మినీ డ్రెస్‌లో మిలమిల మెరిసిన అషు రెడ్డి.. బోల్డ్ లుక్‌లో అందాలతో స్వైర విహారం!
బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. అలాగే కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పుణ్యమా అని మూవీ లవర్స్ తో పాటు సోషల్ మీడియాను ఫాలో అయ్యే అందరికీ పరిచయం అయ్యింది. మంచి పాపులారిటీని మూటగట్టుకుంది.
ఆమె అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతూ ఉంటారు. అందుకే సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈ బ్యూటీకి. క్రమం తప్పకుండా తన ఫాలోవర్స్ తో హాట్ హాట్ ఫోటోలు, వీడియోలను పంచుకుంటుంది. ఆ పర్పుల్ కలర్ డ్రెస్ పై ఎలాంటి డిజైన్ లేకపోయినా లుక్ మాత్రం డైనమిక్ గా ఉంది. మృదువుగా ఉన్న ఫాలింగ్ ఫ్యాబ్రిక్, ఆఫ్-షోల్డర్ డిజైన్ నెక్‌లైన్ భుజాలను హైలెట్ చేస్తోంది.

తన తాజా ఫోటోషూట్‌లో అషు స్ట్రాప్‌లెస్ పర్పుల్ బాడీకాన్ మినీ డ్రెస్‌లో చాలా అద్భుతంగా ఉంది. "మళ్లీ పరిచయం చేసుకోవడానికి నన్ను అనుమతించు" అనే క్యాప్షన్‌తో ఆషు రెడ్డి ఈ ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫొటోల్లో మంత్రముగ్దులను చేసేలా ఉంది ఆమె ధరించిన దుస్తుల స్టైల్. ఫారమ్-ఫిట్టింగ్ సిల్హౌట్ ఆమె వంపులను అందంగా హైలైట్ చేస్తుంది. అయితే ఆఫ్-షోల్డర్ డిజైన్ మరింత ఆకర్షణను జోడించింది.
అషు రెడ్డి మేకప్ విషయానికొస్తే.. దుస్తులకు తగ్గట్టుగా చక్కగా ఉంది. అషు లుక్ సహజమైన ఫినిష్ తో మచ్చలేని చందమామలా బ్యూటిఫుల్ గా ఉంది. ఆమె తన సహజ సౌందర్యాన్ని హైలెట్ చేస్తూనే డెప్త్, డెఫినిషన్‌ను సృష్టించి, టౌప్, బ్రౌన్ షేడ్స్‌తో మృదువైన, స్మోకీ ఐని ఎంచుకుంది.

అషు ఐలైనర్ లో డెఫినేషన్ లో ఉంది. అది ఆమె కళ్ళకు డ్రామాను జోడిస్తుంది. అయితే ఆమె కనురెప్పలు వాల్యూమైజ్ చేయగా, వంపు తిరిగి కళ్ళకు మరింత అందాన్ని చేకూర్చాయి. ఆషూ ఆ దుస్తులపైకి సున్నితమైన స్ట్రాపీ హీల్స్ ను వేసుకుంది. అది లుక్‌ను ఓవర్ అన్పించకుండా అద్భుతమైన లుక్ ను క్రియేట్ చేసింది.
అలాగే అషు సాధారణ ఆభరణాలను ఎంచుకుంది. మొత్తానికి దుస్తులను ప్రధాన హైలైట్‌గా కన్పించేలా రెడీ అయ్యింది. రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో పాల్గొని తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అషు రెడ్డి. తెలుగులో ఆమెకు అదే ఫస్ట్ షో. దీని ద్వారానే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది అషు.
అషు రెడ్డి కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె ఎ మాస్టర్ పీస్ : రైజ్ ఆఫ్ ఎ సూపర్ హీరో అనే చిత్రంలో నటిస్తోంది. సుకు పూర్వాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ, శ్రీకాంత్ కాండ్రాగుల, మనీష్ గిలాడ కూడా నటించారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో థియేటర్లలోకి రానుంది. గతంలో కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఛల్ మోహన్ రంగ చిత్రంలో కూడా అషు నటించింది. మరి ఎ మాస్టర్ పీస్ : రైజ్ ఆఫ్ ఎ సూపర్ హీరో అషు కెరీర్ కు ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











