కాజోల్ ఇన్నిసార్లు కాలు జారిందా ... వీడియో వైరల్
నడుస్తూనో, ఏదో ఒకపని చేస్తూనో ఆదమరిచి కాలుజారడం సర్వసాధారణం. ఈ విషయాన్ని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. అబ్బే మేం చాలా అలర్ట్‌గా వుంటాం.. జీవితంలో ఎప్పుడూ స్లిప్ కాలేదు అని అంటే అది అబద్ధమే. కానీ అలా ఒప్పుకునేవారు అరుదనే చెప్పాలి.. చెప్పడమే కాదు స్వయంగా వీడియో వైరల్ చేసి అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నారు బాలీవుడ్ నటి కాజోల్. '' ప్రపంచ నవ్వుల దినోత్సవం '' సందర్భంగా తను పలు సందర్భాల్లో కాలు జారి పడిపోయిన వీడియోలను ఆమె పంచుకున్నారు.
కాజోల్ ఓ ప్రెస్‌మీట్‌లో, దుర్గా పూజ సందర్భంగా కారిడార్‌లో నడుస్తూ పడిపోయిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అలాగే ''కుచ్ కుచ్ హోతా హై'' చిత్రంలో సైక్లింగ్ చేస్తూ పడిపోయిన క్లిప్‌ను కూడా వీడియోలో పంచుకున్నారు. '' నా ఫోటోలన్నీ చూసిన తర్వాత స్టిల్ ముందు అద్భుతంగా ప్రవర్తిస్తున్నానని గ్రహించాను. అందుచేత మనం ఒక చిల్‌పిల్ తీసుకుని ఇతరులను నవ్వించే కొన్ని వీడియోలను మళ్లీ చూద్దాం #worldlaughterday అంటూ కాజోల్ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు.

ఈ వీడియో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. అభిమానులు లాఫింగ్ ఎమోజీలతో కామెంట్స్ పెడుతున్నారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా సైతం కాజోల్ వీడియోపై స్పందిస్తూ ''కుచ్ కుచ్ హోతా హై '' రోజులను గుర్తు చేసుకున్నారు. మారిషస్‌లో మీరు పడిపోయినప్పుడు , మేమంతా మీ వద్దకు ఎలా పరిగెత్తుకుంటూ వచ్చామో తనకు ఇంకా గుర్తుందన్నారు. కాజోల్ కాసేప్ బ్లాంక్ అవ్వగా.. మేమంతా నవ్వుల్లో మునిగిపోయామని, కుచ్ కుచ్ హోతా హై జ్ఞాపకాలు ఎన్నో అంటూ మనీష్ రాసుకొచ్చారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. కాజోల్ తన భర్త , బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ నిర్మాతగా, చోరీ ఫేమ్ విశాల్ ఫ్యూరియా దర్శకత్వంలో తెరకెక్కనున్న ''మా'' అనే హార్రర్ మూవీలో నటించే అవకాశాలున్నాయని బీ టౌన్ టాక్. ఈ ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం వుందని పీపింగ్ మూన్ నివేదించింది. కాజోల్ '' ది ట్రయల్ ''తొ ఓటీటీలోకి అడుగుపెట్టగా.. అందులో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. నయోనికా సేన్ గుప్తా అనే పాత్రలో ఖైదు చేయబడిన తన భర్తను విడిపించేందుకు పోరాడే మహిళగా అద్భుతంగా నటించారు. తద్వారా క్లిష్టమైన పాత్రలను పోషించగల సత్తా తనలో ఏమాత్రం తగ్గలేదని ఆమె నిరూపించారు. కాజోల్ చివరిగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన ''లస్ట్ స్టోరీస్ 2''లో కీలకపాత్రలో కనిపించింది.
కాజోల్ అభిమానులు ఆమె రాబోయే చిత్రం '' దో పట్టి '' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్‌తో కలిసి ఆమె నటించారు. శశాంకా చతుర్వేది ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో దో పట్టి ప్రీమియర్ కానుంది. ఈ ప్రాజెక్ట్ కాజోల్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











