For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అర్ధనగ్నంగా మహేశ్ హీరోయిన్: ప్రెగ్నెన్సీ టైంలోనూ హాట్ షోతో అరాచకం

  |

  ఇండియా వ్యాప్తంగా ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా సందడి చేశారు. అందులో కొందరు మాత్రం తమదైన అందం, అభినయంతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. తద్వారా భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుని స్టార్లుగా వెలుగొందారు. అందులో బాలీవుడ్ హాట్ హీరోయిన్ బిపాషా బసు ఒకరు. చాలా కాలం పాటు నటిగా సందడి చేసిన ఈ బ్యూటీ.. ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరమైంది. కానీ, సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బిపాషా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

  అలా పరిచయం.. మహేశ్ మూవీ

  అలా పరిచయం.. మహేశ్ మూవీ

  సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే బిపాషా బసు మోడల్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టింది. ఇందులో తన ఫిగర్‌తో అందరినీ మాయ చేసింది. తద్వారా సినిమా అవకాశాలను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే 'అజ్‌నాబీ' అనే హిందీ సినిమాతో నటిగా పరిచయం అయింది. ఆ వెంటనే మహేశ్ బాబు 'టక్కరి దొంగ' సినిమాతో టాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది.

  బాత్రూంలో హాట్‌గా మెగా హీరోయిన్: ఆ డ్రెస్సు.. ఆమె ఫోజు చూశారంటే!

  ఎన్నో హిట్లు... స్టార్ హీరోయిన్‌గా

  ఎన్నో హిట్లు... స్టార్ హీరోయిన్‌గా

  కెరీర్ ఆరంభంలోనే ఎన్నో చిత్రాల్లో నటించిన బిపాషా బసుకు చాలా విజయాలు కూడా సొంతం అయ్యాయి. దీంతో ఆమెకు అవకాశాలు భారీగా రావడంతో పాటు హిట్లు కూడా చాలానే పడ్డాయి. ఇలా ఆమె కెరీర్‌లో 'రాజ్', 'జిస్మ్', 'నో ఎంట్రీ', 'కార్పోరోట్', 'గోల్', 'ధూమ్ 2', 'రేస్', 'ఓం శాంతి ఓం' వంటి చిత్రాల్లో అదిరిపోయే నటనతో అవార్డులు అందుకుంది.

  అప్పటి నుంచి సినిమాలు లేవు

  అప్పటి నుంచి సినిమాలు లేవు

  దాదాపు ఇరవై ఏళ్ల పాటు హీరోయిన్‌గా సందడి చేసిన బిపాషా బసు.. ఆగకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూనే వచ్చింది. కానీ, 2015లో వచ్చిన 'అలోన్' మూవీతో ఆమె కెరీర్‌ను ఆపేసింది. అప్పటి నుంచి ఈ భామ సినిమాల్లో నటించడం లేదు. కానీ, 2020లో 'డేంజరస్' అనే వెబ్ సిరీస్‌ను మాత్రం చేసింది. దీంతో బిపాషా ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉండిపోయారు.

  Poorna Marriage Gift: పూర్ణకు భర్త పెళ్లి కానుక.. బంగారంతో పాటు లగ్జరీ హౌస్.. వాటి ధర ఎంతో తెలిస్తే!

  సినిమాతో ఒక్కటై.. లవ్ మ్యారేజ్

  సినిమాతో ఒక్కటై.. లవ్ మ్యారేజ్

  సుదీర్ఘమైన కెరీర్‌లో బిపాషా బసు పర్సనల్ లైఫ్ విషయంలోనూ తెగ హైలైట్ అయ్యేది. ముఖ్యంగా ఈ బ్యూటీ పలువురు స్టార్ హీరోలతో ప్రేమాయణం సాగించింది. కానీ, ఎవరితోనూ మూడు ముళ్లు వేయించుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 'అలోన్' సినిమాలో పరిచయమైన కరణ్ సింగ్‌తో లవ్ ట్రాక్ నడిపి.. ఆ తర్వాత ఏడాదే వివాహం చేసుకుంది. అప్పటి నుంచి కెరీర్ ఆపేసింది.

  సోషల్ మీడియాలో సందడిగానే

  సోషల్ మీడియాలో సందడిగానే


  సినిమాల పరంగా బిజీగా ఉన్నా లేకున్నా బిపాషా బసు మత్రం సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ నిత్యం వార్తల్లోనే నిలుస్తోంది.

  వంద కోట్ల దర్శకుడితో బాలయ్య: పాన్ ఇండియాపై దండయాత్ర.. టాప్ ప్రొడ్యూసర్ భారీ ప్లాన్

  ప్రెగ్నెన్సీ.. ఆ ఫొటోలు షేర్ చేసి

  ప్రెగ్నెన్సీ.. ఆ ఫొటోలు షేర్ చేసి

  బిపాషా బసు వివాహం తర్వాత తన లైఫ్‌ను ఎంతో సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తన భర్తతో రొమాంటిక్‌గా దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటోంది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం ఈ భామ గర్భం దాల్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇందుకోసం బేబీ బంప్‌తో తీసుకున్న హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది.

  అర్ధనగ్నంగా బిపాషా బసు రచ్చ

  అర్ధనగ్నంగా బిపాషా బసు రచ్చ

  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే బిపాషా బసు.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె గర్భాన్ని చూపిస్తూ అర్ధనగ్నంగా ఫోజులు ఇచ్చింది. ఫలితంగా ఆమె బాడీలోని చాలా భాగం దర్శనమిస్తోంది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది. అదే సమయంలో ఆమెపై విమర్శలు కూడా వస్తున్నాయి.

  English summary
  Bollywood actress and a former model Bipasha Basu Very Busy in Social Media. Recently She Shared Few Hot Photos in her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X