అవకాశం ఇస్తామని అలా చేశారు.. గుండె బద్దలవుతోందంటూ శ్వేతా వర్మ పోస్ట్.. ఇంతలోనే?
బిగ్ బాస్ షో లో ఎంటర్ అయిన వారు కొంతమంది బయటకు వచ్చాక వరుస అవకాశాలు సంపాదిస్తే కొంతమంది మాత్రం ముందు ఉన్న క్రేజ్ కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కొంత మంది మాత్రం ఎలా లోపలికి వెళ్లారో అలాగే బయటికి వస్తూ ఉంటారు అలాంటి వారిలో శ్వేత వర్మ ఒకరు. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె తాజాగా తాను ఇబ్బంది పడుతున్నానని తన గుండె బద్దలయింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ కొద్ది సేపటికే దాన్ని డిలీట్ చేసింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

బిగ్ బాస్ సీజన్ 5 తర్వాత
సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తూ కొన్ని సినిమాల్లో మంచి లీడ్ రోల్స్ లో కనిపిస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేసే శ్వేత వర్మ కి బిగ్ బాస్ మంచి గుర్తింపు తీసుకు వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 5 తర్వాత అంటే ఎవరు అని చాలా మందికి తెలిసింది. అంతకుముందే కొంతమేర ఆమెకు గుర్తింపు ఉన్నా సరే బిగ్ బాస్ ఆ గుర్తింపును రెట్టింపు చేసింది అని చెప్పక తప్పదు.

అభిమానులతో
బిగ్ బాస్ లో ఉన్న సమయంలో ఆమె నటించిన కొన్ని సినిమాలు విడుదలయ్యాయి. ఆ తర్వాత ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు దక్కిన దాఖలాలు లేవు. తాజాగా ఆమె ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. తనకు ఎదురైనా ఇబ్బందిని గురించి ఆమె అభిమానులతో పంచుకుంది. తనను ఎంతో ఇబ్బంది పెట్టారని చెబుతూ ఆమె భావోద్వేగానికి కూడా గురి అయింది.

మొదటిసారి కాదని
అయితే మరి ఏం జరిగిందో తెలియదు కానీ కొద్ది సేపటికే ఆ పోస్టులను ఇన్స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేసింది. అయితే అప్పటికే దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ లు కొందరు తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె షేర్ చేసిన దాని ప్రకారం తమ హార్ట్ బ్లీడ్ అవుతోందని తాను ఎంతో బాధలో ఉన్నాను అని చెప్పుకొచ్చింది. తనకు ఇస్తానని చెప్పిన పాత్రను తనకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఇది తనకు జరగడం మొదటిసారి కాదని ఆమె చెప్పుకొచ్చింది..

సోషల్ మీడియాకు దూరంగా
అయితే తన జీవితం మీద తనకు నమ్మకం కలగడం కోసం కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నానని ఒక వారం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని పోస్ట్ పెట్టింది. అయితే శ్వేతా వర్మ అలా పోస్ట్ పెట్టడానికి కారణం ఎవరయి ఉంటారు అనే విషయం మీద మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.

అవకాశం ఇస్తామని
ఆమెకు అవకాశం ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతో ఆ పోస్ట్ పెట్టినట్టు అర్థమవుతుంది. అయితే ఎందుకు డిలీట్ చేశారు అనే విషయం మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. అయితే బహుశా ఆమెకు ఆ అవకాశం మళ్ళీ దక్కి అయినా ఉండాలు లేదా ఆ అవకాశం ఇస్తానన్న వాళ్ళు ఆమెతో మాట్లాడి కన్విన్స్ చేసి ఉండాలి.


Click it and Unblock the Notifications











