తెలుగు హీరోలను టార్గెట్ చేస్తున్న RRR బ్యూటీ.. మరో రెండు పాన్ ఇండియా సినిమాలు!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బాహుబలి తరువాత చాలా మార్పులు వచ్చాయి. మన సినిమాలకు కూడా నేషనల్ వైడ్ గా బిజినెస్ ఉందని అందరికి ఒక క్లారిటీ వచ్చింది. ఇక బాలీవుడ్ ప్రముఖులు కూడా టాలీవుడ్ కూడా పవర్ఫుల్ ఇండస్ట్రీ అని ఒక ఆలోచనకు వచ్చారు. అలాగే అక్కడి స్టార్స్ తెలుగు సినిమాలు చేయడానికి పెద్దగా ఆలోచించడం లేదు. ఇక త్వరలో RRRలో నటిస్తున్న హీరోయిన్ ఆలియా భట్ మరిన్ని పాన్ ఇండియా సినిమాలపై కన్నేసినట్లు తెలుస్తోంది.

మరో రెండు పాన్ ఇండియా సినిమాలు..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. గ్లామర్ లోనే కాకుండా నటనపరంగా కూడా ఎంతగానో క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ అవకాశాలను చాలా తెలివిగా అందుకుంటుంది. RRRలో నటిస్తానని ముందుగానే రాజమౌళిని రిక్వెస్ట్ చేసి అవకాశం దక్కించుకుంది. ఇక మరో రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులపై కూడా అమ్మడు కన్నేసినట్లు తెలుస్తోంది.

ప్రభాస్ సినిమాలో..
త్వరలో ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఒక పాన్ ఇండియా సినిమా స్టార్ట్ కానున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో హీరోయిన్ కోసం దర్శకుడు ఇటీవల కొంతమంది బాలీవుడ్ హీరోయిన్స్ ని అనుకున్నప్పటికి సెట్ కాలేదు. ఇక ఫైనల్ గా ఆలియా భట్ ని ఫిక్స్ చేసే ఛాన్స్ ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో తెలియదు గాని ఆలియా తెలుగులో పెద్ద హీరోలతో నటించడానికి ఏ మాత్రం అభ్యంతరం లేదని చెప్పింది.

KGF దర్శకుడితో..
ఇక జూనియర్ ఎన్టీఆర్ తో కూడా ఈ బ్యూటీ నటించే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. RRR తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆ తరువాత KGF దర్శకుడితో మరో పాన్ ఇండియా సినిమాను రెడీ చేయనున్నాడు. అయితే ఆ సినిమా కోసం ప్రశాంత్ నీల్ కూడా అలియా భట్ ని సెట్ చేసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Recommended Video

సందేహాలు లేకుండా గ్రీన్ సిగ్నల్
పాన్ ఇండియా సినిమాలు అంటే చాలు అలియా కథ ఏమిటని కూడా అడగడం లేదని టాక్ వస్తోంది. సాధారణంగా పాన్ ఇండియా అంటే మినిమమ్ బలమైన కథను ఎంచుకుంటారు. ఎదో ఒక కమర్షియల్ యాంగిల్ లో సక్సెస్ కావచ్చు అని అలియా తెలుగులో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలకు సందేహాలు లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తోందట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











