twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్ 2: నూతన్‌ను బలిచేశారు, ప్రేక్షకుల ఓట్లకు విలువ లేదంటూ మాధవిలత సంచలనం

    By Bojja Kumar
    |

    Recommended Video

    Madhavi Latha Comments On Nutan Naidu And Ganesh Elimination

    బిగ్‌బాస్2 తెలుగు షో ఈ వారం ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ సారి డబల్ ఎలిమినేషన్ అమలు చేసిన బిగ్‌బాస్ సామాన్యులుగా హౌస్‌లో ఇంతకాలం కొనసాగిన గణేష్, నూతన్ నాయుడిని ప్రేక్షకుల నుండి తక్కువ ఓట్లు వచ్చాయని తేల్చేసి బయటకు పంపించేశారు. ఈ నేపథ్యంలో నటి మాధవిలత సంచలన కామెంట్స్ చేశారు. గణేష్ ఎలిమినేషన్ ఆమోద యోగ్యమే కాదు... నూతన్ ఎలిమినేషన్ అన్యాయం అంటూ వ్యాఖ్యానించారు. వాస్తవానికి నూతన్ కంటే అమిత్‌కు తక్కువ ఓట్లు వచ్చాయని.... కానీ అతడి కాకుండా ఎక్కువ ఓట్లు వచ్చిన నూతన్‌ను బయటకు పంపారని ఆరోపించారు.

     ప్రేక్షకుల ఓట్లకు విలువ ఉండదు

    ప్రేక్షకుల ఓట్లకు విలువ ఉండదు

    అమిత్‌కు అందరికంటే తక్కువ ఓట్లు వచ్చాయి. కానీ కేవలం రీ ఎంట్రీ ఇచ్చిన కారణంగా నూతన్ నాయుడికి ఎక్కువ ఓట్లు వచ్చినా ఎలిమినేట్ చేశారు. ‘బిగ్ బాస్' గేమ్‌షో ఇప్పటి నుండి ప్రేక్షకుల ఓట్లకు పెద్దగా విలువ ఉండదు అని మాధవిలత అన్నారు.

    నేను కామన్ గర్ల్ కదు

    నేను కామన్ గర్ల్ కదు

    నామీద కామెంట్లు చేసే ముందు ఒక విషయం గుర్తుంచుకోండి. రెమ్యూనరేషన్ ఇస్తున్నపుడు టీమ్‌కి ఒక లెక్క ఉండాలి. ఇది సినిమా కాదు రియాల్టీ షో. ఇక్కడ అంతా టీమ్ హెడ్స్ డిసైడ్ చేస్తారు. వాళ్లదే ఫైనల్ జడ్జిమెంట్... నేను కామన్ గర్ల్‌గా ఈ విషయం చెప్పడం లేదు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా చెబుతున్నాను అని మాధవిలత అన్నారు.

     ఇక్కడ కూడా ఫేవరెటిజం

    ఇక్కడ కూడా ఫేవరెటిజం

    ఫేవరెటిజం ఇక్కడ కూడా ఉంటుంది. నేను చెప్పేది రూమర్స్ కాదు. ఎప్పుడూ నిజాలే చెబుతాను. నమ్మితే నమ్మండి నమ్మకపోతే పొండి నాకేంటి. టీవీ షోస్ గురించి నాకే లెక్చర్స్ ఇచ్చేవాళ్లని చూసి నవ్వుకోవడం బెస్ట్ ఆప్షన్ అంటూ మాధవి లత వ్యాఖ్యానించారు.

    అమిత్‌ను ఫైనల్ విన్నర్ చేసినా షాకవ్వొద్దు

    అమిత్‌ను ఫైనల్ విన్నర్ చేసినా షాకవ్వొద్దు

    నాని జస్ట్ హోస్ట్ మాత్రమే. కానీ టీమ్ చర్చలో అతడి ఇష్టాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. అమిత్ ను ఫైనల్ విన్నర్ చేసినా షాకవ్వొద్దు.... అంటూ మాధవి లత వ్యాఖ్యానించారు.

    నాని, తనీష్ ఇద్దరూ నా హీరోలే

    నాని, తనీష్ ఇద్దరూ నా హీరోలే

    నాని, తనీష్ ఇద్దరూ నాతో చేసిన హీరోలే.... కానీ నేను వారికి ఎందుకు ఫేవర్‌గా మాట్లాడటం లేదు? వారు మంచి మాట్లాడేటప్పుడు నేను కూడా అభినందిస్తాను. అలాంటి దేమీ లేనపుడు నో ఫేవర్స్ నో ఎనిమిటీ.... అని మాధవి లత అన్నారు.

     బిగ్ బాస్ వల్ల ఏమిటి ఉపయోగమా?

    బిగ్ బాస్ వల్ల ఏమిటి ఉపయోగమా?

    బిగ్ బాస్ వల్ల ఏంటి ఉపయోగం అని చాలా మంది జనాలు అడుగుతున్నారు. వాళ్లను నేను ఒకటే అడుగుతున్నాను. సినిమా వల్ల ఏంటి ఉపయోగం? కేవలం వినోదం పంచడమే వాటి ముఖ్య ఉద్దేశ్యం. బిగ్ బాస్ షో కూడా అలాంటిదే. ఈ రోజుల్లో చిన్నతెరకు, పెద్ద తెరకు పెద్ద తేడా ఏమీ లేదని మాధవి లత తెలిపారు.

     మన జీవితంలో భాగం అయిపోయింది

    మన జీవితంలో భాగం అయిపోయింది

    టీవీ అనేది జనాల్లో ఒక భాగం అయిపోయింది. సింపుల్ లాజిక్ ఏమిటంటే టీవీ లేని లైఫ్ ఊహించుకోగలమా? కష్టమే కదా... సీరియల్స్ చూడకుండా లేడీస్ ఎంత మంది ఉంటారు? అలా ఉండటం చాలా బోరింగ్. పాథటిక్ సీరియల్స్ పాపులర్ అవ్వడం లేదా? ఎందుకంటే అవి మన జీవితంలో భాగం అయ్యాయి. వినోదం, థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామాలు, కామెడీ, హారర్, యాక్షన్ ఇలా ఎన్నో రకాల సినిమాలు వస్తున్నాయి. టీవీలో కూడా అంతే. బిగ్ బాస్ షార్ట్ సిరీస్ కనుక విన్నర్ ఎవరో తెలుసుకోవడంలో ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది.

    English summary
    "Amith got least votes.... but Due to re entries ....Nuthan eliminated. Simple BUGBOSS GAME STARTED ade Bigboss." Madhavi Latha said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X