేకపోలేదు. అయితే వాటన్నింటిని అధిగమించి జీవితాన్ని అందంగా మలుచుకునేవారు కూడా ఉన్నారు. అాలాంటి వారిలో ఒకరే బిగ్ బాస్ ఫేమ్, బ్యూటిఫుల్ నందినీ రాయ్. మోడలింగ్ లో రాణించిన తర్వాత సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ సూసైడ్ చేసుకుని చనిపోవాలనుకుందట. ఆ వివరాల్లోకి వెళితే..

మిస్ హైదరాబాద్ కిరీటం..
హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే నందినీ రాయ్ మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ పాపులర్ అయింది. బ్యూటిఫుల్ నందినీ రాయ్ పుట్టింది, పెరిగింది హైదరాబాద్ లోనే. చిన్న వయసులోనే మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నందినీ రాయ్ అతి తక్కువ సమయంలోనే అంతర్జాతీయ మోడల్ గా పేరు తెచ్చుకుంది. అందాలో పోటీల్లో పాల్గొన్న నందినీ రాయ్ 2009లో మిస్ హైదరాబాద్ కిరీటం దక్కించుకుంది. అనంతరం 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ గెలిచింది ఈ బ్యూటి.

040 చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ..
మిస్ ఆంధ్రాగా సెలెక్ట్ అయిన బ్యూటిఫుల్ నందినీ రాయ్ నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్లకు కూడా ప్రచారకర్తగా వ్యవహరించింది. ఈ క్రమంలోనే ఈ బ్యూటికి దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కడంతో ఆఫర్లను అందుకుంది. ముందుగా 040 అనే చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నందినీ రాయ్ ఆ తర్వాత మాయ, ఖుషీ ఖుషీగా, మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్, శివరంజని వంటి తదితర చిత్రాల్లో నటించింది.

ముందుగా హిందీ మూవీ ఛాన్స్..
నందినీ రాయ్ హైదరాబాద్‌కు చెందిన ముద్దుగుమ్మే అయినా తెలుగులో కంటే నార్త్‌లోనే ఎక్కు పాపులారిటీని సంపాదించుకుంది. ఫలితంగా బాలీవుడ్‌లోనే మొదటి సినిమా ఛాన్స్ అందుకుంది. ఇలా 'ఫ్యామిలీ ప్యాక్' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాతనె తెలుగు సినిమాలు చేసింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం చిత్రాల్లోనూ అలరించింది ముద్దుగుమ్మ నందినీ రాయ్.

బిగ్ బాస్ రెండో సీజన్ లో..
సుదీర్ఘంగా సాగిన సినీ కెరీర్‌లో తెలుగులో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసినా నందినీ రాయ్‌కి అనుకున్న స్థాయిలో గుర్తింపు దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ అమ్మడికి బిగ్ బాస్ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం లభించింది. ఈ రియాలిటీ షోలో చక్కని ఆట, క్యూట్ లుక్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆట పరంగానూ ఆకట్టుకున్నా అనుకోకుండా మధ్యలోనే వెళ్లిపోయింది. అయితే అలా వెళ్లిన కూడా క్రేజ్ మాత్రం భారీగానే పెంచుకుంది.

వెబ్ సిరీస్ లతో గుర్తింపు..
బిగ్ బాస్ తర్వాత నందినీ రాయ్‌కు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అవకాశాలు భారీగా పెరుగుతాయని అంతా భావించారు. కానీ, ఊహించని విధంగా ఆమెకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఇక, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ హాట్ బ్యూటి 'కోతి కొమ్మచ్చి' అనే సినిమా కోసం ఐటమ్ సాంగ్ చేసింది. అలాగే కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్', గాలివాన వంటి వెబ్ సిరీస్‌లో నటించి ఆకట్టుకుంది.

సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకుని..
అయితే నందినీ రాయ్ తన ఇంటి టెర్రస్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుందట. కెరియర్ మొదట్లో ఆమె సినిమాలు అంతగా ఆడలేదు. దాంతో చాలా కుంగిపోయిన ఆమె సూసైడ్ చేసుకోవాలని చాలాసార్లు అనుకున్నట్లు నందినీ రాయ్ తెలిపింది. అయితే ఆ తర్వాత ఆ ఆలోచన తప్పని గ్రహించి.. మిత్రులతో రోజూ మాట్లాడుతూ ధైర్యం తెచ్చుకున్నట్లు ఆమె పేర్కొంది. సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకుని, ఆ సమస్య నుంచి బయట పడినట్లు తెలిపింది.

జీవితాన్ని అర్థం చేసుకుని..
జయాపజయాలకు పొంగిపోవడం, కుంగిపోవడం సరైంది కాదని తెలుసుకున్నట్లు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు సాగడమే జీవితమని అర్థం చేసుకున్నట్లు నందినీ రాయ్ వెల్లడించింది. అయితే అప్పట్లో ఎప్పుడో ఓ ఇంటర్వ్యూలో నందినీ రాయ్ మాట్లాడిన ఈ మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే తనదైన గ్లామర్ ఫొటోలతో సోషల్ మీడియాలో అభిమానులకు ట్రీట్ ఇస్తుంటుంది ఈ బ్యూటిఫుల్ నందినీరాయ్.


Click it and Unblock the Notifications











