Alia Bhatt: ఇంటిపేరు మార్చుకున్న అలియా భట్ .. ఊపందుకున్న రూమర్లు
Alia Bhatt: బాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో బ్యూటీ అలియా ఒకరు. ఈ భామ తన అందం, అభినయంతో బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసిందనడంలో ఎటువంటి అతిశక్తిలేదు. పెళ్లై ఓ పాపకు జన్మనిచ్చిన కూడా ఈ అమ్మడు గ్లామర్ తగ్గలేదు. ఇప్పటికీ ఈ బ్యూటీ కుర్రాళ్ల ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్. తరచూ సోషల్ మీడియాలో మెస్మరైజింగ్ ఫోటోలను షేర్ చేస్తూ.. కుర్రాళ్ల నుంచి ముసలివారు మటలు పట్టిస్తోంది.
అలియా కెరీర్ విషయానికి వస్తే.. అలియా కేవలం 6 ఏళ్ల వయసులోనే బాల నటిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్లో అక్షయ్ కుమార్, ప్రీతి జింటా నటించిన సంఘర్ష్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. తర్వాత గంగుబాయి కతియావాడి, ఆర్ఆర్ఆర్,బ్రహ్మస్త్రం, సడక్-2, తఖ్త్, ఇన్షల్లా వంటి ఎన్నో సినిమాల్లో అద్భుతంగా నటించింది. ఇక ఆర్ఆర్ఆర్ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. రామ్ చరణ్ ప్రేయసిగా సీత పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది అలియా.

అలియా వ్యక్తిగత జీవితం.. బాలీవుడ్ క్యూట్ కపుల్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చే జంట రణ్‌వీర్ - అలియా. వీరిద్దరూ బెస్ట్ ప్రెంఢ్స్. బాల్య వివాహాలపై 'బాలిక వధు' అనే సినిమా తీయాలని సంజయ్ లీలా బన్సాలీ ఫొటోషూట్ చేశారు. ఆ ఫోటో షూట్ లో తొలిసారి అలియా.. రణబీర్ ను కలిసింది. ఈ సెట్ లో పరిచయం.. క్రమంగా స్నేహం గా, ఆ తరువాత ప్రేమగా మారింది. వీరిద్దరు కలిసి బ్రహ్మాస్రం సినిమాలో కూడా కలిసి నటించి జనాల్ని మెప్పించారు. 2022 ఏప్రిల్ 14న వీళ్లిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. అదే సంవత్సరం నవంబర్ లో పండంటి ఆడబిడ్డ జన్మించింది అలియా.
ప్రస్తుతం అలియా భట్ నటించిన తాజా చిత్రం జిగ్రా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ప్రజెంట్ ఈ మూవీని పూర్తి స్వింగ్‌లో ప్రమోట్ చేస్తోంది. ఈ చిత్రంలో తన సోదరుడి పాత్రలో నటించబోతున్న వేదాంగ్ రైనాతో ఆమె మొదటిసారి కనిపించనుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 11న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.

అలియా తన ఇంటిపేరును మార్చుకోబోతున్నారనే చర్చ ప్రారంభమైంది. రీసెంట్‌గా గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 2 కు హాజరైన అలియా ఇంటి పేరును మార్చుకోవడంపై క్లారిటీ ఇచ్చింది. ఆమె తన పేరు కు కపూర్‌ని చేర్చుకున్నారా లేదా రణ్ బీర్ చేర్చుకుంటారా? అనే సందేహాలపై అభిమానులకు స్పష్టత ఇచ్చింది. ఆలియా తన కొత్త చిత్రం 'జిగ్రా' ప్రమోషన్స్ లో భాగంగా తన జిగ్రా టీమ్ తో కలిసి శనివారం నాడు ఓ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సమయంలో ' హాయ్ అలియా భట్' అంటే.. దానికి అలియా బదులిస్తూ.. 'మే హూన్ అలియా భట్ కపూర్' (నేను అలియా భట్ కపూర్)అని చెప్పింది. ఆ కొత్త పేరు విన్న టీం మాత్రమే కాకుండా ఫ్యాన్స్ కూడా షాకయ్యారు.


Click it and Unblock the Notifications











