పెళ్లికి సిద్ధమైన హీరోయిన్: బర్త్‌డే పార్టీలో షాకిచ్చిన బాయ్‌ఫ్రెండ్.. అందరి ముందే బయటపెట్టడంతో!

ఒక భాషలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్న వాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు. అలా మలయాళం సినీ పరిశ్రమ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. అద్భుతమైన నటనతో విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది టాలెంటెడ్ హీరోయిన్ రెబా మౌనిక జాన్. కెరీర్ మొత్తంలో చేసింది తక్కువ సినిమాలే అయినా ఎవరికీ సాధ్యం కాని రీతిలో గుర్తింపును అందుకుని వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. ఈ నేపథ్యంలో రెబా జాన్ పెళ్లికి సిద్ధమైంది. ఆమె బర్త్‌డే పార్టీలో ప్రియుడు షాకివ్వడంతో తప్పలేదు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

అలా పరిచయం.. తమిళంలోనూ ఎంట్రీ

అలా పరిచయం.. తమిళంలోనూ ఎంట్రీ

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి సినీ ప్రముఖుల దృష్టిలో పడింది కన్నడ పిల్ల రెబా మౌనిక జాన్. ఈ క్రమంలోనే మాతృ భాషలో కాకుండా మలయాళం నుంచి సినీ రంగ ప్రవేశం చేసింది. 'జాకోబింటే స్వర్గరాజ్యం' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ భామ.. ఆ తర్వాత 'పైప్పిన్ చువ్వటే ప్రణయం'లోనూ నటించింది. అనంతరం 'జారుగుండి' ద్వారా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

విజయ్ సినిమాతో దేశ వ్యాప్తంగా పేరు

విజయ్ సినిమాతో దేశ వ్యాప్తంగా పేరు

మొదటి సినిమాలోనే అద్భుతమైన నటనతో ఆకట్టుకోవడంతో ఇళయదళపతి విజయ్ - అట్లీ కాంబినేషన్‌లో వచ్చిన 'బిగిల్' సినిమాలో అవకాశం దక్కించుకుంది రెబా మౌనిక జాన్. ఈ సినిమాలో యాసిడ్ బాధితురాలిగా కనిపించిన ఈ బ్యూటీ.. అసాధారణ నటనతో ఆకట్టుకుంది. దీంతో దేశ వ్యాప్తంగా గుర్తింపును దక్కించుకుంది. అప్పటి నుంచి అన్ని ఇండస్ట్రీల్లోనూ హాట్ టాపిక్ అయింది.

వెంకటేష్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ

వెంకటేష్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ

ఇప్పటికే మలయాళం, తమిళం భాషల్లో పలు చిత్రాల్లో నటించింది రెబా మౌనిక జాన్. ఈ క్రమంలోనే సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తోన్న 'నారప్ప' ద్వారా టాలీవుడ్‌లోకి ఆరంగేట్రం చేస్తోంది. 'అసురన్' రీమేక్‌ రీమేక్‌గా వస్తోన్న ఈ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో ఆమె కనిపించనుందని సమాచారం. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను డీ సురేశ్ బాబు నిర్మిస్తున్నారు.

అక్కడ ఫుల్ బిజీ.. అన్నీ చెబుతోందిగా

అక్కడ ఫుల్ బిజీ.. అన్నీ చెబుతోందిగా

దక్షిణాదిలోని దాదాపు అన్ని భాషల్లోనూ నటిస్తోన్న రెబా మౌనిక జాన్.. షూటింగ్ ఉన్నా లేకున్నా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన కెరీర్‌కు సంబంధించిన విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలనూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన గ్లామరస్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

బర్త్‌డే పార్టీలో షాక్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్

బర్త్‌డే పార్టీలో షాక్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్

కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న రెబా మౌనిక జాన్.. ప్రస్తుతం తన స్నేహితుడు జోయీమన్ జోసెఫ్‌తో దుబాయ్ టూర్‌లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే గత రాత్రి అక్కడ ఆమె పుట్టినరోజు పార్టీ జరిగింది. దీంతో సర్‌ప్రైజ్ పార్టీ నిర్వహించిన అతడు.. అందరూ చూస్తుండగానే రెబా మౌనిక జాన్‌కు ప్రపోజ్ చేసేశాడు. దీనికి ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఫొటోను జోసెఫ్ షేర్ చేశాడు.

అందరి ముందే బయటపెట్టడంతో సిద్ధం

అందరి ముందే బయటపెట్టడంతో సిద్ధం

పుట్టినరోజు పార్టీలో జోసెఫ్ ప్రపోజ్ చేయడంతో షాకైపోయిన రెబా మౌనిక జాన్.. అతడితో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వెల్లడించింది. అంతేకాదు, ఆ తర్వాత అతడితో దిగిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో వదిలింది. దీంతో ఈ టాలెంటెడ్ హీరోయిన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అన్నట్లు రెబా మౌనిక జాన్.. టాలీవుడ్ హీరోయిన్ అను ఇమ్మాన్యూయెల్‌కు కజిన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X