ఇండియాలో రిచెస్ట్ హీరోయిన్.. 4600 కోట్ల ఆస్తితో టాప్ లో.. ఐశ్వర్యరాయ్, ప్రియాంక, దీపికా మాత్రం కాదు..

Juhi Chawla net worth: భార‌త‌దేశంలో అత్యంత సంపన్నురాలైన సినీ న‌టి ఎవరు అనగానే వెంటనే గుర్తుకు వచ్చే పేర్లు.. ప్రియాంక చోప్రా, దీపిక ప‌దుకొనే, ఐశ్వ‌ర్యారాయ్ ల పేర్లు గుర్తించుకు వస్తాయి. కానీ ఈ హీరోయిన్స్ కంటే.. రిచెస్ట్ యాక్టర్ ఒకరున్నారు. ఈ నటి ఆస్తి విలువ 100 కోట్లో.. 200 కోట్లో కాదు.. ఏకంగా రూ. 4600 కోట్లు. అలాగే.. గత శతాబ్దం క్రితం వరకు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించింది. వాస్తవానికి ఆ హీరోయిన్ కి ఈ మధ్యకాలంలో ఒక హిట్ సినిమా కూడా లేదు. అయినా.. సంపదలో ఆ బ్యూటీని మాత్రం అస్సలు టచ్ కూడా చేయలేదు. ఆమె దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు. ఇంతకీ ఆ రిచెస్ట్ హీరోయిన్ ఎవరంటే..?

హై.. హై రేంజ్లో కోట్లు సంపాదించిన హీరోయిన్ మరెవరో కాదు. బాలీవుడ్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ జూహీ చావ్లా. 1990 ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అమీర్ ఖాన్ నటించిన ఖయామత్ సే ఖయామత్ తక్ మూవీతో బాలీవుడ్ లోకి అరంగేట్రం చేసింది జూహీ చావ్లా. ఈ అమ్మడు తన అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న జూహీ చావ్లా. హిందీతో పాటు తెలుగు, త‌మిళ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. దాదాపు పదేళ్లకు పైగా ఎన్నో హిట్ మూవీస్లో నటించింది. 2000 తర్వాత నటించి ఆపివేసి.. మూవీ ప్రొడక్షన్ పై ఫోకస్ పెట్టింది. అప్పట్లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ బ్యూటీ ప్రేమించిందనీ, కానీ , వీరి ప్రేమకు జూహీ చావ్లా తండ్రి నో చెప్పడంతో వీడిపోయారని టాక్.

Bollywood Actress Juhi Chawla is Richest Heroine In India her Net Worth Of 4600 Crore

ఈ బ్యూటీ తాజాగా వార్తల్లో నిలిచింది. ప్రముఖ బాలీవుడ్ స్టార్, ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా వంటి స్టార్ హీరోయిన్స్ ను వెనక్కి నెట్టి.. భార‌త‌దేశంలో అత్యంత సంపన్నురాలైన సినీన‌టిగా జూహీ చావ్లా రికార్డు కెక్కింది. హురున్ ఇండియా నివేదిక ప్రకారం రిచెస్ట్ హీరోయిన్ గా జూహీ చావ్లా నిలిచింది. సెలబ్రెటీల లిస్ట్ లో షారుక్ ఖాన్ అత్యంత ధ‌నిక న‌టుడిగా నిలిస్తే.. హీరోయిన్స్ ల్లో జూహీ చావ్లానే మొదటి స్థానంలో నిలిచింది.ఈ జాబితా ప్రకారం. జూహీ చావ్లాకు రూ. 4,600 కోట్ల ($554 మిలియన్లు)నిక‌ర ఆస్తులు ఉన్నట్టు హురూన్ ఇండియా వెల్ల‌డించింది. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ INR 7,300 కోట్ల ($880 మిలియన్లు)ఆస్తులతో అత్యంత సంపన్న నటుడిగా మొదటి స్థానంలో నిలిచారు.

బాలీవుడ్ స్టార్ నటి జూహీ చావ్లా.. తన సినిమా కెరీర్ పరంగా నటన ప్రాధాన్యత తగ్గించినా.. ఆమె సినిమా నిర్మాత‌గా కొన‌సాగారు. కొన్నిసార్లు క్యారెక్టర్ ఆర్టిస్ గా నటించింది. తన జూహీ ప్రొడక్షన్స్ లో షారుఖ్ పార్టనర్. డ్రీమ్స్ అన్‌లిమిటెడ్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో జూహీ చావ్లా పార్టనర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ బాలీవుడ్ బ్యూటీ నైట్ రైడర్స్ క్రికెట్ ఫ్రాంచైజీ సహ-యజమాని కూడా. ఇలా జూహీ ఆదాయం ఎన్నో రెట్లు పెరిగింది. ఈ జాబితాలో ఐశ్వర్య రాయ్ (రూ. 900 కోట్లు), ప్రియాంక చోప్రా (రూ. 850 కోట్లు), అలియా భట్ (రూ. 550 కోట్లు), దీపికా పదుకొనే (రూ. 400 కోట్లు), కత్రినా కైఫ్ (రూ. 240 కోట్లు) తరువాత స్థానంలో నిలిచారు.

Bollywood Actress Juhi Chawla is Richest Heroine In India her Net Worth Of 4600 Crore

గత నెలల రోజుల క్రితం ఫోర్బ్స్ విడుదల చేసిన తాజా నివేదికలో బాలీవుడ్‌ సెలెబ్రెటీలే కనిపించారు. 2024 సంవత్సరంలో అత్యధికంగా సంపాదిస్తున్న టాప్ 10 ఇండియన్ యాక్టర్స్ ను గుర్తించారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నిలిచారు. అతను ఒక్కో సినిమాకు 150 కోట్ల నుండి 250 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ఈ జాబితాలో రెండవ స్థానంలో దక్షిణ భారత సూపర్‌స్టార్ రజనీకాంత్ ఉన్నారు. ఆయన ఒక్కో సినిమాకు 115 కోట్ల నుండి 170 కోట్ల వరకు సంపాదిస్తాడని పేర్కొంది.

More from Filmibeat

Read more about: juhi chawla aishwarya deepika
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X