అందుకే బ్రేకప్ చెప్పా.. అతడి చేష్టలను భరించలేకపోయా.. ఇనయ సుల్తానా
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఇనయ సుల్తానా (Inaya Sultana) మరోసారి వార్తల్లో నిలిచింది. బిగ్ బాస్ తెలుగు 6 ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఇనయ, షోలో తన స్ట్రాంగ్ పర్సనాలిటీ, స్ట్రెయిట్ ఫార్వర్డ్ మాటలు, గ్లామర్ లుక్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్న ఆమె, ఇటీవల 3 రోజెస్ సిరీస్‌లో నటించి మెప్పించింది. ఇటీవల మదం అనే సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉండగా, తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఈ అమ్మడు తన లవ్ ఫెయిల్యూర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.
తాజాగా ఇనయ సుల్తానా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. తన లవ్ ఫెయిల్యూర్ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 'కొట్టడం, తిట్టడం వల్లే మీ బ్రేకప్ జరిగిందా?' అనే ప్రశ్నకు ఆమె భావోద్వేగంగా స్పందిస్తూ.. 'కొట్టలేదు... కానీ నన్ను ఇష్టానుసారంగా తిట్టాడు. అది కూడా అందరి ముందే' అంటూ ఆ క్షణాలను గుర్తు చేసుకుంది. ఒక పెళ్లి ఫంక్షన్‌లో అందరి ముందు తీవ్రంగా మాట్లాడిన ఘటన తనను మానసికంగా పూర్తిగా కృంగదీసిందని, ఆ రోజు నుంచే అతనితో మాట్లాడటం మానేశానని తెలిపింది.

ఇక మీ ఇద్దరి మధ్య గొడవకు కారణం ఏమిటన్న ప్రశ్నకు, 'నా ఫేమ్, నాకు వస్తున్న ఆఫర్లు అతనికి నచ్చలేదు. జలసి ఫీలింగ్ వల్లే అలా ప్రవర్తించాడు' అంటూ స్పష్టంగా చెప్పింది. తన ఎదుగుదలని సహించలేకపోవడమే ఈ బ్రేకప్‌కు ప్రధాన కారణమని ఇనయ అభిప్రాయపడింది. ఇక సోషల్ మీడియాలో పర్సనల్ ఫోటోలు షేర్ చేయడం వల్ల వచ్చే అనర్థాలపై కూడా ఆమె స్పందిస్తూ.. 'అలా ఎక్కువగా షేర్ చేయడం వల్ల దిష్టి కూడా తగులుతుంది. అది కూడా మా బ్రేకప్‌కు ఒక కారణం అయి ఉండొచ్చు' అంటూ తన అనుభవాన్ని పంచుకుంది.
అదే సమయంలో గతంలో ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో, తన జీవితంలోని మరో చేదు అనుభవాన్ని ఇనయ బయటపెట్టింది. 'ఒక సమయంలో 'నేను చనిపోయినా ఎవరూ రారు' అనే భయం వేసింది. అప్పుడు గౌతమ్ అనే వ్యక్తి నా జీవితంలోకి వచ్చాడు. నా మీద ఎవరూ చూపించని ప్రేమను చూపించాడు' అంటూ చెప్పింది. ఆ ప్రేమను నిజమని నమ్మి అతనికి శారీరకంగా కూడా దగ్గరయ్యానని, తన సర్వస్వాన్ని అతనికి అర్పించానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
అయితే తన అవసరాలు తీరిన తర్వాత, తన ఫేమ్, డబ్బును వాడుకుని ఆ వ్యక్తి తనను వదిలేశాడని ఇనయ ఆరోపించింది. దీంతో తాను తీవ్రమైన మానసిక క్షోభను అనుభవించానని, నిద్ర మాత్రలు లేకుండా నిద్ర పట్టని స్థితికి చేరుకున్నానని చెప్పింది. తనను మోసం చేయడమే కాకుండా, సమాజం ముందు తప్పుగా చూపించేలా మానిప్యులేట్ చేశాడని ఆ వ్యక్తిపై ఆమె మండిపడింది. ఒక దశలో ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చాయని, కానీ తనను మోసం చేసిన వ్యక్తి కోసం ప్రాణాలు తీసుకోవడం వేస్ట్ అని భావించి ఆగిపోయానని ఇనయ వెల్లడించింది.
ఒంటరితనంలో తీసుకున్న తప్పుడు నిర్ణయం తన జీవితాన్ని నరకంగా మార్చిందని, తనలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదని ఆమె ఆకాంక్ష వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ బాధ నుండి బయటపడి, మళ్లీ తన కెరీర్‌పై ఫోకస్ పెట్టాలని ఇనయ ప్రయత్నిస్తోంది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











