టాలీవుడ్ అగ్ర హీరోలపై ఆ ఐదుగురు ఫిదా.. బాలీవుడ్ భామల మోజుకు అసలు కారణమదేనా?
ప్రస్తుతం తెలుగు చిత్రసీమ స్థాయి మారిపోయింది. ఒకప్పుడు చిన్న సినిమాలకే పరిమితమైనా టాలీవుడ్.. నేడు భారీ బడ్జెట్ సినిమాలు , పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తూ.. సంచలనలకు కేరాఫ్ గా మారింది. దీంతో ఇతర ఇండస్ట్రీ తారాలు టాలీవుడ్ లో నటించాలని భావిస్తున్నారు. మరి ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్స్ తెలుగు హీరోల సరసన నటించాలని భావిస్తున్నారంట.. దీంతో ఆ టాలీవుడ్ పై మోజు పడుతున్న హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం..
ఒకప్పుడు టాలీవుడ్ ను చాలా చీప్ గా చూసేవారు. తెలుగు నటులను, ఇక్కడి సినిమాలను చాలా తక్కువ చేసి మాట్లాడే వారు . తెలుగు సినిమాలో రెండు ఫైట్ లు, నాలుగు పాటలు ఉంటే చాలు.. ఆ సినిమా హిట్ అవుతుందని ఎగతాళి చేసేవారు ఇతర ఇండస్ట్రీ వారు. కానీ టాలీవుడ్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోహీరోయిన్ లు మన టాలీవుడ్ వైపు తొంగిస్తున్నారు. ఇలా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన హీరోయిన్లు ఎవరో ఓ లూక్కేద్దాం..
ప్రస్తుతం టాలీవుడ్ లెవల్ మారిపోయింది. ఒకప్పుడు చిన్న బడ్జెట్ సినిమాలకే పరిమితమైనా తెలుగు చిత్ర సీమ.. నేడు భారీ బడ్జెట్ సినిమాలను , పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తూ.. సంచలనలకు కేరాఫ్ గా మారింది. తెలుగు సినిమాలు కేవలం ఒకే ప్రాంతానికి పరిమితంగా కాకుండా.. నేడు వర్డల్ వైడ్ గా దేశాల్లో విడుదలవుతున్నాయి. తెలుగు సినిమాలు కూడా ఆస్కార్ వేదికపై సగర్వంగా నిలుస్తున్నాయి. దీంతో ఇతర ఇండస్ట్రీ నటులు కూడా టాలీవుడ్ లో నటించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్ టాలీవుడ్ పై కన్నేస్తున్నారు. తెలుగు సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మలెవరో ఓ లూక్కేద్దాం..
1. దీపికా పదుకొనె Deepika Padukone:
అందులో ముందుగా దీపికా పదుకొనె.. ఆమె తన టాలీవుడ్ ప్రయాణాన్ని పాన్ ఇండియా మూవీ 'కల్కి 2898 AD'తో ప్రారంభించి.. తన కెరీర్ లో రిమార్కేబుల్ సక్సెస్ ను అందుకుంది. యంగ్ రెబల్ సార్ట్ ప్రభాస్ హీరోగా సక్సెస్ పుల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కల్కి 2898 AD'లో దీపికా పదుకొనె కీలక పాత్రలో నటించింది. ఆమె తన పాత్రకు జీవం పోసి.. విమర్శకులను సైతం మెప్పించింది. ఈ సినిమాలో ప్రభాస్, దీపికా పదుకొనె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, శోభన, మృణాల్ ఠాకూర్, మాళవిక నాయర్ వంటి అగ్ర తారలు నటించారు. ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదలైన ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. టాలీవుడ్ లోకి గ్రాండ్ సక్సెస్ తో ఎంట్రీ ఇచ్చిన దీపిక పదుకొనె కొత్త కథల కోసం వేచిస్తున్నట్టు తెలుస్తుంది.

2. జాన్వీ కపూర్ (Janhvi Kapoor)
జాన్వీ కపూర్.. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ కు పరిచయమైంది. తండ్రి బోనీ కపూర్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినా.. ఆమె ఆశించినా స్థాయిలో మాత్రం విజయాలను అందుకోలేకపోయిందనే చెప్పాలి. జాన్వీ కపూర్ లీడ్ రోల్ లో నటించిన .. 'ఉల్జా' , 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' బారీ హిట్ అవుతాయని భావించినా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఆ తరువాత అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైన 'బవాల్' విమర్శకులతో పాటు ప్రేక్షకుల్ని మెప్పించినా.. చెప్పుకోదగ్గ భారీ విజయాలు మాత్రం జాన్వీ కపూర్ ఖాతాలో లేవనే చెప్పాలి.
దీంతో ఆ ముద్దుగుమ్మ కన్ను టాలీవుడ్ పడింది. తన తల్లి శ్రీదేవీకి కలిసివచ్చిన ఇండస్ట్రీలో తనకు కూడా కలిసి వస్తుందనీ, తన అద్రుష్టాన్ని తెలుగు చిత్రసీమలో పరీక్ష కోవాలని భావించింది. ప్రస్తుతం ఆ అమ్మడు 'దేవర' సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. ఆమెకు తెలుగులో ఫస్ట్ స్ట్రెయిట్ సినిమా కూడా ఇదే. ఈ సినిమా తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జోడీగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కూడా నటించబోతుందట. అయితే.. రామ్ చరణ్ సినిమా కంటే ముందే.. ఈ ముద్దుగుమ్మ భారీ హిట్ అందుకుంటే.. టాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఫస్ట్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. అందుకని, ఈ ముద్దుగుమ్మ తన ఆశలన్ని ఎన్టీఆర్ 'దేవర' పెట్టుకుందట.

3. కృతి సనన్ (Kriti Sanon)
బాలీవుడ్ హాట్ గ్లామర్ బ్యూటీ కృతి సనన్ .. ఆమెకు టాలీవుడ్ కొత్తేమి కాదు. గతంలో సూపర్ స్టార్ మహేశ్ బాబుతో 'వన్ నేనొక్కడినే'సినిమాలో కలిసి నటించింది. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో సెటిల్ అయిన ఈ ముద్దుగుమ్మ చాలా గ్లాప్ తరువాత మరో సారి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నాగచైతన్యతో దోచేయ్, రెబల్ స్టార్ ప్రభాస్ సరసన 'ఆదిపురుష్'లో నటించి.. తన అద్రుష్టాన్ని పరీక్షించింది. కానీ, ఈ సినిమాలే లేవి కృతి సనన్ కి అనుకున్న పేరు తెచ్చిపెట్టలేవు. మెయిన్ గా ఆదిపురుష్ సినిమాపై ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న డిజాస్టర్ గా మిగిలిన విషయం తెలిసిందే.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో అలియా భట్ ఒకరు. ఆమె చాలా సంవత్సరాలు బాలీవుడ్(Bollywood)కే పరిమితమైంది. కానీ, ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా(RRR Cinema)లో నటించి టాలీవుడ్ తో అనుబంధాన్ని పెంచుకుంది. అలాగే.. ఆమెకు తెలుగు భాషపై ప్రత్యేక అభిమానం ఉంది. ఈ క్రమంలో ఆమె తెలుగు మాట్లాడటం కూడా నేర్చుకునే ప్రయత్నం చేసింది. వరుస హిట్లతో పుల్ స్వింగ్ లో ఆమె రాజమౌళి-మహేష్ బాబు సినిమా(Rajamouli Mahesh Babu Cinema)లో హీరోయిన్ గా నటించబోతుందని టాక్. ప్రిన్స్ మహేష్ బాబు- అలియా భట్ లను సిల్వర్ స్కిన్ పై జంటగా చూడాలని మహి ఫ్యాన్స్ చాలా ఎక్సైటింగ్ వేచిచూస్తురంట.

5. కియారా అద్వానీ (Kiara Advani)
ఇక టాలీవుడ్ లో మాత్రం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కియారా అద్వానీ. వాస్తవానికి బాలీవుడ్ హీరోయిన్ అయినా ..ఈ హాట్ బ్యూటీకి టాలీవుల్ లో పిచ్చా క్రేజ్ ఉంది. ముఖ్యంగా మహేశ్ బాబు హీరోగా నటించిన 'భరత్ అనే నేను'సినిమాతో తెలుగు చిత్ర సీమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. నటించిన మొదటి సినిమాతోనే మంచి మార్కులు సంపాదించుకున్నది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో'వినయ విధేయ రామ'సినిమాలో జత కట్టి మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా అనుకునంత హిట్ కాకపోయినా.. కియారాకు మాత్రం మంచి మార్కులే పడ్డాయని చెప్పాలి.

ఇక తాజాగా ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గేమ్ ఛేంజర్'సినిమాలో కియారా- రామ్ చరణ్ లు మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలా బాలీవుడ్ తారలు తెలుగు సినిమాలో నటించి, తమకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











