నన్ను బలిపశువును చేశారు.. ఆ భయంతోనే అలాంటి సినిమాలు: సంజనా ఎమోషనల్

ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్‌గా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంజన గల్రానీ (Sanjjanaa Galrani).. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. సినిమాలతో పాటు వివాదాలతో కూడా తరచూ వార్తల్లో కనిపించే ఈమె.. గతంలో ఎదుర్కొన్న డ్రగ్స్ కేసు, జైలు జీవితం గురించి తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాను ఎదుర్కొన్న మానసిక వేదన గురించి చెప్పడంతో అందరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన సంజన.. తిరిగి కెరీర్‌పై ఫోకస్ పెడుతూ అవకాశాలు అందుకుంటున్నారు. ఇదే సమయంలో 'కిస్సిక్ టాక్స్' (Kissik Talks) ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన జీవితంలో జరిగిన అత్యంత బాధాకరమైన రోజుల గురించి ఓపెన్‌గా మాట్లాడారు.

సంజన.. తన సినీ ప్రయాణం గురించి మాట్లాడారు. "నేను ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను. నాకు ఎవరి సపోర్ట్ లేదు. అవకాశాల కోసం చాలా కష్టపడ్డాను. వచ్చిన ప్రతి అవకాశాన్ని పట్టుకోవాలని మాత్రమే ఆలోచించేదాన్ని" అంటూ ఆమె చెప్పారు. ఆ సమయంలో సినిమా అవకాశాలు కోల్పోతే మళ్లీ ఇండస్ట్రీలో నిలబడలేనేమో అనే భయం తనను వెంటాడేదని తెలిపారు. "ఈ సినిమా వదిలేస్తే తర్వాత అవకాశం వస్తుందా? గ్యాప్ వస్తే ఇండస్ట్రీ నన్ను మర్చిపోతుందా? అనే భయంతో నాకు నచ్చని పాత్రల్లో కూడా నటించాల్సి వచ్చింది. కొన్ని సినిమాలు చేయాలనిపించేది కాదు. కానీ 'ఇప్పుడు నో అంటే ఇక అవకాశాలు రావేమో' అనిపించి ఒప్పుకునేదాన్ని. అలా కెరీర్ కోసం చాలా రాంగ్ రూట్స్‌లోకి వెళ్లిపోయాను" అంటూ సంజన షాకింగ్ కామెంట్స్ చేశారు.

Bigg Boss Sanjjanaa Galrani Gets Emotional Over Drug Case Jail Trauma and Career Struggles

అంతేకాదు, గతంలో చేసిన కొన్ని పాత్రలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే తనకే బాధేస్తుందని చెప్పారు. "ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే.. నేను ఎందుకు అలా చేశానా అని అనిపిస్తుంది. నిజంగా నా మీద నాకే జాలి వేస్తుంది. ఇక చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి రావడంపై కూడా సంజన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "16, 17, 18 ఏళ్ల వయసులో అమ్మాయిలు అసలు ఇండస్ట్రీకి రావద్దు. ఆ వయసులో ఏది మంచిదో, ఏది చెడ్డదో అర్థం కాదు. ఇండస్ట్రీలో నిలబడటం చాలా కష్టం" అంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇక సంజన మాట్లాడుతూ.. "జైలుకు వెళ్లడం అంటే ఏమిటో నేను ప్రత్యక్షంగా అనుభవించాను. ఆ రోజులు గుర్తొస్తే ఇప్పటికీ వణుకు వస్తుంది. నిజంగా నేను చావు అంచుల వరకు వెళ్లి తిరిగి వచ్చాను. అలాంటి పరిస్థితి నా శత్రువులకు కూడా రావద్దు" అంటూ ఎమోషనల్ అయ్యారు. డ్రగ్స్ కేసులో తన పేరు రావడం, మీడియా ట్రయల్స్, సమాజం తనను చూసిన విధానం తన జీవితాన్ని పూర్తిగా మార్చేశాయని ఆమె తెలిపారు. "నేను ఎలాంటి తప్పూ చేయలేదు. కానీ నాపై తప్పుడు ఆరోపణలు చేసి నన్ను బలి పశువుని చేశారు. మందు, డ్రగ్స్ అంటూ నాపై లేనిపోని నిందలు వేశారు. నేను ఎంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

అంతేకాదు, బిగ్ బాస్ హౌస్‌లో పాల్గొనడానికి కూడా ఇదే ప్రధాన కారణమని సంజన వెల్లడించారు. "నా మీద పడిన మచ్చను తుడిచేయాలనే ఉద్దేశంతోనే నేను బిగ్ బాస్ 9 (Bigg Boss 9)లో పాల్గొన్నాను. నేను చెడ్డ అలవాట్లు ఉన్న అమ్మాయిని అయితే.. మూడు నెలలు బిగ్ బాస్ హౌస్‌లో ఉండగలిగేదాన్నా? అక్కడ ఒక్కరైనా నాలో అలాంటి ప్రవర్తన చూశారా?" అంటూ ప్రశ్నించారు. తనను సమాజం ఎలా తప్పుగా అర్థం చేసుకుందో చెప్పుకుంటూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

సంజన తెలిపిన వివరాల ప్రకారం.. బిగ్ బాస్‌కు వెళ్లే సమయంలో కూడా తన కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైందట. "అప్పుడు నా బిడ్డకు కేవలం ఐదు నెలలే. ఆ సమయంలో ఇంట్లో వాళ్లు, బంధువులు అందరూ నన్ను తిడుతూ.. ఇంత చిన్న పాపను వదిలి షోకి ఎలా వెళ్తావని ప్రశ్నించారు. నా భర్త కూడా 'పిచ్చి పట్టిందా?' అని అడిగాడు. కానీ నేను మాత్రం ఒకటే అనుకున్నాను.. రేపు నా కొడుకు పెద్దయ్యాక తన అమ్మ గురించి తప్పుగా వినకూడదు. సమాజం కూడా నా గురించి చెడ్డగా మాట్లాడకూడదు. అందుకే నా మీద ఉన్న నిందలు తొలగించుకోవడానికి బిగ్ బాస్‌కు వెళ్లాను" అని ఆమె తెలిపారు.

ఇక గతంలో తన అరెస్ట్ గురించి కూడా సంజన వివరించారు. 2020 సెప్టెంబర్ 8న బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు డ్రగ్స్ కేసు దర్యాప్తులో భాగంగా సంజనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం పెద్ద సంచలనంగా మారింది. పలు ప్రముఖుల పేర్లు బయటకు రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో సంజన పేరు రావడంతో ఆమెను అరెస్ట్ చేసి కొన్ని నెలల పాటు జైలులో ఉంచారు. తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన ఆమె.. తనపై వచ్చిన ఆరోపణలు నిజం కావని కోర్టు క్లారిటీ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు.

అయితే అప్పటికే తన కెరీర్‌, వ్యక్తిగత జీవితం తీవ్రంగా దెబ్బతిన్నాయని సంజన ఆవేదన వ్యక్తం చేశారు. "తప్పు చేయకపోయినా జైలులో ఉండాల్సి రావడం ఎంత బాధగా ఉంటుందో నేను అనుభవించాను. బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా మంది నన్ను అనుమానంతో చూశారు. ఆ అవమానం మాటల్లో చెప్పలేను" అంటూ ఆమె అన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో తనపై వచ్చిన ట్రోలింగ్, విమర్శలు తనను మానసికంగా పూర్తిగా కుంగదీసాయని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X