'నా లవర్ తో బ్రేకప్.. ఆ తర్వాతే ఆ కోరిక అలా తీర్చుకొన్నా'
హైదరాబాద్ లో పుట్టి పెరిగిన తెలుగుమ్మాయి దివి వాద్యా గురించి ఆడియెన్స్ కు అంతో ఇంతో పరిచయం ఉంటుంది. బిగ్ బాస్ 4తో ఈ ముద్దుగుమ్మ టీవీ ఆడియెన్స్ ను అలరించిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ఈ రియాలిటీ గేమ్ షోలో పాల్గొన్న తర్వాత దివికి మరింత గుర్తింపు దక్కింది. అప్పటి వరకు చిన్నా చితకా ఆఫర్లు అందుకున్న దివి ఆ తర్వాత కాస్తా మెరుగ్గానే సినీ అవకాశాలు అందాయి. దివి వాద్యా కూడా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. వెండితెరపై మెరుస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలోనూ తన అభిమానులను ఆకట్టుకుంటోంది.
నెట్టింట తన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంటూ అభిమానులను ఖుషి చేస్తుంటుంది దివి. ఈ క్రమంలోనే తన బ్రేకప్ స్టోరీ గురించి చెప్పి అందరి కంటకన్నీళ్లు తెప్పింది. ఆమె మాటలు వింటూంటే గుండె తరుక్కుపోతోంది. తను ఎంత బాధను అనుభవిస్తుందో ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది దివి.... తన బాయ్ ఫ్రెండ్ కోసమే తను సినీ రంగంలో అడుగుపెట్టినట్టుగా వివరించింది. తన కోసమే జీవితాన్ని ఇలా మార్చుకున్నానంటూ చెప్పుకొచ్చింది.

తను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం దివి జీవితంలో జరిగిన ఓ ఘటనే అని చెప్పుకొచ్చింది. ఒకరి మరణం, అలాగే తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అవ్వడమని చెప్పింది దివి. మంచిలీపట్నానికి చెందిన ఓ వ్యక్తిని దివి మనస్ఫూర్తిగా ప్రేమించిందంట. అతనితో కలిసి జీవితాంతం బతకాలని ఆశించింది. కానీ దేవుడి వీరిద్దని ఒకటి చేయలేదని బాధపడింది. ముఖ్యంగా తన లవర్ తమ్ముడు చనిపోవడంతో కథ మారిపోయిందని చెప్పింది. అతను తనకు ఎంతో మంచి స్నేహితుడని చెప్పింది. కానీ కళ్ల ముందే చనిపోవడం జీర్ణించుకోలేకపోయానని తెలిపింది.
అప్పటికే దివి వాళ్ల ఇంట్లో తన బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి ఫిక్స్ చేసుకుందంట. కానీ లవర్ తమ్ముడు చనిపోవడం బాధకలిగించిందని చెప్పుకొచ్చింది. తన బాయ్ ప్రెండ్ వాళ్ల అమ్మనాన్న అంటే తనకేంతో ఇష్టమని, మర్యాదగా ఉండేదాన్ని అని చెప్పుకొచ్చింది. చాలా పద్ధతిగల ఫ్యామిలీ అని కూడా చెప్పింది. సంప్రాదాయ కుటుంబంలో కోడలిని ఎలా ఉండాలని కోరుకుంటారో అలానే మెదిలాను. కానీ అతని తమ్ముడు ఆస్పత్రిలో చేరిన పదిరోజుల్లోనే ఇద్దరు దూరమయ్యారన్నారు. అతను చనిపోవడం, తన లవర్ తనకు దూరమై పోవడం అంతా ఒక కళలా జరిగిందని చెప్పుకొచ్చింది.

అంతే కాదు.. ఆ వెంటనే తన భాయ్ ఫ్రెండ్ కు కూడా ఇంట్లో వాళ్లు పెళ్లి చేసేశారని, ఇప్పుడు అతని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పుకొచ్చింది. కానీ తన బాయ్ ఫ్రెండ్ వాళ్ల తమ్ముడు చనిపోగానే ఇలా జీవితంలో ఏమీ సాధించకుండా చనిపోకూడదని ఫిక్స్ అయిపోయానని చెప్పుకొచ్చింది. ఏదేమైనా తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ జరిగిపోయాక.. ఇండస్ట్రీలోకి వచ్చేందని, నటనపై ఆసక్తితో పలు అవకాశాల కోసం వెతికాననింది. ఇక తన బాయ్ ఫ్రెండ్ అంటే ఎంతో ఇష్టమని, అతనంటే ఇప్పటికే చచ్చేంత ప్రేమ ఉందని కన్నీళ్లు పెట్టుకుంది. ఎక్కడ ఉన్న అతను సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నాని చెప్పుకొచ్చింది.
ఇక తన మనస్సుకు నచ్చిన వాళ్లు ఇంకా దొరకడం లేదనని, కలిసిన వారందరూ సెల్ఫీష్ గానే బిహేవ్ చేస్తున్నారని, నమ్మకం కలిగించే వారెవరూ లేరని చెప్పింది. ఇక ప్రస్తుతం కెరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టానని చెప్పుకొచ్చింది. ఇక దివి వాద్యాకు మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్'లో అవకాశం ఇచ్చి మంచి పుష్ ఇచ్చారని తెలిపింది. ఆ తర్వాత 'పుష్ప2'లోనూ మెరిసింది. ఇక రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ 'డాకూ మహారాజ్'లో టీవీ రిపోర్టర్ ఉమాదేవి పాత్రలో అలరించింది.


Click it and Unblock the Notifications











