బిగ్ బాస్ పునర్నవి అందాల ప్రవాహం: అదేంటి ఇంతలా తెగించేసింది?
వాస్తవానికి తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలు పెద్దగా కనిపించే వారు కాదు. దీంతో టాలెంట్ ఉన్నా ఎంతో మంది తెర మీదకు రాలేకపోయారు. కానీ, కొందరు మాత్రం వచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. అందులో ఫైర్ లేడీ పునర్నవి భూపాలం ఒకరు. చాలా ఏళ్ల క్రితమే నటిగా ప్రయాణం మొదలు పెట్టిన ఈ చిన్నది.. కెరీర్‌ను ఎంతో కాలం నడుపుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు ఈ ఫీల్డుకు దూరంగా ఉంటోంది. కానీ, సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా పునర్నవి ఓ బోల్డు ఫొటోను షేర్ చేసింది. దాన్ని మీరూ చూడండి!
ఉయ్యాల జంపాల అంటూ: అచ్చ తెలుగమ్మాయి పునర్నవి భూపాలం 'ఉయ్యాల జంపాల' అనే సినిమా ద్వారా నటిగా పరిచయమైంది. అందులో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో కనిపించి మెప్పించిన ఆమె.. ఆ తర్వాత 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', 'పిట్టగోడ', 'మనసుకు నచ్చింది', 'ఈ సినిమా సూపర్ హిట్', 'ఎందుకో ఏమో' సహా చాలా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.

బిగ్ బాస్ ఎంట్రీతో ఫేమస్: చాలా చిత్రాల్లో హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా చేసినా పునర్నవికి అనుకున్న రీతిలో పేరు దక్కలేదనే చెప్పుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈమె బిగ్ బాస్ మూడో సీజన్‌లో పాల్గొనే ఛాన్స్ పట్టేసింది. అలా హౌస్‌లోకి వెళ్లిన కొత్తలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన పునర్నవి.. ఆ తర్వాత తన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలిచేది. ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుని క్రేజ్ పెంచుకుంది.

రాహుల్‌తో లవ్ ట్రాకుతో: పునర్నవి భూపాలం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు రాహుల్ సిప్లీగంజ్‌తో కలిసి చేసిన హడావిడి గురించి తెలిసిందే. వీళ్లిద్దరూ ప్రేమికుల్లా వ్యవహరిస్తూ ప్రేక్షకుల్లో ఎన్నో డౌట్లు క్రియేట్ చేశారు. అదే సమయంలో రొమాన్స్‌తోనూ రెచ్చిపోయారు. దీంతో వీళ్లిద్దరి మధ్య నిజంగానే ప్రేమ నడుస్తుందని అంతా భావించారు. ఆ తర్వాత ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి.

కమిట్‌మెంటల్ తర్వాత: బిగ్ బాస్ షోతో వచ్చిన క్రేజ్ వల్ల పునర్నవికి ఆఫర్లు వెల్లువెత్తుతాయని అంతా అనుకున్నారు. కానీ, ఆమె ఏమాత్రం రాణించలేకపోయింది. ఈ క్రమంలోనే నటుడు రఘునందన్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నానని చెబుతూ ఆమె సోషల్ మీడియాలో ఓ ఫొటోను వదిలింది. ఆ తర్వాత అది 'కమిట్ మెంటల్' అనే వెబ్ సిరీస్ పిక్ అని చెప్పింది. దీని తర్వాత పున్నూ ఫారెన్ వెళ్లిపోయింది.

అందులో ఫుల్ యాక్టివ్‌గా: పునర్నవి భూపాలం సోషల్ మీడియాలో చాలా బాగా యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తోంది. అంతేకాదు, తన వ్యక్తిగత కెరీర్ సంబంధిత విషయాలను పంచుకుంటోంది. దీంతో పునర్నవిని ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పుడు ఫారెన్‌లో ఉంటోన్న ఆమె తరచూ అక్కడి విశేషాలను సైతం షేర్ చేసుకుంటోంది.
అందాలతో మాయ చేస్తూ: సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న పునర్నవి భూపాలం.. ఆ మధ్య ఎక్కువగా గ్లామర్ షో చేస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఇక, ఈ మధ్య ఆమె స్టడీ కోసం ఫారెన్‌కు వెళ్లింది. అప్పటి నుంచి ఆమె మరింతగా హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంటోంది. అలా సినిమాలు లేకున్నా తన అందచందాలతో అభిమానులకు మజాను పంచుతూనే వెళ్తోంది.

పునర్నవి బోల్డ్ పిక్ వైరల్: ఈ మధ్య కాలంలో డోసు పెంచేసిన పునర్నవి భూపాలం తాజాగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో ఆమె విపరీతంగా డీప్ నెక్ టాప్‌లో బాగా షో చేస్తోంది. దీంతో పునర్నవి టాప్ అందాలు ఓ రేంజ్‌లో హైలైట్ అవుతూ కుర్రాళ్లను రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా ఈ పిక్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇది వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











