పవన్ కళ్యాణ్ కు బాలీవుడ్ హీరోయిన్ కిస్ ఎమోజీలు.. పవర్ స్టార్ మాటలకు ఇలాంటి రిప్లై
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా హరి హర వీరమల్లు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తన పొలిటికల్ విక్టరీ తర్వాత తొలిసారిగా, అది కూడా తొలి పాన్ ఇండియా చిత్రంగా హరి హర వీరమల్లు చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. జూలై 24న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ జోరుగా పాల్గొన్నారు.
5 ఏళ్లుగా వెయిటింగ్..
ఈ చిత్రం కోసం ప్రేక్షకులకు ఎదురు చూస్తుండగా ఎట్టకేళలకు రీలీజ్ అయి ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సినిమాను తనదైన శైలిలో ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను ప్రమోట్ చేస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇందుకు ఆమె కూడా ఆసక్తికరంగా స్పందించడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే..

కెరీర్ లో తొలిసారిగా..
హరి హర వీరమల్లు చిత్రంతో పవన్ కళ్యాణ్ తొలిసారిగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తున్నారు. మరోవైపు ఐదేళ్లుగా సినిమాపై ఎలాంటి హైప్ తగ్గకుండా మెయిన్ టెయిన్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఇబ్బంది పడ్డ మేకర్స్, టీమ్ కు పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. కెరీర్ లో తొలిసారిగా పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రం ప్రచార కార్యక్రమాలను తన భుజంపై వేసుకున్నారు. వరుస ఇంటర్వ్యూలు, మీడియాతో సంభాషణలు జరిపి సినిమాకు న్యాయం చేసేందుకు కృషి చేశారు. మరోవైపు తొలిసారిగా సక్సెస్ మీట్ కు కూడా ఫస్ట్ హాజరవడం విశేషం.
బాలీవుడ్ హీరోయిన్ పై కామెంట్..
హరి హర వీరమల్లు చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా పవన్ కళ్యాణ్ పలు న్యూస్ ఛానెళ్లకు వీలైంత మేరకు ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చారు. ముఖ్యంగా ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ వరుస బెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ క్రమంలో బాలీవుడ్ మీడియా చిట్ చాట్ సెషన్ లో పాల్గొన్నారు. ఇదే సమయంలో బాలీవుడ్ హీరోయిన్లపై పవన్ కళ్యాణ్ కు ప్రశ్న ఎదురైంది. మీరు బాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్లు అలియా భట్, కియారా అద్వానీ, కృతి సనన్, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, కంగనా రనౌత్ వంటి వారిలో ఎవరితో కలిసి పనిచేయాలని అనుకుంటున్నారు? ఎందుకు అనే ప్రశ్న ఎదురైంది.
దీంతో పవన్ కళ్యాణ్ టాప్ లో డేరింగ్ హీరోయిన్ కంగనా రనౌత్ పేరును చెప్పారు. ఎమర్జేన్సీ అనే చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రలో అద్భుతంగా నటించింది. ఆమె నటన చూసిన తర్వాత స్ట్రాంగ్ యాక్టర్ అనిపించిందని చెప్పుకొచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. దాంతో కంగనా రనౌత్ తిరిగి స్పందించడం విశేషం. ఇన్ స్టా గ్రామ్ హ్యాండిల్ స్టోరీలో పవన్ కళ్యాణ్ ఫొటోలను, ఇంటర్వ్యూ క్లిప్స్ ను జత చేస్తూ రిప్లై ఇచ్చింది. తనను అభినందించినందుకు కాదు ఫ్లెండ్లీ కిస్ ఎమోజీలు, ధన్యవాదాలను సూచించే ఎమోజీలతో పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ చెప్పింది.


Click it and Unblock the Notifications











