టీమిండియా క్రికెటర్‌తో అనన్య పాండే డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ

Ananya Pandey: ఇండియాలో సినిమా, క్రికెట్ కు వీడదీయరాని సంబంధం ఉంది. అలాగే.. క్రికెటర్లంటే సినిమా వాళ్లకు, సినిమా వాళ్లంటే క్రికెటర్స్ కు క్రేజ్. ఈ రెండు రంగాలకు చెందిన సెలబ్రెటీల జీవితాలు కూడా ఒకేలా ఉంటాయి. వారి ప్రతి మూమెంట్ ను ఫ్యాన్స్ చూస్తునే ఉంటాయి. వారు ఎవరితోనైనా కలిసి, ఎవరితోనైనా మాట్లాడిన ఇట్టే వైరలవుతోంది. మరుక్షణంలో రూమర్స్ వస్తునే ఉంటాయి. పుకార్లు షికారు చేస్తాయి. అలాగే.. ఓ బాలీవుడ్ హాట్ బ్యూటీ ఓ స్టార్ క్రికెటర్ తో దిగిన ఫోటో వైరల్ కావడంతో వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే రూమార్స్ వస్తున్నాయి. ఈ రూమార్స్ పై ఆ బాలీవుడ్ బ్యూటీ స్పందించింది. ఇంతకీ ఆ బాలీవుడ్ హీరోయిన్ ఎవరో? ఆ స్టార్ క్రికెటర్ ఎవరు? ఇంతకీ అమ్మడు ఏం క్లారిటీ ఇచ్చిందో మీరు కూడా తెలుసుకోండి.

ఆ హాట్ బ్యూటీ ఎవరో కాదు. బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే. లైగర్‌ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ అమ్మడు. ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలిపోవడంతో బాలీవుడే పరిమితమైంది. ఇప్పటిదాకా అనన్య నటించిన సినిమాలు చెప్పుకోతగ్గ విధంగా విజయం సాధించకున్నా.. ఈ బ్యూటీకి గుర్తింపు కాకున్నా.. ఈ అమ్మడు తన అందాల ప్రదర్శనతో బాలీవుడ్‌లో నెట్టుకురాగలుగుతోంది. అటు బాలీవుడ్ చిత్రాలు, హాట్ వెబ్ సీరిస్ లతో ఈ అమ్మడు బిజీగా గడుపుతోంది. ఆమె నటించిన 'కాల్‌ మీ బె', 'కంట్రోల్‌' లతో పిచ్చ క్రేజ్ సంపాదించుకుంది. నిత్యం తన హాట్ ఫోటో షూట్ ను నెట్టింట్లో షేర్ చేస్తూ.. కుర్రాకారుకు చెమటలు పట్టిస్తోంది.

Bollywood Actress Ananya Pandey Clarifies On Rumours Dating With Cricketer Shubman Gill

ఇటీవల ఈ అమ్మడు భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్ లో డేటింగ్‌లో ఉన్నట్టు, వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎవరూ ధృవీకరించకపోయినా.. వారిద్దరూ రిలేషన్ లో ఉన్నరనే రూమార్స్ నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. ఈ విషయంపై అనన్య పాండే మౌనం వీడింది. ఇటీవల వైరలవుతున్న డేటింగ్ రూమార్స్ పై ఓ క్లారిటీ ఇచ్చింది అనన్య. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యాంకర్ మాట్లాడుతూ.. ఓ అభిమాని చేసిన కామెంట్స్ స్పందించాల్సిందిగా అనన్యను కోరింది. విరాట్ కోహ్లీ , అనుష్క శర్మ కూడా ఒక యాడ్ షూట్ సమయంలో కలుసుకున్నారని, ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారని ఓ కామెంట్ చేశారు.

ఈ కామెంట్ పై మీ స్పందనేంటనీ అనన్యను ప్రశ్నించగా. 'నాకు, శుభ్‌మన్ గిల్‌కి మధ్య అలాంటిదేమీ లేదు. మేము కేవలం ఆ యాడ్ షూటింట్ టైంలో కలిశాం. అది తప్ప ఇంకేమీ లేదు. శుభమాన్ తో తాను డేటింగ్ చేయడం' లేదని స్పష్టం చేసింది అనన్య. వాస్తవానికి టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, బాలీవుడ్ నటి అనన్య పాండేలు. వీరిద్దరూ 'బీట్స్ ఇండియా' కంపెనీకి అంబాసిటర్స్ గా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సదరు కంపెనీ సోషల్ మీడియా షేర్ చేసింది. ఈ ప్రకటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి.

Bollywood Actress Ananya Pandey Clarifies On Rumours Dating With Cricketer Shubman Gill

ఇలాంటి రూమార్స్ శుభ్‌మన్ గిల్ గానీ, అనన్యకు కూడా కొత్తేమి కాదు. సాధారణంగా ఈ హాట్ బ్యూటీ ఎక్కడ కనిపించిన అది వార్తగా మారుతోంది. గతంలో ప్రముఖ క్రికెటర్ పాండ్యా తో పలుమార్లు కనిపించడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ క్రేజీ రూమర్స్ బాలీవుడ్ లో గుప్పుమన్న విషయం తెలిసింది. వారి మధ్య మ్యాటర్ చాలా దూరం వెళ్తుందని సోషల్ మీడియాలో క్రేజీ టాక్. వాస్తవానికి వీరిద్దరూ మధ్య రూమర్స్ ఎలా మొదలయ్యాంటే.. అనన్య ఇంటి ముందు ఏకంగా 3 కోట్ల ఖరీదైన రేంజరోవర్ కారు కొనిచ్చారనే రూమార్స్ వచ్చాయి.

ఇక శుభ్ మన్ గిల్ విషయానికి వస్తే.. గతంలో గిల్ ఓ స్టార్ హీరోయిన్ రిద్ధిమా పండిట్ తో డేటింగ్ లో ఉన్నట్టు రూమార్స్ వచ్చాయి. ఆ పుకార్లపై నటి క్లారిటీ ఇచ్చి ఆ వార్తలకు చెక్ పెట్టింది. ఇది కాకుండా.. గిల్ పేరు బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్‌తో కూడా డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై ఇప్పటివరకు గిల్, సారా అలీ ఖాన్ గానీ స్పందిచలేదు.

More from Filmibeat

Read more about: ananya pandey shubman gill
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X