Bigg Boss Telugu 4: బిగ్‌బాస్‌లో హాట్ హీరోయిన్ దివి వద్యా.. బ్యూటీ గురించి తెగ వెతుకుతున్నారట!

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4 అంగరంగ వైభవంగా ప్రారంభమైన తర్వాత ఇప్పుడు కంటెస్టెంట్ల గురించి ఆరా తీయడం ప్రేక్షకుల్లో మొదలైంది. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొందరు సెలబ్రిటీలు తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం లేకపోవడంతో వారి గురించి నెట్టింట్లో వెతుకులాట భారీగానే ప్రారంభమైంది. అయితే ఇప్పుడు బిగ్‌బాస్‌లో హాట్ భామల్లో ఒకరైన దివి వద్యా గురించి అందరూ ఆరా తీస్తున్నారు. ఇంతకు ఇలా బిగ్‌బాస్‌లో మెరిసిన దివి గురించిన వివరాలు ఇవే..

దివి వద్యా పర్సనల్ లైఫ్

దివి వద్యా పర్సనల్ లైఫ్

దివి వద్యాది విద్యాధికుల కుటుంబం నుంచి వచ్చారు. తల్లి, సోదరుడు ఇద్దరు వైద్యులే. కానీ దివి మాత్రం రూట్ మార్చి ఎంటర్‌టైన్‌మెంట్ పట్టాలెక్కారు. ఎంటెక్ పూర్తి చేసిన దివి సాఫ్ట్‌వేర్.. మరో ఫీల్డ్‌ను ఎంచుకోకుండా యాక్టింగ్‌పై దృష్టిపెట్టారు. పాకెట్ మనీ కోసం మొదట్లో మోడలింగ్ చేశారు. మోడలింగ్ చేస్తుండగానే మహేష్ బాబుతో మొదటి చిత్రంలో నటించే అవకాశం దక్కింది. మహర్షి చిత్రంలో నటించడం ద్వారా దివి మరింత గుర్తింపు పొందారు.

దివి వద్యా పక్కా హైదరాబాదీ..

దివి వద్యా పక్కా హైదరాబాదీ..

దివి వద్యా పక్కా హైదరాబాదీ. భాగ్య నగరంలోనే పుట్టి పెరిగిన దివి విద్యాభ్యాసం ఇక్కడే పూర్తి చేసుకొన్నారు. హైదరాబాద్‌ సంస్కృతి, సంప్రదాయలు అంటే ఇష్టం. ఆమెకు సంబంధించిన అభిరుచులు ఏంటో ఆమె ఇన్స్‌టాగ్రామ్ పేజ్ చూస్తే స్పష్టంగా అర్ధమవుతుంది. అర్బన్ కల్చర్‌తోపాటు ట్రెడిషినల్ లుక్స్‌తో ఆకట్టుకొనే అందం దివి సొంతం కావడం గమనార్హం.

14వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన దివి

14వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన దివి

అందం, అభినయంతోపాటు ఉన్నత విద్యను అభ్యసించిన దివి వద్యా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లోకి 14వ కంటెస్టెంట్‌గా అడుగు పెట్టారు. అక్కినేని నాగార్జున, కార్తీ నటించిన ఊపిరి చిత్రంలోని రూమ్ నంబర్ అనే పాటతో బిగ్‌బాస్ వేదికను మాస్, మసాల స్టెప్పులతో అదరగొట్టింది. ఆ విధంగా హోస్ట్ నాగార్జున పరిచయం చేసిన దివి వేదికపై మాటల్తో కూడా ఆకట్టుకొన్నారు. ఇలా తళుక్కున మెరిసిన దివి గురించి గూగుల్, సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారనే విషయం హాట్ టాపిక్‌గా మారింది.

సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేశాను

సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేశాను

హోస్ట్ నాగార్జునతో మాట్లాడుతూ.. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. సినిమాల్లో నటించాలన్నదే కోరిక. కొన్ని సినిమాల్లో నటించాను. కొన్ని వెబ్ సిరీస్‌లు చేశాను. చాలా మంది సెలబ్రిటీలుగా మారిన తర్వాత బిగ్‌బాస్‌కు వస్తాను. నేను బిగ్‌బాస్‌ నుంచి బయటకు వెళ్లే లోపు సెలబ్రిటీగా మారాలనుకొంటున్నాను. ఈ వేదికపైనే నిలుచోవడం అత్యంత ఆనందకరమైన క్షణాలు అని దివి చెప్పారు.

Recommended Video

Mahaprasthanam Movie Teaser | Happy Birthday Tanish | Filmibeat Telugu
దివి నిన్ను పాపులర్ చేస్తాను అంటూ నాగ్

దివి నిన్ను పాపులర్ చేస్తాను అంటూ నాగ్


ఇలా దివి మాటలతో ఇంప్రెస్ అయిన నాగార్జున.. నిన్ను సెలబ్రిటీగా పాపులర్ చేస్తాం అంటూ కితాబు ఇచ్చారు. కొందరు బిగ్‌బాస్‌కు వచ్చిన తర్వాతే సెలబ్రిటీలుగా మారారనే విషయాన్ని నాగ్ చెప్పి ఆమె జోష్‌ను మరింత పెంచారు. చిన్న గిఫ్టు ఇచ్చి దివిని ఇంట్లోకి నాగ్ పంపారు. ఇక దివి ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఇంట్లో జరిగే పరిణామాలే తెలియజేస్తాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X