Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీకి ఘోర అవమానం.. ఇన్నాళ్లకు ఇలా..
Alia Bhatt: బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ భామ తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసి.. బాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు అలియా. పెళ్లై ఓ పాపకు జన్మనిచ్చిన కూడా ఈ అమ్మడు గ్లామర్ తగ్గలేదు. ఇప్పటికీ ఈ బ్యూటీ కుర్రాళ్ల ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్. తరచూ సోషల్ మీడియాలో మెస్మరైజింగ్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై తన కెరీర్‌లో ఎదుర్కొన్న అనుభవాల గురించి చెప్పుకొచ్చింది.
అలియా భట్ 2012లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే.. మొదటి సినిమానే అట్లర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో ఎన్నో అవమానాలను చవిచూసింది. కానీ, వెనకడుగు వేయకుండా భిన్నమైన కంటెంట్ ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ప్రస్తుతం అలియా భట్ బాలీవుడ్‌లో ప్రముఖ హీరోయిన్ జాబితాలో పేరు దక్కించుకుంది. అత్యంత పారితోషికం అందుకుంటోన్న వారిలో ఈ బ్యూటీ కూడా ఒకరు. ఇక ఈ అమ్మడు బాలీవుడ్ స్టార్ దర్శకుడు మహేష్ భట్ కుమార్తె.

ఇకపోతే అలియా సంఘర్ష్ సినిమాలో బాల నటిగా అద్భుతంగా నటించింది. తర్వాత స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీలో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత అలియా నటనకు హైవే, 2 స్టేట్స్, హంప్టీ శర్మ కీ దుల్హనియా, అగ్లీ, ఇంటికి వెళ్తున్నాను, షాందర్, కపూర్ & సన్స్, ఉడ్తా పంజాబ్, ఏ దిల్ హై ముష్కిల్, ప్రియమైన జిందగీ,గంగూబాయి కతియావాడి, డార్లింగ్స్, బ్రహ్మాస్త్ర, రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీ వంటి చిత్రాల్లో అవకాశం వచ్చింది. ప్రస్తుతం కూడా ఈ అమ్మడు పలు చిత్రాల్లో నటిస్తుంది.
అంతేకాకుండా.. ఈ అమ్మడు తెలుగు ప్రముఖ హీరోలై జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే ఈ క్యూటీ తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది. రామ్ చరణ్‌కు ప్రేయసిగా సీత పాత్రలో నటించి.. ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అయితే బాలీవుడ్ బ్యూటీ తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలు ముచ్చటించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.. అలియా బొద్దుగా ఉన్నానని లుక్స్ విషయంలో ఎప్పుడూ వర్రీ అవ్వలేదని తెలిపింది. కానీ సినీ ఇండస్ట్రీకి వచ్చాక మాత్రం చేంజ్ అవ్వాల్సి వచ్చిందని తెలిపింది. శరీరాకృతి విషయంలో ఎన్నో అవమానాలు ఫేస్ చేశానని పేర్కొంది. వెయిట్ లాస్ అవ్వడం కోసం తెగ కష్టపడ్డానని, తన కష్టాన్ని చూసి ఫ్రెండ్స్ కూడా విసిగిపోయారని తెలిపింది. దీంతో అలియాను స్నేహితులు డైటింగ్ స్టాప్ చేసి ప్రశాంతంగా ఉండమని చెప్పారని వ్యాఖ్యానించింది.
కానీ ఎవ్వరి మాటలు వినకుండా బరువు తగ్గే వరకు కష్టపడుతూనే ఉన్నానని అలియా ఇంటర్వ్యూలో తెలిపింది. అలాగే గర్భవతిగా ఉన్నప్పుడు కూడా శరీరాకృతి విషయంలో తన ఆలోచనలు కంప్లీట్‌గా మారిపోయానని వెల్లడించింది. రేఖా, షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్ వంటి వారే అలియాకు స్ఫూర్తి అని.. రేఖ వంటి వాళ్లని ఎవరూ రీప్లేస్ చేయరంటూ కొనియాడింది. డాన్స్ పరంగా ఐశ్వర్య సూపర్ అని, షారుఖ్ పడి లేచిన కెరటం అంటూ అలియా భట్ ఇంటర్వ్యూలో వీరి ప్రస్తావన కూడా తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











