సెక్సీ హీరోయిన్‌పై విపరీతమైన ట్రోలింగ్.. స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఇలా చేసిందేంటి.!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలెబ్రిటీలు ఏం చేసినా న్యూస్ అయిపోతుంది. పొరపాటున వాళ్లేమైనా తప్పులు చేశారా న్యూసెన్స్ అవుతోంది. ఈ విషయం చాలా సందర్భాల్లో సుస్పష్టమైంది. తాజాగా మరో సెలెబ్రిటీ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. అది మరెవరో కాదు.. బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఈషా గుప్తా.
సినిమా షూటింగులతో బిజీ బిజీగా గడుపుతూ ఉండే ఈషా.. అదే సమయంలో నిత్యం సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలతో పాటు ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. అందుకే ఈషాకు సోషల్ మీడియాలో భారీ పాపులారిటీ ఉన్నది. ఆమె ఫోటోలకు వీరాభిమానులు ఉన్నారు. పొట్టి పొట్టి డ్రెస్‌లు వేసుకొని పెట్టె పోస్టింగ్‌లకు ఆమె అభిమానులు ఫిదా అవుతుంటారు.

ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఆమె ట్విట్టర్ ద్వారా 'అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే' అని ట్వీట్ చేసింది. దీంతో ఇండిపెండెన్స్ డే రోజు రిపబ్లిక్ డే అని ట్వీట్ చేయడంతో ఆమెపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ మాత్రం తెలియదా అంటూ విమర్శల వర్షం కురిపించారు. దీంతో ఆమె ఈ ట్వీట్‌ను డిలీట్ చేసింది.

అంతేకాదు, తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై ఈషా స్పందించింది. 'నేను ఈ పోస్ట్ చేయలేదు. నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. వాస్తవానికి నేను ఎయిర్‌ఫోర్స్ అధికారి కుమార్తెను. నాకు ఏ అకేషన్ ఎప్పుడో బాగా తెలుసు. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు' అని ఆమె వరుస ట్వీట్లు చేసింది. దీంతో రాద్దాంతానికి పుల్‌స్టాప్ పడిపోయింది.
ఈషా గుప్తా ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తోంది. వీటికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలతో పాటు మరికొన్ని వెబ్ సిరీస్‌లలో నటించడానికి చర్చలు జరుపుతోంది. ఇటీవల ఓ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో నటించడానికి ఓకే చెప్పేసినట్లు ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











