గతం మర్చిపోయిన కాజోల్.. ఆ యాక్సిడెంట్ ను గుర్తు చేసుకుంటూ.. ఏమైందంటే?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియాలోనే పేరుమోసిన హీరోయిన్ల జాబితాలో ఆమె పేరు ముందు వరుసలో ఉంటుంది. సౌత్ లో ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే పనిచేసినా ఆమె నటించిన హిందీ చిత్రాలు తెలుగులోనూ డబ్ అవ్వడంతో దక్షిణాది ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో సీనియర్ నటిగా ఇంకా వెండితెరపై మెరుస్తోంది. ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ అలరిస్తోంది. నెక్ట్స్ తన రాబోయే చిత్రం కోసం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలో బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తోంది. ఈ సమయంలో తనకు ఓ ప్రమాదంతో మెమోరీ లాస్ అయ్యిందని.. ఆ సంఘటనను గుర్తు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

కాజోల్ దేవగన్ సినిమాలు..
1992 నుంచి కాజోల్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా కనిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోలు షారుక్ ఖాన్, అజయ్ దేవగన్ ససరన ఎక్కువ సినిమాల్లో నటించింది. షారుఖ్ ఖాన్ - కాజోల్ ఆన్ స్క్రీన్ పెయిర్ కు అప్పట్లో యమా క్రేజ్ ఉండేది. వీరి కాంబినేషన్ లో చాలా సినిమాలు హిట్ అయ్యాయి. బాజీగర్, డూప్లికేట్, దిల్ వాలే దుల్హానియా లే జాయేగి, కుచ్ కుచ్ హోతా హ, కబీ ఖుషి కబీ గమ్, కహో నా హో, రబ్ నే బనాది జోడి వంటి చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాయి. ఇక దక్షిణాది ప్రేక్షకులను కూడా 'మెరుపు కలల' అనే చిత్రంతో అలరించింది. అరవింద్ స్వామి, ప్రభు దేవాలతో కలిసి నటించింది. ఆ చిత్రంతో దక్షిణాది ఆడియెన్స్ కూడా బాగా దగ్గరైంది. చాలా గ్యాప్ తర్వాత ధనుష్ 'రఘువరన్ బీటెక్ 2' చిత్రంలో కీలక పాత్ర పోషించి ఆకట్టుకుంది.

Bollywood Actress Kajol Remembered accident at her old movie set during the shoot

తొలిసారిగా కాజోల్ హార్రర్ ఫిల్మ్..
కాజోల్ దేవగన్ తొలిసారిగా ఫీమేల్ లీడ్ లో హార్రర్ జోనర్ లో రూపుదిద్దుకున్న 'మా' అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ లో కాజోల్ ఫుల్ బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తోంది. ఈ క్రమంలో కాజల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తో అందరి చూపు తనపైనే పడేలా చేస్తోంది.

అజయ్ దేవగన్ ను మాత్రమే గుర్తు పట్టి..
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ - కాజోల్ జంటగా 1998లో కుచ్ కుచ్ హోతా హై చిత్రం విడుదలై బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో హే లడఖా హే దివానా అనే సాంగ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో.. కాజోల్ బైసిక్ పై రైడ్ చేయాల్సి ఉందంట. అప్పుడు కాజోల్ సైకిల్ అదుపు తప్పి కింద పడిందని, దాంతో పెద్దగా దెబ్బలు తగలకున్న ఆమెతలకు తగిలిన గాయంతో గతంతో మార్చిపోయిందంట. సెట్ లో ఉన్న డైరెక్టర్, ప్రొడ్యూసర్ ను ఎవ్వరినీ గుర్తు పట్టలేకపోయిందంట. అజయ్ దేవగన్ సెట్ కు రావడంతో అతన్ని మాత్రమే గుర్తుపట్టిందంట. ఇక ట్రీమ్ మెంట్ అందించి రెస్ట్ తీసుకున్న తర్వాత రికవరీ అయ్యిందంట. ఈమేరకు బాలీవుడ్ మీడియా టైమ్స్ ఆఫ్ ఇండియాలో కథనం రావడం గమనార్హం.

అజయ్ దేవగన్ తో పెళ్లి..
కాజోల్ 1999లో అజయ్ దేవగన్ ను పెళ్లి చేసుకుంది. కానీ అంతుకు ముందు నుంచే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. 5 ఏళ్ల పాటు డీప్ లవ్ లో మునిగి తేలారు. ఎట్టకేళలకు 1999 ఫిబ్రవరి 24న పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. 2003లో కూతురు న్యాసా, 2010లో కొడుకు యుగ్ కు జన్మనిచ్చారు. ఇక పెళ్లి తర్వాత నుంచి కాజోల్ సినిమాల జోరు తగ్గించారు. ఇప్పుడిప్పుడు మళ్లీ వరుసగా సినిమాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X