బాయ్ ఫ్రెండ్ తో జాన్వీ కపూర్ రచ్చ.. ఆయన ఎంత ధనికుడో తెలుసా?
బాలీవుడ్ యంగ్ హీరోయిన్, స్టార్ కిడ్ జాన్వీ కపూర్ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో పరిచయం అయ్యింది. దేవర చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇక మరోవైపు తన అభిమానులను జాన్వీ కపూర్ సోషల్ మీడియా పోస్టుల ద్వారా కూడా ఎంతగానో అలరిస్తూ ఉంటుంది. తన గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ తాజాగా తన ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంది. ఇంతకీ జాన్వీ కపూర్ ప్రియుడు ఎవరు? ఏం చేస్తాడు? ఎంత ఆస్తి ఉందనే వివరాల్లోకి వెళితే..
శ్రీదేవి కూతురుగా చిత్ర పరిశ్రమలోకి..
అలనాటి నటి, అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తల్లి పెద్ద నటి కావడం, తండ్రి బోణీ కపూర్ నిర్మాత కావడంతో ఆమె సినీ రంగ ప్రవేశం సులువుగా జరిగింది. ముంబైలోనే పుట్టి పెరగడం, ధీరుబాయ్ అంబానీ లాంటి ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుకోవడంతో చాలా యాక్టివ్ గా కనిపిస్తుంటుంది. 2018లో 'ధడక్' అనే చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఘోస్ట్ స్టోరీస్, గుంజన్ సక్సెనా, రూహి, గుడ్ లక్ జెర్రీ, మిలి, బావల్, రాఖీ ఔర్ ప్రేమ్ కహానీ, థేరీ బాతోమే ఐసా ఉల్జా జియా, మిస్టర్ అండ్ మిస్ మహి, ఉల్జా వంటి హిందీ చిత్రాల్లో నటించి మెప్పించింది.

టాలీవుడ్ లో జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీ..
ప్రస్తుతం యంగ్ హీరోయిన్లకు టాలీవుడ్ లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందానికి తోడు సరైన యాక్టింగ్ స్కిల్స్, ప్రేక్షకులతో నేర్పుగా కమ్యూనికేట్ కాగలిగితే నేషనల్ క్రష్ లు అయిపోతున్నారు. ఇక ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కేవలం టాలీవుడ్ నుంచే బిగ్ స్కేల్ చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. హాలీవుడ్ రేంజ్ లో సినిమాలు ఉండేలా దర్శకనిర్మాతలు, స్టార్ హీరోలు కృషి చేస్తున్నారు. ఇక ఇలాంటి పరిణమాలను గమనిస్తూ జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కేకవలం బిగ్ స్టార్స్ సరసన మాత్రమే నటిస్తూ ఉంది. టాలీవుడ్ ఎంట్రీనే ఎన్టీఆర్ సరసన 'దేవర'లో నటించడం విశేషం. ఇక రామ్ చరణ్ 'పెద్ది'లోనూ నటిస్తోంది. మరోవైపు అల్లు అర్జున్ సరసర కూడా నటించే అవకాశం లేకపోలేదు. ఇలా తనకంటూ స్పెషల్ స్ట్రాటజీతో టాలీవుడ్ లో పావులు కదుపుతోంది.
షికర్ పహరియాతో రిలేషన్ షిప్..
ఇక జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ నటుడు షికర్ పహరియాతో డీప్ రిలేషన్ షిప్ లో ఉందని తెలుస్తోంది. కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. బాలీవుడ్ లోని ఫంక్షన్లు, సినీ ఈవెంట్లు, ఫ్యామిలీ ఫంక్షన్లకు కూడా ఇద్దరూ కలిసి జంటగా కనిపిస్తున్నారు. అయితే షికర్ పహరియాతో టూర్లు, వేకేషన్లు కూడా వెళ్తోంది. ప్రస్తుతం లండన్ లో ఎంజాయ్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
షికర్ పహరియా ఆస్తుల నికర విలువ?
షికర్ పహరియా బాలీవుడ్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వ్యాపారవేత్త సంజయ్ పహరియా కొడుకు షికర్ పహరియా కావడం విశేషం. ముంబైలోనే నివసిస్తున్నారు. వామన డెవలపర్స్, మహాషాన్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్, భూతల ఫామ్ ల్యాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి కంపెనీలను కలిగి ఉన్నారు. ఈయన పోలో ప్లేయర్ కూడా. లండన్ లో ఇన్వెస్టిమెంట్ అనలిస్ట్ గా పని చేస్తున్నారు. ఎంటర్ టైన్ మెంట్ అండ్ గేమింగ్ కంపెనీ కూడా ఉంది. వీరి కుటుంబం ఆస్తుల్లో వేల కోట్లల్లో ఉండగా.. కేవలం షికర్ పహరియా పేరుపై 84 కోట్ల రూపాయలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











