GodFather's Blast Baby ఐటమ్ సాంగ్‌లో నందమూరి బేబి.. హాట్ స్టెప్స్‌తో మత్తెక్కించిన హీరోయిన్ ఎవరో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ చిత్రం భారీ విజయం దిశగా పరుగులు పెడుతున్నది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లూసిఫర్ మూవీ చిత్రం ఆధారంగా గాడ్‌ఫాదర్ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ఈ సినిమా క్లైమాక్స్‌లో భాగంగా భారీ యాక్షన్‌తోపాటు ఓ ఐటెం సాంగ్‌ను క్రేజీగా ప్లేస్ చేశారు. అయితే ఈ పాటలో అందాల ఆరబోతతో యువకుల్లో గుండెల్లో గిలిగింతలు పెట్టిన బాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే...

బ్లాస్ట్ బేబీ పాట సోషల్ మీడియాలో
గాడ్‌ఫాదర్ సినిమాలో తార్ మార్ టక్కర్ మార్, నజభజజజర పాటలను రిలీజ్ చేయగా మంచి స్పందన లభించింది. ప్రభుదేవా నృత్య దర్శకత్వంలో చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి స్టెప్పులేసిన తార్ మార్ టక్కర్ మార్ పాట దేశవ్యాప్తంగా వైరల్ అయింది. అయితే రిలీజ్‌కు ఒక్క రోజు ముందు మీడియాకు రిలీజ్ చేసిన బ్లాస్ట్ బేబీ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పాటలో శృంగారభరితంగా వారినా హుస్సేన్ వేసిన స్టెప్పులు హాట్ హాట్‌గా కనిపించాయి.

బింబిసారలో గులేబకావళి పాటలో
గాడ్‌ఫాదర్ మూవీలో బ్లాస్ట్ బేబీ పాటకు ముందు వారినా హుస్సేన్ ఇటీవల భారీ విజయం అందుకొన్న బింబిసార చిత్రంలోని స్పెషల్ సాంగ్‌లో నటించింది. నందమూరి కల్యాణ్ రామ్ నటించిన బింబిసార చిత్రంలో గులేబకావళి పాటలో అందాలతో అదరగొట్టేసింది. స్పెషల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ రావడం, ఆ పాట మరింత వైరల్ కావడంతో.. గాడ్ ఫాదర్ చిత్రంలో కీలక సందర్భంలో వచ్చే పాటలో నటించే ఆఫర్ దక్కించుకొన్నది.

వారినా హుస్సేన్ స్టెప్పులు మైండ్ బ్లోయింగ్ అంటూ
గాడ్‌ఫాదర్ చిత్రంలోని బ్లాస్ట్ బేబీ పాటలో వారినా హుస్సేన్ వేసిన స్టెప్పులు మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. భారీ క్లైమాక్స్‌లోకి తీసుకెళ్లే ఈ పాటలో వారినా హుస్సేన్ చూపించిన శృంగార భంగిమలు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. సెక్సీ స్టెప్పులతోపాటు గ్లామర్‌తో వారినా హుస్సేన్ ఆకట్టుకొన్నదనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నది.

మ్యూజిక్ ఆల్బమ్స్‌తో వారినా హుస్సేన్
వారినా హుస్సేన్ ఇటీవల కాలంలో నటించిన స్పెషల్ సాంగ్స్ పాపులరిటిని సాధించాయి. హిందీ, పంజాబీ, బంగ్లాదేశ్ మ్యూజిక్ ప్రపంచంలో వారీనా హుస్సేన్ నటించిన పాటలు చార్ట్‌బస్టర్‌లో టాప్‌గా నిలిచాయి. అందం, అభినయంతో తన పాటలతో ప్రేక్షకులకు మత్తెక్కిస్తున్నారు. తాజా బేబీ బ్లాస్ట్ సాంగ్‌తో కేకపుట్టించావు అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్‌తో జతకట్టనున్న బ్యూటీ
వారీనా హుస్సేన్ కెరీర్ విషయానికి వస్తే.. బింబిసారతో ప్రేక్షకుల ముందకు వచ్చారు. బాలీవుడ్‌లో తను వెడ్స్ మను, మాద్రి, తలైవి చిత్రాలను నిర్మించిన బ్యానర్‌లో దిల్ బిల్ అనే సినిమాలో ప్రస్తుతం నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమాలో నటించే అవకాశం ఉందనే వార్త ప్రస్తుతం మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇంకా పలు చిత్రాలతో బిజీగా వారీనా హుస్పేన్ ఉన్నారు. త్వరలోనే తన సినిమాలకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.


Click it and Unblock the Notifications











