మళ్లీ రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ.. తల్లైన కొద్ది రోజులకే బీచ్‌లో దారుణంగా!
సోషల్ మీడియా వాడకం పెరుగుతున్న కొద్దీ ఎంతో మంది హీరోయిన్లు విపరీతంగా అందాలను ఆరబోస్తూ సెన్సేషన్‌గా మారిపోతున్నారు. తద్వారా సినిమాలు చేసినా, చేయకపోయినా నిత్యం వార్తల్లోనే ఉంటున్నారు. అలాంటి వారిలో కన్నడ భామ పూజా రామచంద్రన్ ఒకరు. చాలా ఏళ్ల క్రితమే నటిగా ప్రయాణం మొదలెట్టిన ఈ అమ్మడు.. ఈ మధ్యన సోషల్ మీడియాలో మాత్రం యమా హాట్ షో చేస్తూ రెచ్చిపోతూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా పూజా రామచంద్రన్ బీచ్‌లో దిగిన అదిరిపోయే ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా లుక్కేయండి మరి!
వీజే నుంచి నటిగా మారింది:సినిమాల కంటే ముందే పూజా రామచంద్రన్ వీడియో జాకీగా పని చేసింది. ఆ తర్వాత '7am అరివు' అనే చిత్రంతో నటిగా కెరీర్ ప్రారంభించింది. ఆ వెంటనే 'లవ్ ఫెయిల్యూర్' మూవీతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుసగా తమిళం, తెలుగు, మలయాళంలో సినిమాలు చేసింది. తద్వారా సౌతిండియాలో నటిగా విశేషమైన గుర్తింపును తెచ్చుకుంది.

బిగ్ బాస్ ఛాన్స్ రావడంతో:తెలుగులో వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్నప్పుడే పూజా రామచంద్రన్.. బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా వచ్చింది. ఇందులోకి సాదాసీదాగానే ఎంటరైన ఈ భామ అందంతో పాటు ఆటతో ఓ రేంజ్‌లో మెప్పించింది. అలాగే దూకుడుగా ఉంటూ మంచి పేరు సంపాదించింది. చివర్లో ఎలిమినేట్ అయినా.. తెలుగులో క్రేజ్ మాత్రం బాగా పెరిగింది.
ఆఫర్లు వచ్చినా చేయట్లేదు:బిగ్ బాస్ షో తర్వాత పూజా రామచంద్రన్‌కు తెలుగులో ఆఫర్లు బాగానే వచ్చాయి. ఫలితంగా ఈ బ్యూటీ ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించింది. అలాగే, తమిళంలోనూ ఈ చిన్నది వరుసగా ఆఫర్లను అందుకుంది. దీంతో పూజా రామచంద్రన్ బిజీ ఆర్టిస్టుగా మారింది. అయితే, 2021 తర్వాత మాత్రం ఈ అమ్మడు ఎందుకనో సినిమాలకు గ్యాప్ ఇచ్చేసింది.

సెకెండ్ మ్యారేజ్.. తల్లైంది:పూజా రామచంద్రన్ 2010లోనే వీజే క్రెయిగ్‌ను వివాహం చేసుకుంది. అతడితో ఏడేళ్ల పాటు బంధాన్ని కొనసాగించిన తర్వాత 2017లో విడాకులు ఇచ్చింది. ఆ వెంటనే అంటే 2019లో పూజా రామచంద్రన్ జాన్ కొక్కెన్ అనే సినీ నటుడిని ప్రేమ పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్ 30న పూజా రామచంద్రన్ ఓ మగబిడ్డకు జన్మనిచ్చి మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది.
సోషల్ మీడియాలో బిజీగా:వీజేగా వర్క్ చేస్తున్నప్పటి నుంచే పూజా రామచంద్రన్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ తెలుగు భామ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతోంది. ఇక, ఈ మధ్య కాలంలో మరింత సందడి చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉంటోంది.

అందాల షోకు హద్దే లేదు:గతంలో కంటే ఈ మధ్య కాలంలోనే పూజా రామచంద్రన్ మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇందులో ఈ అమ్మడు ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తోంది. ఈ క్రమంలోనే తన ఘాటు ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతూ కుర్రకారును యమా కవ్విస్తోంది. గర్భంతో ఉన్న సమయంలోనూ హాట్ షో చేసి పూజా దేశ వ్యాప్తంగా సంచలనం అవుతోంది.
బీచ్‌లో అందాల వెల్లువ:ఈ మధ్యనే తల్లైన పూజా రామచంద్రన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు బీచ్‌లో స్విమ్‌సూట్ ధరించి ఓ రేంజ్‌లో బోల్డు షో చేసింది. వీటిలో ఆమె అందాలు మొత్తం ఆరబోస్తూ కవ్విస్తోంది. ఫలితంగా పూజా రామచంద్రన్ షేర్ చేసిన ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ పిక్స్ అన్నీ తెగ వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











