49 ఏళ్ల వయసులో పాతికేళ్ల అమ్మాయిలా పరువాలు ఆరబోసిన కాజోల్.. ఈ ఫొటోలు చూశారా?
బాలీవుడ్ హాట్ బ్యూటీ కాజోల్ దేవగన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1992లో బెఖుదీ సినిమాతో తెరంగేట్రం చేశారు ఈ ముద్దుగుమ్మకు తొలి సినిమానే చేదు అనుభవం మిగిల్చింది. సినిమా ఫ్లాప్ గా నిలిచింది. కానీ ఆమె నటనకు మాత్రం మంచి స్పందనే వచ్చింది. తొలి సినిమాలోనే నటనతో అందరినీ మెస్మరైజ్ చేసిన కాజోల్ అగర్వాల్ ఆ తర్వాత ఏడాదే.. షారుఖ్ ఖాన్ తో కలసి బాజీగర్ సినిమాలో నటించింది. ఈ సినిమా హిట్టు కావడంతో ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ముఖ్యంగా కాజోల్ అందం, అభినయానికి పెద్ద ఎత్తునే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
ఆ తర్వాత కూడా అనేక అద్భుతమైన చిత్రాల్లో నటించింది. పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన నటించిన ఈమె విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ లతో కలసి యే దిల్లగీ సినిమాలో నటించిన ఆమె... 1995లో ఏకంగా ఐదు చిత్రాల్లో చేసింది. కరణ్ అర్జున్, దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే వంటి సినిమాల్లో ఆమె నటనకు మంచి మార్కులు రావడమే కాకుండా... ఆ సంవత్సరానికిగానూ అత్యంత ఎక్కువ వసూళ్ళు సాధించిన చిత్రాలుగా ఈ రెండు చిత్రాలు రికార్డు కెక్కాయి.

అతి తక్కువ కాలంలోనే తన అందం, అభినయంతో టాప్ హీరోయిన్ గా ఎదిగిన ఈమె.. ప్రస్తుతం కూడా హీరోయిన్ గా కొనసాగుతోంది. 49 ఏళ్ల వయసు కల్గిన ఈ ముద్దుగుమ్మ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. అలాగే తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అందమైన ఫొటోలను షేర్ చేసింది.


ముఖ్యంగా స్లీవ్ లెస్ గ్రీన్ కలర్ లోనెక్ బౌల్జ్ వేసుకొని ఓ అందమైన చీరను కట్టుకుంది. సింగిల్ స్టెప్ పెట్టుకని మరీ అందాలను ఆరబోసింది. ఐదు పదుల వయసుకు దగ్గర్లో ఉన్న ఈమె.. పాతికేళ్ల పడుచు పిల్లలా కనిపిస్తోంది. కాజోల్ దేవగన్ అందాలకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫొటోలు అతి తక్కువ సమయంలోనే నెట్టింట వైరల్ గా మారాయి. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. హాట్ బ్యూటీ, హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ చెప్పుకొస్తున్నారు. మీరూ ఓసారి ఆ అందాలను చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











