రాంగోపాల్ వర్మతో జాగ్రత్త.. స్వాతి దీక్షిత్‌కు నాగార్జున వార్నింగ్
బిగ్‌బాస్ తెలుగు 4 గ్రాండ్ ఫినాలేను హోస్ట్ నాగార్జున అద్భుతంగా నిర్వహించారు. ఫినాలే సందర్బంగా ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను స్టేజ్ మీదకు పిలిచారు. వారితో బిగ్‌బాస్‌కు ముందు.. ఆ తర్వాత అనుభవాలను పంచుకొన్నారు. ఈ సందర్భంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్ స్వాతి దీక్షిత్ మాట్లాడుతూ..

నాగ్ మీరు హాండ్సమ్‌గా
హోస్ట్ నాగార్జున చూసి హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నారు. మీ ముందుకు వస్తే నాకు మాటలు రావు. మిమల్ని అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తున్నది అని అన్నారు. అందుకు సమాధానంగా నీవు కూడా అందంగా ఉన్నావు. నన్ను అలా చూడాలనిపిస్తే.. చూస్తూ ఉండిపో అంటూ నాగార్జున అన్నారు.

అమ్మా రాజశేఖర్ వల్లే అంటూ..
మీరు కేవలం పది రోజులే ఉన్నారు. అయినా మంచి రెస్పాన్స్ వచ్చింది అంటూ నాగార్జున అంటే.. అందుకు కారణం అమ్మా రాజశేఖర్. ఆయన వల్లే నేను నామినేట్ అయి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాను. ఏది ఏమైనా నాకు మంచి గుర్తింపు వచ్చింది అంటూ స్వాతి దీక్షిత్ చెప్పారు.

తెలుగు అమ్మాయినని తెలుసుకొన్నారు..
ఇక బిగ్‌బాస్ తర్వాత నేను హైదరాబాద్‌లో లేను. వేరే ప్లేస్‌కు వెళ్లాను. బయట నాకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఎక్కడికిపోయినా అందరూ నన్ను గుర్తుపడుతున్నారు. అందరూ నాతో ఫోటోలు దిగుతున్నారు. తెలుగు అమ్మాయి అని తెలుసుకొన్నారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ స్వాతి దీక్షిత్ చెప్పింది.

గోవాకు వెళ్లినట్టు తెలుసంటూ నాగ్ షాక్
బిగ్‌బాస్ తర్వాత హైదరాబాద్‌లో నీవు లేవని నాకు తెలుసు. నువ్వు గోవాకు వెళ్లినట్టు నాకు తెలిసింది. మీ అందరి మీద నేను గూఢచారులను పెట్టాను అని నాగార్జున అన్నారు. అన్ని విషయాలు మీ గురించి నాకు తెలిసిపోతుంటాయి అంటూ నాగార్జున అన్నారు.
Recommended Video

ఆర్జీవితో జాగ్రత్త అంటూ హెచ్చరిక
ఆ తర్వాత స్వాతి దీక్షిత్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ తర్వాత నేను రాంగోపాల్ వర్మతో సినిమా చేస్తున్నాను. ఆయన నాకు ఆఫర్ ఇచ్చారు అని తెలిపింది. అయితే ఆర్జీవితో కాస్త జాగ్రత్త అంటూ నాగ్ వార్నింగ్ ఇచ్చారు. దాంతో స్వాతి దీక్షిత్ నవ్వుల్లులో మునిగిపోయారు. అలా స్వాతి దీక్షిత్ తన బిగ్ బాస్ ప్రయాణం తర్వాత లైఫ్ అలా ఉందంటూ చెప్పింది.


Click it and Unblock the Notifications











