Aishwarya Rai Bachchan : బాలయ్య కాళ్లు మొక్కిన ఐశ్వర్యరాయ్.. ఐఫాలోనే స్పెషల్ అట్రాక్షన్‌గా!!

100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న భారతీయ చిత్ర పరిశ్రమ తన ప్రస్థానంలో ఎందరో నటీనటులను , సాంకేతిక నిపుణులను, దర్శకులను చూసింది. అయితే సమాజంపై ప్రభావం చూపినవారు, ఆల్‌టైమ్ గ్రేట్ అనిపించుకున్నవాళ్లు కొందరే ఉన్నారు. దేశ ప్రజల నిత్య జీవితంలో వారు భాగం. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నంత వరకు వారి పేరు అలాగే నిలిచి ఉంటుంది. అలాంటి స్టార్స్‌లో విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఒకరు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణమే ఆమెను ఇప్పటికీ జనంలో ఉంచుతోంది. ఆ వివరాల్లోకి వెళితే :

50 ఏళ్లు దాటినా ఇప్పటికీ చెక్కు చెరగని అందంతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌ను ఏలుతున్నారు ఐష్. ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్లు వచ్చారు, వెళ్లారు, ఇంకా వస్తూనే ఉన్నారు. కానీ ఆమె స్థానం మాత్రం ఇప్పటికీ ప్రత్యేకం. మూడు దశాబ్ధాలుగా ఇండియన్ సినిమాను ఐష్ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూనే ఉన్నారు. మిస్ వరల్డ్ కిరీటం కూడా ఆమె పెట్టుకున్నాకే దాని విలువ పెరిగిందా అన్నంతగా మెరుస్తుంటారు ఐశ్వర్యరాయ్. భారతదేశంలోనే రిచెస్ట్ హీరోయిన్‌లలో ఒకరిగా నిలిచారు.

Bollywood actress Aishwarya rai Bachchan touches Nandamuri Balakrishna s feet at iifa utsavam 2024

దేశానికి ఎంతో మంది అందమైన హీరోయిన్లను అందించిన మంగళూరులోనే ఐష్ పుట్టారు. చదువుకుంటూనే మోడలింగ్ చేసిన ఆమె.. అప్పట్లో మిస్ ఇండియా పోటీల్లో సెకండ్ ప్లేస్‌లో నిలిచారు. అయినప్పటికీ విశ్వాసం కోల్పోకుండా ప్రయత్నించి 1994లో ఏకంగా మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచి భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ వేదికపై మరింత పెంచారు. ఆమె విజేతగా నిలిచిన తర్వాత ఎంతో మంది భారతీయ అమ్మాయిలు మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని దేశానికి గౌరవం తెచ్చి పెడుతున్నారు.

ఈ నేపథ్యంలో సినిమాల్లో అడుగుపెట్టిన ఐశ్వర్యరాయ్ 1997లో తమిళ చిత్రం ఇద్దరుతో ముఖానికి మేకప్ వేసుకున్నారు. అదే ఏడాది హిందీలో ఔర్ ప్యార్ హో గయా, తమిళ్‌లో జీన్స్ చిత్రాలలో నటించి వరుస హిట్లు అందుకుని నెంబర్‌వన్ హీరోయిన్‌గా ఎదిగారు. ధూమ్-2 షూటింగ్ సమయంలో అభిషేక్ బచ్చన్‌తో ప్రేమలో పడిన ఐష్.. 20 ఏప్రిల్ 2007లో ఆయనను పెళ్లాడారు. 2011లో వీరికి కుమార్తె ఆరాధ్య జన్మించింది. కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఐశ్వర్యరాయ్.. తిరిగి బిజీ అవుతున్నారు. గతేడాది పొన్నియన్ సెల్వన్ సిరీస్‌తో ఆమె అలరించారు.

ఎంత ఎదిగినా ఒదిగే ఉండే ఐశ్వర్యరాయ్‌ని ఆ లక్షణమే ప్రత్యేకంగా నిలబెట్టింది. ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ (ఐఐఎఫ్ఏ)లో ఐష్ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ సందర్భంగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ మూవీకి గాను ఉత్తమ నటిగా ఐశ్వర్యరాయ్ ఎంపికైంది. ఈ అవార్డును గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా అందుకున్నారు ఐష్. అయితే అవార్డ్ అందుకోవడానికి వేదిక మీదకి వెళ్లిన ఐశ్వర్యరాయ్.. బాలకృష్ణ కాళ్లకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X