బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు చేదు అనుభవం.. చావు తప్పి కన్ను లొట్టబోయి!
బిగ్‌బాస్ తమిళ్ కంటెస్టెంట్, సినీ నటి రైజా విల్సన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ముఖానికి (ఫేస్) ట్రీట్‌మెంట్ కోసం వెళ్లితే వైద్యుడి నిర్వాకంతో కన్నుపోయినంత పనైంది. ఇటీవల కాలంలో ఫేషియల్ ట్రీట్‌మెంట్ కోసం వెళ్లిన సినీ ప్రముఖులకు ఇలాంటి అనుభవాలు ఎదురు కావడం పరిపాటిగా మారింది. తాజాగా తనకు ఎదురైన చేదు అనుభవం గురించి రైజా తన ఇన్స్‌టాగ్రామ్ ద్వారా పంచుకొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

చికిత్స వికటించడంతో
తన ముఖానికి చికిత్స వికటించడం గురించి రైజా విల్సన్ వెల్లడిస్తూ. . ముఖానికి చిన్న చికిత్స కోసం ఇటీవల నేను డాక్టర్ భైరవ్ సెంథిల్ హాస్పిటల్‌ను సందర్శించాను. అవసరం లేకున్నా నాకు ఓ చికిత్స చేశాడు. దాని ఫలితంగా నా కంటికి ప్రమాదం ఏర్పడింది అని ఆవేదన వ్యక్తం చేశారు.

నా కంటి కింద గాయం ఏర్పడి
నా కంటి కింద గాయం మాదిరిగా ఏర్పడి వాచిపోవడంతో డాక్టర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించాను. నేను సంప్రదించడానికి ప్రయత్నిస్తే నాతో మాట్లాడటానికి ఆసక్తి చూపలేదు. తాను లేనని ఆమె తన స్టాఫ్ చేత చెప్పించింది. తాను నగరంలో లేనని అబద్దం ఆడించింది అంటూ రైజా విల్సన్ పేర్కొన్నారు.

ఆ డాక్టర్‌తో మాకు కూడా ఇలాంటి అనుభవమే
రైజా విల్సన్ ఇన్స్‌టాగ్రామ్ పోస్టుకు భారీ స్పందన కనిపించింది. గతంలో మాకు కూడా ఇలాంటి ఘటననే ఎదురైంది. మాకు కూడా ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయి. ఈ డాక్టర్ కారణంగా మేము దారుణంగా ఇబ్బందుల్లో కూరుకుపోయాం అంటూ డాక్టర్ భైరవ్ సెంథిల్ గురించి నెటిజెన్లు దారుణమైన కామెంట్లు పెట్టారు

కోలీవుడ్‌లో రైజా విల్సన్
రైజా విల్సన్ కెరీర్ విషయానికి వస్తే... 2018లో ప్యార్ ప్రేమ కాద్ చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అనంతరం 2020లో వర్మ అనే వెబ్ సిరీస్‌లో కనిపించారు. ప్రస్తుతం దీ చేజ్, అలైస్, కథలిక్క యరుమిల్లై, ఎఫ్ఐఆర్, హ్యాష్‌ట్యాగ్ లవ్ చిత్రాల్లో నటిస్తున్నారు.

బిగ్ బాస్ తమిళ్ సీజన్ 2 ద్వారా
ఇదిలా ఉండగా, బిగ్‌బాస్ తమిళం రియాలిటీ షో ద్వారా రైజా విల్సన్ మరింత పాపులారిటీని సంపాదించారు. కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ తమిళ్ 2 షోలో తనదైన శైలిలో రాణించారు. ఈ షో ద్వారా రైజా విల్సన్‌కు మంచి ఫాలోయింగ్ లభించింది.


Click it and Unblock the Notifications











