14 నెలలు నరకం చూశా.. ఆ నిర్మాత వల్ల జీవితం నాశనం..

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించి వరుస హిట్స్ అందుకుంది. తన గ్లామర్‌, నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. కానీ కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో ప్రేమ పేరుతో జీవితంలోకి వచ్చిన ఓ వ్యక్తి కారణంగా ఆమె జీవితం పూర్తిగా మారిపోయిందట. శారీరకంగా, మానసికంగా తీవ్ర హింసను ఎదుర్కొన్నానని, 14 నెలలు నరకం అనుభవించానని ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు తన ముఖాన్ని బాక్సింగ్ బ్యాగ్‌లా వాడేవాడని, ప్రైవేట్ భాగాలపై కూడా దాడి చేసేవాడని చెప్పి షాక్ ఇచ్చింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? అసలేం జరిగింది?

ఆ హీరోయిన్ ఎవరో కాదు.. ఫ్లోరా సైనీ (ఆశా సైనీ). టాలీవుడ్, కోలీవుడ్‌లో చాలామంది స్టార్ హీరోలతో నటించి పేరు తెచ్చుకుంది. తెలుగులో ప్రేమతో రా, 'ప్రేమ కోసం', 'నరసింహ నాయుడు', నువ్వు నాకు నచ్చావ్‌, ప్రేమతో రా, మైఖేల్ మదన కామరాజు, ఆ ఇంట్లో వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. తెలుగులో ఒకప్పుడు బిజీ హీరోయిన్‌గా రాణించింది. "లక్స్ పాప" పాటతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. తెలుగు మాత్రమే కాదు.. తమిళం, కన్నడ, పంజాబీ, హిందీ భాషల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

Bigg Boss Flora Saini Reveals Shocking Abuse Story Says Producer Ruined Her Life Completely

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన ఆమె.. తన జీవితంలో ఎదుర్కొన్న భయంకర అనుభవాలను బయటపెట్టడంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ముఖ్యంగా ప్రేమ పేరుతో తాను ఎదుర్కొన్న శారీరక, మానసిక హింస గురించి ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. "14 నెలలు నరకం అనుభవించా.. ఆ నిర్మాత నా జీవితాన్ని పూర్తిగా నాశనం చేశాడు" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అందరినీ కలిచివేస్తున్నాయి.

అయితే కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే ఆమె వ్యక్తిగత జీవితం చీకటిలోకి వెళ్లిపోయిందని ఇప్పుడు బయటపడింది. సినీ రంగంలోకి వచ్చిన కొద్దికాలానికే ఓ ప్రముఖ నిర్మాత ప్రేమలో పడినట్లు ఫ్లోరా తెలిపింది. మొదట్లో ఎంతో ప్రేమగా కనిపించిన ఆ వ్యక్తి.. కొద్దిరోజుల్లోనే తన అసలు స్వరూపం చూపించాడని ఆరోపించింది. ప్రేమ పేరుతో తనను పూర్తిగా కంట్రోల్ చేయడం ప్రారంభించాడని, ఎవరితోనూ మాట్లాడనివ్వకుండా ఫోన్ లాక్కున్నాడని, సినిమాల్లో నటించొద్దని బలవంతం చేశాడని ఆమె తెలిపింది.

"అతను నా ముఖాన్ని బాక్సింగ్ బ్యాగ్‌లా వాడుకునేవాడు. ప్రైవేట్ భాగాలపై కూడా దాడి చేసేవాడు. నేను పూర్తిగా ఒంటరిగా మారిపోయాను" అని ఫ్లోరా చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక దశలో తనను తీవ్రంగా కొట్టడంతో ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోయానని తెలిపింది. ముఖ్యంగా "ఒకరోజు నా పొట్టపై బలంగా తన్నాడు.. ఆ బాధ తట్టుకోలేక అక్కడి నుంచి తప్పించుకున్నా" అని చెప్పడం అందరినీ కదిలించింది.

ఈ సంఘటనల తర్వాత తాను పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని, సాధారణ జీవితంలోకి రావడానికి చాలా నెలలు పట్టిందని ఫ్లోరా వెల్లడించింది. ఆ సమయంలో తనకు అండగా నిలిచింది కేవలం తల్లిదండ్రులేనని చెప్పింది. ప్రేమపై పూర్తిగా నమ్మకం కోల్పోయానని, మళ్లీ మనుషుల్ని నమ్మడానికి చాలా సమయం పట్టిందని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు తన జీవితం మళ్లీ సంతోషంగా ఉందని, చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వస్తుందని ధైర్యంగా చెప్పడం పలువురిని ప్రేరేపిస్తోంది.

ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో పాల్గొనడంతో ఫ్లోరా మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అంతేకాదు రానా నాయుడు, ది ట్రైలర్ వంటి వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను విజయవంతంగా కొనసాగిస్తోంది. బాలీవుడ్ చిత్రం భేడియాలోనూ ఆమె కనిపించింది. సెలబ్రిటీలు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారని, గ్లామర్ ప్రపంచం వెనుక ఎన్నో బాధలు దాగి ఉంటాయని ఆమె కథ స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X