44 ఏళ్ల వయసులో బికినీలో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్.. ఇద్దరు పిల్లలకు తల్లైనా తగ్గని పరువాలు!
కొంతమందిని చూస్తే వారి వయసు పెరుగుతుందా? తగ్గుతుందా? అన్న అనుమానాలు కలుగుతుంది. వయసుతో పాటేవారి అందం కూడా పెరుగుతూ కనిపిస్తుంది. వారు అన్నం తింటున్నార? అందం తింటున్నారా? అంటూ అభిమానులు సైతం కామెంట్స్ పెడుతుంటారు. ఈ కోవలోకి వస్తారు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్. హిందీ చిత్ర పరిశ్రమను శాసించే కపూర్ ఫ్యామిలీకి వారసురాలైన ఈ ముద్దుగుమ్మ.. తన అందం, నటనతో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు.
బాలీవుడ్ క్వీన్‌గా ఎదిగిన కరీనా
2000వ సంవత్సరంలో రెఫ్యూజీ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు కరీనా కపూర్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోనప్పటికీ.. ఆమె ఎక్కడా కృంగిపోలేదు. కపూర్ బ్రాండ్ ఇమేజ్‌తో అవకాశాలు ఢోకా లేకుండా పోయిది. తర్వాత ముజే కుచ్ కహ్నా హై, యాదే, అజ్జబీ, అశోక తదితర సినిమాలు హిట్ కావడంతో కరీనా నిలదొక్కుకుంది. గ్లామర్ రోల్స్‌తో పాటు కథాబలమున్న సినిమాల్లో నటించి బాలీవుడ్ క్వీన్‌గా ఎదిగింది. హిందీలోని అందరు అగ్రనటులతో కలిసి నటించిన కరీనా కపూర్ పలువురితో డేటింగ్ చేసింది.

సైఫ్ అలీఖాన్‌తో పెళ్లి
హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్, షాహిద్ కపూర్‌లతో ప్రేమాయణం సాగించినట్లుగా బీటౌన్ మీడియా కోడై కూసింది. కానీ వీటిలో ఏవీ కూడా పెళ్లి పీటలు ఎక్కకుండా మధ్యలోనే బ్రేకప్‌కు దారితీశాయి. పటౌడీ రాజవంశీయుడు, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌తో ప్రేమలో పడిన కరీనా ఆయనను పెళ్లాడారు. అప్పటికే సైఫ్‌కు అమృతా సింగ్‌తో వివాహం జరిగి సోహా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్ అనే పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ సైఫ్‌ను కరీనా పెళ్లాడారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. పెళ్లి, పిల్లలతో కొన్నాళ్లు సినిమాలకు బ్రేకప్ ఇచ్చిన కరీనా .. ఇటీవల మరోసారి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. అమీర్‌ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్ధాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు.
ప్రభాస్‌తో స్టెప్పులు వేయనున్న కరీనా
ఇప్పటి వరకు హిందీ సినిమాలో అలరించిన కరీనా కపూర్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ది రాజా సాబ్‌లో కరీనా కపూర్ ఓ స్పెషల్ సాంగ్‌లో నటించనున్నారని గాసిప్స్ వైరల్ అయ్యాయి. హైదరాబాద్‌లోని ఓ స్పెషల్ సెట్‌లో ఈ పాటను షూట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. తొలుత ఈ పాత్ర కోసం లేడీ సూపర్‌స్టార్ నయనతారను సంప్రదించగా.. ఆమె నిరాకరించడంతో కరీనాను అదృష్టం వరించినట్లుగా చెబుతుంది. ప్రభాస్ మూవీలో స్పెషల్ సాంగ్ అనగానే వెంటనే ఆమె ఓకే చెప్పినట్లుగా టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. ఇదే నిజమైతే కరీనా కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఖరారు అయినట్లే.
44 ఏళ్ల వయసులో బికినీ
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే కరీనా కపూర్ ఎప్పటికప్పుడు తన సినిమాలు, షోలు, ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటో షూట్‌లతో సెగలు రేపుతుంటారు. తాజాగా ఓ బీచ్‌లో వెకేషన్‌కు వెళ్లిన కరీనా కపూర్ బికినీ ధరించి దానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. 44 ఏళ్ల వయసులో, ఇద్దరు పిల్లలకు తల్లయినా కూడా ఏమాత్రం చెక్కుచెదరని అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరి ఇంకేందుకు ఆలస్యం కరీనా కపూర్ అందాలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











