Ashu Reddy మండుటెండల్లో హీట్ పెంచేస్తున్న అశు రెడ్డి.. ఓ రేంజ్‌లో ఎక్స్‌పోజింగ్‌తో జూ. సమంత గ్లామర్ ట్రీట్
బిగ్ బాస్ తెలుగు ఫేమ్, జూనియర్ సమంతగా పాపులారిటీ ఉన్న గ్లామర్ క్వీన్ అషు రెడ్డి సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే పాపులర్ అయ్యింది. ఈ బ్యూటీ షేర్ చేసిన మరో హాట్ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆ వీడియోపై మనం కూడా ఓ లుక్కేద్దాం పదండి.
అషు రెడ్డి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాను యూజ్ చేసే వాళ్ళందరికీ అషు రెడ్డి హాట్ ట్రీట్ గురించి బాగా తెలుసు. యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన బ్యూటీ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. కానీ ఆ ఆ సినిమాలేవి ఈ బ్యూటీకి అంతగా గుర్తింపును తెచ్చిపెట్టలేకపోయాయి. ఆ తర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసి బుల్లితెరపై షోలలో మెరిసింది. అలాగే సోషల్ మీడియాలో బోల్డ్ షో చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది.

ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ, ఆ తర్వాత డ్రగ్స్ కేసులో ఆమె పేరు రావడం, ఆ వార్తలు చూసి అషు పరువు నష్టం దావా అంటూ హల్చల్ చేయడం అందరికీ గుర్తుండే ఉంటుంది. అవన్నీ అయిపోయాక రోజురోజుకూ బట్టలను పొదుపు చేస్తూ బోల్డ్ షోతో యూత్ ను తెగ ఆకట్టుకుంటుంది. జూనియర్ సమంత గా బిగ్ బాస్ లోకి అడుగు పెట్టిన అషు రెడ్డి నెట్టీంట అందాలు ఆరబోస్తూ యూత్ ను తెగ అట్రాక్ట్ చేస్తుంది.

అందాల ఆరబోతలో రాటుదేలిన అషు రెడ్డికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. బిగ్ బాస్ తర్వాత ఆమె చేసే అందాల ప్రదర్శనకు సినిమా ఛాన్స్ లు రావడం ఖాయం అనుకుంటే అలాంటిదేమీ జరగలేదు. కానీ ఆమె సోషల్ మీడియాను ఆయుధంగా వాడుకోవడాన్ని మాత్రం మానలేదు.

తరచుగా హాట్ హాట్ ఫోటోలతో గ్లామర్ ట్రీట్ ఇస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. ఇదివరకు బొద్దుగా ముద్దుగా ఉండే అషు రెడ్డి ప్రస్తుతం సన్నజాజి తీగలా సన్నగా తయారైంది. ఈ సమ్మర్ లో రోజుకో హీట్ పుట్టించే ఫోటోలను పోస్ట్ చేస్తూ మండుటెండల్లో మంటను మరింతగా పెంచేస్తోంది అషు రెడ్డి. తాజాగా బ్లాక్ కలర్ లో ఉన్న ఓ హాట్ డ్రెస్ లో ఆమె ఇచ్చిన గ్లామర్ ట్రీట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం.
అషు రెడ్డి తాజాగా హై థై స్లిట్ హాట్ డ్రెస్ లో ఎక్స్పోజింగ్ చేస్తూ వయ్యారాలతో మతి పోగొట్టినంత పని చేసింది. చూపించి చూపించకుండా అందాలన్నీ ఆరబోస్తూ యూత్ కు కిక్ ఎక్కించే విధంగా ఉన్న ఆ పోస్ట్ ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ వీడియోను చూసిన నెటిజన్లు అషు రెడ్డిని సన్నిలియోన్ తో పోలుస్తూ ఆమె కంటే నువ్వే బెటర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
అంతేకాకుండా అషు రెడ్డి అందాల ఆరబోత తట్టుకోలేకపోతున్నాం. ఇట్స్ వెరీ హాట్ అంటూనే ఆమె ఫోటోలను వీడియోలను మరోసారి స్క్రోల్ చేస్తున్నారు. సినిమాల్లో నటించినా రాని పాపులారిటీని సోషల్ మీడియా ఉపయోగించుకొని పెంచేసుకుంటుంది అషు రెడ్డి. మరి ఈ బ్యూటీ నెక్స్ట్ స్టెప్ ఏంటో చూడాలి.


Click it and Unblock the Notifications











