బాలీవుడ్ నిర్మాతకు దీపికా చుక్కలు.. 12 ఏళ్ల కిందనే నట్టింట ముంచేసి..

గ్లోబల్ బ్యూటీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలకు షాక్ ఇస్తోంది. దీంతో దక్షిణాది చిత్రాల్లో దీపికాపై ఒక రకమైన అభిప్రాయం ఏర్పడుతోంది. గతంలో తాను ఓకే చెప్పిన భారీ చిత్రాల నుంచి తప్పుకోవడం ఇప్పుడు నార్త్, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గ్గా మారింది. ఇప్పటికే ఈ బ్యూటీ ఇండియాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ చిత్రాన్ని రిజెక్ట్ చేసి హాట్ టాపిక్ గ్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని మరోలా చెప్పాలంటే ఆమె డిమాండ్లను తట్టుకోలేక దర్శక నిర్మాతలే ఆమెకు గుడ్ బై చెబుతున్నారు.

స్పిరిట్ చిత్రం వివాదం తర్వాత తాజాగా నాగ్ అశ్విన్ - ప్రభాస్ కాంబినేషన్ లో భారీ మైథలాజికల్ సైంటిఫిక్ యాక్షన్ ఫిల్మ్ కల్కి 2898 ఏడీ సీక్వెల్ నుంచి కూడా మేకర్స్ ఆమెను తొలగించినట్టు ప్రకటించారు. ఆమెతో సరైన ఒప్పందం లేకపోవడంతో తమ అగ్రిమెంట్ ను ముగించుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. కల్కి 2898 ఏడీ ప్రాజెక్ట్ లో దీపికా పదుకొణె ఉండబోదని వైజయంతి మూవీస్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇంతకీ ఆమె ఎందుకు వైదొలగిందనే అసలైన కారణాలను మాత్రం చెప్పడం లేదు. దాంతో పలు రూమర్లు ప్రచారంలో ఉన్నాయి.

Bollywood Actress Deepika Padukone Shocked to Producer Mid Shooting of Hindi Film

దీంతో దీపికా పదుకొణె గురించి గత విషయాలు కూడా బయటికి వస్తున్నాయి. కాగా దీపికా పదుకొణె గతంలో బాలీవుడ్ నిర్మాత నట్టింట ముంచేసిందని తాజాగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని బాలీవుడ్ ప్రొడ్యూసర్ రమేశ్ తౌరానీ బాలీవుడ్ మీడియాతో వెల్లడించడంతో నెట్టింట వ్యాప్తి చెందుతోంది. అయితే 13 ఏళ్ల కిందనే దీపికా పదుకొణె నిర్మాతకు చుక్కులు చూపించిందని, సినిమాకు ఒప్పుకొని చెప్పాపెట్టకుండా మధ్యలోనే వదిలేసి వెళ్లిందని చెబుతున్నారు.

2012లో బాలీవుడ్ దర్శకుడు అబ్బాస్-ముస్తాన్ రేస్ 2 అనే యాక్షన్ క్రైమ్ ఫిల్మ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీలో సైఫ్ అలీఖాన్, జాన్ అబ్రహం, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఈ చిత్రానికి రమేశ్ తౌరానీ నిర్మాతగా వ్యవహరించారు. 2013లో జనవరి 25న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద రూ.173 కోట్ల గ్రాస్ ను అందుకుంది. అయితే ఈ చిత్ర నిర్మాణ దశలో దీపికా పదుకొణె నిర్మాతకు ఊహించని షాక్ ఇచ్చిందంట.

రేస్ 2కు కేవలం 6 రోజులు షూటింగ్ కు హాజరై ఆ తర్వాత సెట్ కు రావడం మానేసిందంట దీపికా పదుకొణె. ఇక ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడం, మెసేజ్ లకు కూడా కనీసం స్పందించ లేదంట. హాలీవుడ్ మూవీలో అవకాశం వచ్చిందని, అందుకే ఈ ప్రాజెక్ట్ ను చెప్పాపెట్టకుండా వదిలేసినట్టు ఆమె సిబ్బంది చెప్పారు. 5 రోజుల పాటు ఆమె ముంబైలోనే లేదని చెప్పారంట. దాంతో నిర్మాతకు ఏం చేయాలో అర్థం కాలేదంట. రమేశ్ తౌరానీ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన 25 ఏళ్ల కెరీర్ లో అత్యంత అగౌరవకరమైన అనుభవం ఇదని రమేశ్ తౌరానీ అభిప్రాయపడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X