Bipasha Basu: 43 ఏళ్ళ వయసులో తల్లి కాబోతున్న మహేష్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోలు రిలీజ్!

ఫ్యాషన్ ప్రపంచంలో మొదట మోడల్ గా తనకంటూ ఒక మంచి క్రేజ్ అందుకున్న బిపాషా బసు ఆ తర్వాత సినిమా ప్రపంచంలో చాలా త్వరగానే నిలదొక్కుకుంది. మొదట్లో ఆమె సౌత్ ఇండస్ట్రీలో కూడా కొన్ని సినిమాలు చేసింది. ముఖ్యంగా మహేష్ బాబుతో చేసిన టక్కరి దొంగ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ఆ సినిమా తర్వాత బాలీవుడ్లో ఒకానొక సమయంలో అగ్ర హీరోయిన్స్ తో పోటీ పడుతూ చక్రం తిప్పింది. అయితే రీసెంట్ గా ఈ బ్యూటీ తల్లి అయినట్లు కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రత్యేకమైన గుర్తింపు

ప్రత్యేకమైన గుర్తింపు

2001 నుంచి సినిమా పరిశ్రమంలో కొనసాగుతున్న బిపాషా బసు భాషతో సంబంధం లేకుండా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అయితే అందుకుంది. కేవలం రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా హారర్ క్రైమ్ స్టోరీలలో కూడా చాలా చక్కగా నటించి పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది.

బాక్సాఫీస్ హిట్స్

బాక్సాఫీస్ హిట్స్

ఒక నటి కేవలం గ్లామరస్ పాత్రలు మాత్రమే కాదు విభిన్నమైన ప్రయోగాత్మకమైన పాత్రలలో కూడా నటించగలరు అని బిపాషా బసు నిరూపించింది. ముఖ్యంగా అప్పట్లోనే బికినీలో వెండితెరపై ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది అనే చెప్పాలి. రాజ్ సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు దక్కింది. అలాగే జిస్మ్ , నో ఎంట్రీ, ధూమ్ 2 సినిమాలు కూడా ఈ బ్యూటీకి తన స్టార్ట్ డం పెంచుకుంది.

మహేష్ బాబు సినిమాలో..

మహేష్ బాబు సినిమాలో..

ఇక మోడల్ గా ఉన్నప్పుడే అనకు తెలుగు సినిమాలలో చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ చాలా సెలెక్టివ్ గా ఆలోచించి మహేష్ బాబుతో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2001లో టక్కరి దొంగ సినిమాలో ఈ బ్యూటీ గ్లామరస్ పాత్రలో ఎంతగానో కట్టుకుంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం వరుసగా అవకాశాలు అందుకుంది.

ప్రేమ, పెళ్లి

ప్రేమ, పెళ్లి

ఇక 2015 వరకు సినిమా పరిశ్రమలో కనిపించిన బిపాషా బసు ఆ తర్వాత మళ్లీ నటించలేదు. అప్పటికే ఆమె ఇండియన్ మోడల్ యాక్టర్ అయినటువంటి కరణ్ సీంగ్ గ్రోవర్ తో ప్రేమలో ఉంది. ఇక అతన్ని 2016లో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కేవలం కొన్ని ఫోటోలు మాత్రమే ఆమె షేర్ చేసుకుంటూ వచ్చింది.

బేబీ బంప్ ఫొటోలు వైరల్

బేబీ బంప్ ఫొటోలు వైరల్

అయితే 43 ఏళ్ల వయసులో ఆమె తల్లి అయినట్లుగా ఒక ప్రకటన చేయడం ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆమె తన బేబీ బంప్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం వైరల్ గా మారింది. ఆమెతోపాటు భర్త కరణ్ సీంగ్ కూడా ఆ ఫోటోలలో కనిపించాడు. ఈ విషయాన్ని ఆమె చాలా ఎమోషనల్ గా తెలియజేసిందే.

ఎమోషనల్ నోట్

ఎమోషనల్ నోట్

ఇదొక కొత్త సమయం అంటూ మా ప్రేమ జీవితంలో మేము ఎన్నో అనుభవాలను ఎంతో ఆప్యాయంగా పంచుకున్నాము.. ఇక మా ప్రేమ మధ్యలో మరొకరు కలవబోతున్నారు. మా కుటుంబం మొత్తం ముగ్గురం కాబోతోంది. ఇది మా ప్రేమకు మరో సృష్టి. మరొకరు కలవబోతున్నందుకు ఎంతో సంతోషపడుతున్నాను. మాపై చూపించిన ఎంతోమంది ప్రేమ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.. అంటూ బిపాషా బసు చాలా ఎమోషనల్ గా వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X