నాకు గర్భస్రావం.. నా ప్రెగ్నెన్సీ పోవడానికి కారణం సీఎం విజయ్‌.. మండిపడ్డ యువ హీరోయిన్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్‌కు కొన్ని వర్గాల నుంచి అనూహ్యమైన మద్దతు లభిస్తుంటే.. మరొకొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత మొదలైంది. గత కొన్ని నెలలుగా ఆయన స్థాపించిన టీవీకే పార్టీపై విమర్శలు చేస్తున్న తమిళ సినీ ఇండస్ట్రీలో వర్థమాన తార, బిగ్‌బాస్ తమిళ సీజన్ 1 కంటెస్టెంట్ జూలీ అలియాస్ మారియా జూలియానా విరుచుకుపడ్డారు. సీఎం విజయ్‌ను టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు, వ్యక్తిగతంగా విమర్శలు కూడా చేశారు. జూలీ నిర్వహించిన తాజా ప్రెస్‌మీట్, ఆ సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు మీడియాలో చర్చనీయాంమైంది. ఆ చేసిన ఆరోపణలు ఏమిటనే వివరాల్లోకి వెళితే..

విజయ్ నేతృత్వంలోని తమిజ వెట్రి కజగం పార్టీ కార్యకర్తలు, అభిమానులు నన్ను దూషిస్తున్నారు. సోషల్ మీడియా, ఆన్ లైన్ ఫ్లాట్‌ఫామ్‌లో నాపై దారుణమైన కామెంట్స్ చేస్తూ నన్ను మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. నాపై చేస్తున్న ట్రోల్స్ గురించి చెన్నై కమిషనర్ కలిసి ఫిర్యాదు చేశాం. ఆ విషయం గురించి మీడియాకు చెప్పడానికి సమావేశాన్ని ఏర్పాటు చేశాం అని జూలీ అన్నారు.

Bigg Boss Tamil fame Julie attacks CM Vija

చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ.. టీవీకే కార్యకర్తలు నాపై చేస్తున్న వేధింపులపై మార్చి నెలలలో పోలీసులను కలిసి ఫిర్యాదు చేశాను. మొత్తం 8 మంది టీవీకే కార్యకర్తలు నాపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. దాంతో నేను మానసికంగా కుంగిపోయాను. ఆ కక్రమంలో వారిపై పరువు నష్టం దావా వేస్తూ సివిల్ కేసు ఫైల్ చేశాను. కానీ పోలీసులు మాత్రం నేను పెట్టిన కేసును క్రిమినల్ కేసుగా మార్చినట్టు నోటీసులు పంపారు. రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం నుంచి టీవీకే ప్రభుత్వం ఏర్పాటు అాయిన తర్వాత నా కేసు కూడా మారిపోయింది అని ఆమె ఎద్దేవా చేశారు.

టీవీకే కార్యకర్తలు చేసిన వేధింపులు తట్టుకోలేక నేను మానసికంగా కుంగిపోయాను. ఈ మధ్యనే నాకు పెళ్లి కూడా అయింది. ఆ వేధింపుల కారణంగా కడుపులో పెరుగుతున్న బిడ్డపై ప్రభావం పడింది. దాంతో నాకు గర్భస్రావం కూడా జరిగింది. అలా నా తొలి బిడ్డను కోల్పోయాను అంటూ కంటతడి పెట్టింది. ఈ ఆరోపణలు చేస్తున్నది సానుభూతి పొందడానికి కాదు. నా పరువుకు సంబంధించి, నాపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు సంబంధించిన వ్యవహారం. నా పరువు తీసున్న వారి నుంచి పరిహారం పొందాలని కేసు నమోదు చేశాను అని ఆమె అన్నారు.

నేను నా బిడ్డను కోల్పోవడానికి సీఎం విజయ్ అన్న కారణం. ఆయన ప్రత్యక్షంగా కారణం కాకపోయినా.. పరోక్షంగా కారణమయ్యారు. ఆయన పార్టీకి చెందిన 8 మంది నాపై దారుణంగా బిహేవ్ చేశారు. ఒకవేళ ఆయన తన కార్యకర్తలను అదుపులో పెట్టుకొని ఉంటే.. నాకు ఇలా జరిగేది కాదు. నాకు ఇలాంటి నష్టం జరిగి ఉండేది కాదు అని జూలీ ఆవేదన వ్యక్తం చేశారు.

నాపై ఆన్‌లైన్ ట్రోలింగ్ చేయడం పక్కా పథకం ప్రకారం జరిగింది. ఈ వేధింపుల వెనుక స్క్రీన్ ప్లే, డైరెక్షన్, కథనం అంతా టీవీకే సానుభూతి పరుడైన ఓ అడ్వకేట్. నాపై అవాస్తవాలతో అనేక ఆరోపణలు చేస్తున్నారు. తనకు నచ్చని వారిని సోషల్ మీడియా ద్వారా టార్గెట్ చేస్తూ ఇన్స్‌టాగ్రామ్ సీఎం అయ్యారు. ఇకనైనా ఆయన ప్రజా సంక్షేమం గురించి పట్టించుకోవాలని ఆమె అన్నారు.

నటి జూలీ విషయానికి వస్తే.. టెలివిజన్ నటిగా గుర్తింపు పొందారు. 2020 సంవత్సరంలో నాన్ సిరిథాల్ అనే చిత్రంతో సినీ రంగంలో ప్రవేశించారు. 2017లో బిగ్‌బాస్ తమిళం, బిగ్ బాస్ అల్టిమేట్ ద్వారా పాపులారిటీ సంపాదించారు. 2017 లో జల్లికట్టుపై చెన్నైలో నిర్వహించిన నిరసనల సందర్భంగా ఆమె మరింతగా వార్తల్లో నిలిచారు.

Read more about: julie vijay tvk
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X