‘దీపికా పదుకొణెతో 2 ఏళ్లు డేటింగ్ చేశా.. నాకు ప్రపోజ్ కూడా చేసింది.. కానీ’
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె పేరు ఇటీవల వివాదాల్లోనే ఎక్కువగా వినిపిస్తోంది. కాగా తాజాగా ఆమెపై బాలీవుడ్ నటుడు ముజమ్మిల్ ఇబ్రహీం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రీసెంట్ గా తను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీపికా పదుకొణెపై తనకు ఉన్న సంబంధాన్ని తెలియజేశారు. గతంలో వారిద్దరూ డేటింగ్ చేశారంటూ పలు షాకింగ్ వివరాలను వెల్లడించారు. ఇప్పుడు బాలీవుడ్ ఈ విషయం హాట్ టాపిక్ గ్గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
దీపికా పదుకొణె రిలేషన్ షిప్స్..
నార్త్ లో ప్రస్తుతం దీపికా పదుకొణె టాప్ హీరోగా సెన్సేషన్ చేస్తోంది. మరోవైపు సౌత్ లోనూ ఈ ముద్దుగుమ్మకు భారీ ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. అయితే దీపికా పదుకొణె 2005 నుంచి హిందీ చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటోంది. ఈ క్రమంలో అక్కడి స్టార్ హీరోలతో కలిసి నటించింది. అయితే బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో దీపికా పదుకొణె 2008 నుంచి 2010 వరకు రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ అప్పట్లో బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇక ఆ తర్వాత వారు విడిపోవడంతో 2012 లో రన్వీర్ సింగ్ తో డేటింగ్ మొదలు పెట్టింది. ఇక 2018లో వారిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. 2024 సెప్టెంబర్ 8న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దువా అని చిన్నారికి నామకరణం చేశారు.

దీపికా పదుకొణెపై ముజమ్మిల్ ఇబ్రహీం వ్యాఖ్యలు..
బాలీవుడ్ నటుడు ముజమ్మిల్ ఇబ్రహీం ఇటీవల సిద్ధార్థ్ ఖన్నన్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీపికా పదుకొణెతో తన ప్రేమ కథను వివరించారు. 'మేమిద్దరం రిలేషన్ షిప్ లో ఉన్నాం. ముంబైలో నేను మొట్ట మొదటిసారిగా కలిసింది తననే. తను ఎప్పుడూ నన్ను బయటికి తీసుకెళ్లు అనేది. ఇక దీపికా పదుకొణె నాకు ప్రపోజ్ కూడా చేసింది. కానీ నేనే వదులుకున్నాను.
అప్పుడు నేను స్టార్. ఇంకా దీపికాకు ఫేమ్ రాలేదు. మోడల్ గానే ఉండింది. ఆమెను వదులుకున్నందుకు నాకేమీ బాధలేదు. కానీ తర్వాత దీపికా సూపర్ స్టార్ అయ్యింది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు నన్ను ఎవ్వరు గుర్తుపట్టరు.. ఆమెను అందరూ గుర్తిస్తారు. నేను దీపికాకు ఇప్పుడు పెద్ద ఫ్యాన్ ను. ఇది వాస్తవం' అని చెప్పుకొచ్చారు. ముజమ్మిల్ ఇబ్రహీం కామెంట్స్ తో ప్రస్తుతం బాలీవుడ్ లో విపరీతమైన చర్చ జరుగుతోంది. దీపికా పదుకొణె రణబీర్ కపూర్ తోనే కాకుండానే ఇతనితోనూ ప్రేమలో పడిందా? అంటూ చర్చ కొనసాగుతోంది.
ఇబ్రహీం మాటలతో రచ్చ..
ఇక ముజమ్మిల్ ఇబ్రహీం బాలీవుడ్ లో 2007లో 'ధోకా', 2009లో 'హార్న్ ఓకే ప్లీజ్', 'విల్ యూ మ్యారీ మీ', 'స్పెషల్ ఓప్స్' వంటి చిత్రాల్లో నటించారు. ఇక 2020 నుంచి పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆయనకు జీవన్ రక్ష పడక్, గాడ్ ఫ్రే ఫిలిప్స్ బ్రేవరీ అవార్డ్ లు అందాయి. సముద్రం నీటిలో మునిగి పోతున్న తన స్కూల్ మేట్, గోవాలో బ్రిటిష్ మహిళను కాపాడినందుకు ఆ రెండు అవార్డులు అందాయి.


Click it and Unblock the Notifications











