For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బర్త్ డే స్పెషల్: రౌడీ బేబీ సాయి పల్లవి గురించి మీకు తెలియని నిజాలు!

|

సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన పేరు సాయి పల్లవి. చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సెలెక్టెడ్‌గా సినిమాలు ఎంచుకుంటూ హిట్ చిత్రాలతో దూసుకెళుతోంది.

సాయి పల్లవి కేవలం యాక్టర్ మాత్రమే కాదు.. మంచి డాన్సర్ కూడా. సౌతిండియాలో తమిళం, తెలుగు, మలయాళ చిత్రాల్లో నటించింది. త్వరలో కన్నడ చిత్ర సీమలో కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. నేడు(మే 9) సాయి పల్లవి పుట్టినరోజు. 27వ వసంతంలోకి అడుగు పెడుతోంది.

రౌడీ బేబీగా పాపులర్ అయిన సాయి పల్లవి

రౌడీ బేబీగా పాపులర్ అయిన సాయి పల్లవి

మలయాళ చిత్రం ‘ప్రేమమ్' మూవీ సాయి పల్లవికి స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఆ సినిమా విజయంతో తమిళం, తెలుగులో అవకాశాలు దక్కించుకుంది. ‘ఫిదా' మూవీ ఆమె స్థాయిని మరింత పెంచింది. తమిళంలో ధనుష్‌తో కలిసి నటించిన ‘మారి 2'లో రౌడీ బేబీ సాంగ్ సంచలన విజయం సాధించడంతో సాయి పల్లవి మరింత పాపులర్ అయింది.

సాయి పల్లవి యాక్టర్ అవ్వాలనుకోలేదు

సాయి పల్లవి యాక్టర్ అవ్వాలనుకోలేదు

సాయి పల్లవి యాక్టర్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. డాక్టర్ అవ్వాలనుకుంది. జార్జియాలో మెడిసిన్ డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినిమాల వైపు వచ్చింది. తన టాలెంటుతో పాటు అదృష్టం కూడా కలిసి రావడంతో వరుస అవకాశాలతో దూసుకెళుతోంది.

వారిని చూసి డాన్స్ నేర్చుకుంది

వారిని చూసి డాన్స్ నేర్చుకుంది

సాయి పల్లవి ఎవరి వద్దా డాన్స్ ట్రైనింగ్ తీసుకోలేదు. తనకు ఎంతో ఇష్టమైన నటీమణులు మాధురి దీక్షిత్, ఐశ్వర్య రాయ్ సినిమాల్లో చేసిన డాన్స్ వీడియోలు చూసి నేర్చుకుంది. సౌత్‌లో అద్భుతంగా డాన్స్ చేయగల హీరోయిన్లలో ఆమె కూడా ఒకరు.

తాను కేరళ వాసి కాకపోయినా...

తాను కేరళ వాసి కాకపోయినా...

తాను కేరళ వాసి కాకపోయినా ఓనమ్ పండగ జరుపుకునే అలవాటు సాయి పల్లవికి ఉంది. స్కూల్ డేస్ నుంచే ఆమె తన స్నేహితులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనేది. దాన్ని ఇప్పటికీ అలాగే కొనసాగిస్తోంది. ‘ప్రేమమ్' మూవీ తర్వాత సాయి పల్లవికి కేరళలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

ట్రైబల కమ్యూనిటీ నుంచి వచ్చి

ట్రైబల కమ్యూనిటీ నుంచి వచ్చి

సాయి పల్లవి తమిళనాడులో బడగ అనే ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. వారి భాషకు లిపి లేదు. ఆ కమ్యూనిటీ నుంచి వచ్చి ఇంత పెద్ద స్టార్ డమ్ సంపదించిన తొలి వ్యక్తి ఈవిడే. బడగ భాషను సాయి పల్లవి బాగా మాట్లాడుతుంది. దీంతో పాటు ఆమె ఇంగ్లీష్, తమిళం, మలయాళం, తెలుగు భాషలు మాట్లాడగలదు. ఫిదా సినిమాలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకున్న సంగతి తెలిసిందే.

కంగన రనౌత్ సినిమాలో తొలిసారి

కంగన రనౌత్ సినిమాలో తొలిసారి

2008లొ వచ్చిన తమిళ చిత్రం ‘ఢాం ఢూం' ద్వారా సాయి పల్లవి తొలిసారి తెరంగ్రేటం చేసింది. ఈ చిత్రంలో ఆమె కంగనా రనౌత్ బెస్ట్ ఫ్రెండ్ పాత్రలో నటించింది. ఇందులో జయరాం, జయంరవి, కంగనా రనౌత్, లక్ష్మీ రాయ్ ముఖ్య పాత్రల్లో నటించారు.

స్టార్ డమ్ అంటే ఎలా ఉంటుందో అప్పుడు తెలిసింది

స్టార్ డమ్ అంటే ఎలా ఉంటుందో అప్పుడు తెలిసింది

సాయి పల్లవి కెరీర్లో తొలి హిట్ మూవీ ప్రేమమ్. ఆ మూవీ పెద్ద హిట్టయిన తర్వాత ఓసారి దోహా ఎయిర్ పోర్టులో అభిమానులు తనను చుట్టు ముట్టడంతో స్టార్ డమ్ అంటే ఎలా ఉంటుందో అప్పుడు తెలుసుకుందట.

English summary
Birthday special: Unknown facts about Sai Pallavi. Sai Pallavi Senthamarai, commonly known as Sai Pallavi, is an Indian actress and dancer who appears in Tamil, Telugu, and Malayalam-language films. She is a recipient of several awards including two Filmfare Awards for her performances in the films Premam and Fidaa.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more