మోనాల్ గజ్జర్ చేష్టలు చూస్తే షాకే.. తన సోదరిని సైతం అలాంటి పనుల్లో..
సుడిగాడు సినిమాతో టాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకొన్నప్పటికీ.. సుడి తిరగని హీరోయిన్ మోనాల్ గజ్జర్. అయితే బిగ్‌బాస్ సీజన్ 4తో ఈ బ్యూటీ సుడి తిరిగిపోయింది. టాలీవుడ్‌లో హాట్ హీరోయిన్‌గా, సెలబ్రిటీగా, టెలివిజన్ హోస్ట్‌గా మారిపోయింది.
బిగ్‌బాస్ తర్వాత అల్లుడు అదుర్స్ చిత్రంలో స్పెషల్ సాంగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకొన్న ఈ భామ పలు సినిమాల్లో నటించేందుకు సిద్దమవుతున్నారు. కథా చర్చల్లో ఉంటూ చాలా సెలక్టివ్‌గా సినిమాలను ఎంపిక చేసుకొంటున్నారు. ప్రస్తుతం తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి అనే సినిమాలో బిగ్‌బాస్ ఫేం అఖిల్ సార్థక్‌తో కలిసి నటిస్తున్నారు.

అయితే మోనాల్ గజ్జర్ ఖాళీ సమయాల్లో అడ్వెంచర్స్ ఈవెంట్స్‌లో పాల్గొంటూ తన సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నది. తనకు హార్స్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టం. అలాగే గంగ్ హో, ఐస్ స్కేటింగ్ లాంటి క్రీడలంటే తనకు మరింత ఇష్టమని పేర్కొన్నారు.
తనకు ఇష్టమైన వ్యవహారాల గురించి వెల్లడిస్తూ... పారా గ్లైడింగ్, ఇతర క్రీడలను నా సోదరితో ఎంజాయ్ చేస్తుంటాను. నా సోదరికి కొంచెం భయం ఎక్కువ.. ఆమెను ఆ భయాన్ని పోగొట్టి సాహోసేపేతమైన స్పోర్ట్స్‌లో ఇన్వాల్వ్ చేస్తున్నాను అని మోనాల్ గజ్జర్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











