తప్పు చేయలేదు.. నాపై తప్పుడు వార్తలా? మంగ్లీ పార్టీపై దివి వద్యా క్లారిటీ
మంగ్లీ బర్త్ డే పార్టీలో నిషేధిత మాదక ద్రవ్యాలు ఉపయోగించారనే ఆరోపణలపై నార్కోటిక్ అధికారులు దాడి చేసిన ఘటన సినిమా ఇండస్ట్రీలో కలకలం రేపింది. ఈ ఘటనలో పలువురుని అరెస్ట్ చేశారు. ఈ పార్టీలో పలువురు రాజకీయ నేతలు, సినీ తారలు కూడా ఉండటంతో ఈ వార్త మీడియాలో సెన్సేషన్‌గా మారింది. అయితే ఈ పార్టీలో పాల్గొన్నారంటూ వచ్చిన వార్తలపై యువ తార, బిగ్‌బాస్ ఫేమ్ దివి వాద్యా మీడియాకు తన వాయిస్ నోట్‌ను పంపించి వివరణ ఇచ్చారు. తన వాయిస్ నోట్‌లో ఆమె వెల్లడించిన వివరాల్లోకి వెళితే..
చేవెళ్లలోని ఓ రిసార్టులో మంగ్లీ బర్త్ డే పార్టీ పై నార్కోటిక్ అధికారులు దాడి చేశారు. ఆ దాడిలో 9 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ పార్టీలో దివి వద్యా, కాసర్ల శ్యామ్, సింగర్ ధనుంజయ్ కూడా ఉన్నారు అనే వార్త బయటకు వచ్చింది. అయితే తాను వెళ్లాను కానీ.. ఆ పార్టీలో తాను లేనని సినీ గేయ రచయిత కాసర్ల శ్యామ్ వివరణ ఇచ్చారు. అనంతరం దివి కూడా తాను వెళ్లాను కానీ.. అక్కడ ఏం జరిగిందో తనకు తెలియదు అని చెప్పారు.

మీడియాకు నా చిన్న రిక్వెస్ట్. ఎవరైనా బర్త్ డే పార్టీకి పిలిస్తే వెళ్లడం సహజం. కానీ అక్కడ ఏం జరుగుతుందో మనకు ఏం తెలుసు. వాళ్లకు సంబంధించిన తప్పులను మనపై తోయడం సరికాదు. నా గురించి మీరు కూడా నిర్ధారించుకొండి. నా తప్పు ఉంటే నా గురించి రాయండి. నా ఫోటో వేయండి. ఎలాంటి తప్పు లేకున్నా నా ఫోటో యూజ్ చేసి నా గురించి తప్పుగా రాస్తే ఎలా ఉంటుంది. నా కెరీర్‌కు ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా? నేను ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చి ఉంటానో మీకు తెలుసు కదా అని దివి వద్యా అన్నారు.
మిమ్మల్ని ఎవరైనా పిలిస్తే.. ఫ్రెండ్స్ బర్త్ డే అని వెళ్తారు. మంగ్లీ నా ఫ్రెండ్ అంటే.. ఆమె ఏదో సాదాసీదా వ్యక్తి కాదు కదా. నా ఫ్రెండ్ పిలిచారని నేను వెళ్లాను. అక్కడికి వెళ్లానని నా ఫోటోపెట్టి మరీ నా గురించి తప్పుడు వార్తలు రాస్తున్నారు. మీ ఫ్రెండ్ బర్త్ డే ఫంక్షన్‌కు వెళ్తే అక్కడ జరిగే సంఘటనలకు మీరు బాధ్యులు అవుతారా? నాకు చాలా బాధగా ఉంది. నా ఫోటో యూజ్ చేస్తే తొలగించండి. ఇందులో నాకు ఎలాంటి ప్రమేయం లేదు అని దివి వాద్యా అన్నారు.


Click it and Unblock the Notifications











