స్విమ్ సూట్‌లో సాక్షి అగర్వాల్ .. నెవ్వర్ బిఫోర్ గ్లామర్ షో‌తో బిగ్‌బాస్ బ్యూటీ..!

మెగా రియాలిటీ షో బిగ్‌బాస్ ద్వారా పాపులర్ అయిన నటీనటులు మనదేశంలో ఎంతో మంది ఉన్నారు. వీరిలో అందాల భామ సాక్షి అగర్వాల్ కూడా ఒకరు. నటనతో పాటు అందంతోనూ ఈ అమ్మడు సెగలు రేపుతుంటారు. తమిళనాట క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సాక్షి అగర్వాల్.. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్‌లతో టాప్ లేపుతుంటారు. తాజాగా ఆమె చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

20 జూలై 1990న ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో జన్మించిన సాక్షి అగర్వాల్ చెన్నై, బెంగళూరులలో చదువుకున్నారు. అనంతరం మార్కెటింగ్ కన్సల్టెంట్‌గా కెరీర్ ప్రారంభించిన సాక్షి మాలిక్.. తొలుత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టీసీఎస్‌లో ఉద్యోగం చేశారు. అయితే ఓ ఛారిటీ షో కోసం మోడలింగ్ చేస్తున్న క్రమంలో ఆమె ప్రతిభను గుర్తించిన దర్శకులు పలు వాణిజ్య ప్రకటనల్లో అవకాశాలిచ్చారు. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ సూర్యతో కలిసి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌కు చేసిన యాడ్ ఫిల్మ్ సాక్షి కెరీర్‌ను మలుపు తిప్పింది.

Bigg Boss Fame Sakshi Agarwal Latest photoshoot with swimsuit

2013లో ఉద్యోగానికి స్వస్తి చెప్పిన సాక్షి మాలిక్.. నటిగా స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. తొలుత మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటించిన సాక్షి.. నయనతార - ఆర్యలు నటించిన రాజారాణిలో ఓ చిన్న పాత్రలో మెరిశారు. ఆ తర్వాత కన్నడలో సాఫ్ట్‌వేర్ గండ, యూగన్, తిరుట్టు వీసీడీ తదితర చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలో కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కాలాలో ఆయనకు కూతురిగా అలరించింది. అనంతరం విశ్వాసం, సిండ్రెల్లా, అర్నామనై 3, భఘీరా తదితర చిత్రాల్లో సాక్షి నటించారు. 12 ఏళ్ల కెరీర్‌లో తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించారు సాక్షి అగర్వాల్. ప్రస్తుతం ఆమె గెస్ట్ చాప్టర్ 2, ది నైట్ చిత్రాల్లో నటిస్తున్నారు.

తమిళ బిగ్‌బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన సాక్షి అగర్వాల్ .. తన మైండ్ , అందంతో హౌస్‌కు గ్లామర్ సోగసులు అద్దారు. దాదాపు 49 రోజుల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న సాక్షి తుది వరకు వెళ్లలేకపోయారు. అయితే బిగ్‌బాస్ ద్వారా ఆమె బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే తన చిన్ననాటి స్నేహితుడు నవనీత్‌తో ప్రేమలో పడి, ఆయనను పెళ్లి చేసుకున్నారు సాక్షి. ఈ ఏడాది జనవరి 2న గోవాలోని ఓ విలాసవంతమైన హోటల్‌లో జరిగిన వీరి పెళ్లి వేడుకకు పలువురు ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించింది. ప్రస్తుతం భర్తతో కలిసి హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు సాక్షి అగర్వాల్.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సాక్షి అగర్వాల్.. ఎప్పటికప్పుడు తన సినిమాలు, షోలు, ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా బ్లాక్ కలర్ స్విమ్ సూట్‌లో ఆమె చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇంకేందుకు ఆలస్యం సాక్షి అందాలపై మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X