Kareena Kapoor Khan: గ్లామర్ డోస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ!
Kareena Kapoor Khan: బాలీవుడ్ హాట్ బ్యూటీ కరీనా కపూర్ గురించి తెలియని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆమె అందానికి ఎవ్వరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఒకప్పుడు బాలీవుడ్ ను తన అందంతో ఓ ఊపు ఊపిన ఈమె.. ఇప్పటికి కూడా హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇద్దరు పిల్లలకు తల్లిగా మారినా, రోజురోజుకూ వయసు పెరుగుతున్నా.. ఆమె అందాలు మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. వన్నె తరగని అందంతో ఎప్పటికప్పుడు తన అభిమానులను అలరిస్తోంది. ముఖ్యంగా కొత్త అభిమానులను కూడా సంపాధించుకుంటోంది.
కభీ ఖుషీ, కబీ గమ్, అజ్ నబీ, గోల్ మాల్ రిటర్న్స్ వంటి సూపర్ డూపర్ హిట్టు చిత్రాల్లో నటించి కేవలం బాలీవుడ్ అభిమానులకు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత జబ్ వి మెట్, వి ఆర్ ఫ్యామిలీ, 3 ఇడియట్స్, బాడీగార్డ్, రా.వన్, భజరంగీ బాయిజాన్, కర్బానా వంటి చిత్రాల్లో నటించిన ఈ హాట్ బ్యూటీ.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. విమర్శకుల నుంచి సైతం ఈ సినిమాల్లో నటనకు ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత నటుడు సైఫ్ అలీఖాన్ ను వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలకు జన్మను కూడా ఇచ్చింది.

ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుందీ ముద్దుగుమ్మ. తనకు సంబంధించిన పర్సనల్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన అందమైన హాట్ హాట్ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. అందులో అదిరిపోయే ఔట్ ఫిట్లలో కనిపించి అందరి చేత ఆహా అనిపించుకుంటోంది. ముఖ్యంగా లోపల బ్రా కూడా వేసుకోకుండా ఓ కోట్ వేసుకొని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది.

బ్లాక్ కలర్ కోట్ పై గోల్డ్ జెరీ వర్క్ తో వచ్చిన డిజైన్ చాలా బాగుంది. అందులో కరీనా ఎద అందాలు అందరికీ క్లిస్టర్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. అలాగే మరికొన్ని ఫొటోల్లో నిండుగా బొట్టు పెట్టుకొని మెడలో పూల మాల వేసుకుని చాలా స్టైలిష్ లుక్కులో దర్శనం ఇచ్చింది. ఫుల్ హ్యాండ్స్ హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వేసుకున్న కరీనా చాలా పద్ధతిగా, అందంగా కనిపిస్తోంది. మరో ఫొటోలు అయితే తలపై నుంచి కొంగు వేసుకొని పెద్ద నెక్లెస్ పెట్టుకుంది. ఈ ఫొటోల్లో కరీనా నిజంగా చాలా అందంగా కనిపిస్తోంది.

ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ చెప్పుకొస్తున్నారు. ఇద్దరు పిల్లలకు తల్లివి అయినా అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గట్లేవు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. 43 ఏళ్ల వయసు వచ్చినా 16 ఏళ్ల పడుచు పిల్లలా కనిపిస్తూ.. కుర్రకారుకు హీటెక్కించడంలో ఈమెను మించిన వాళ్లు లేరు. మీరూ ఓసారి ఈ ఫొటోలు చూస్తే మీకే అర్థం అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఓ లుక్కేసేయండి మరి.


Click it and Unblock the Notifications











