అప్పుడు ప్రభాస్.. ఇప్పుడు మరొకరితో అఫైర్ అంటగడుతారా? యంగ్ హీరోయిన్ ఫైర్

గ్లామర్ ఫీల్డ్ అయిన సినీ రంగంలో హీరో హీరోయిన్లు కాస్త క్లోజ్‌గా ఉంటే చాలు వారిపై ఉన్నది లేనిది కల్పించి రాయడానికి ఎన్నో వెబ్‌సైట్స్, యూట్యూబ్ ఛానెల్స్.. దానికి తోడు సోషల్ మీడియా ఉండనే ఉంది. వీటిలో వచ్చే వార్తల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో నమ్మలేని పరిస్ధితి. హాట్ హాట్ థంబ్‌నెయిల్స్, టైటిల్స్‌తో పోస్టర్స్ వదలడం.. జనాన్ని ఎట్రాక్ట్ చేయడానికి ఫేక్ న్యూస్ వండి వార్చడం ఈ మధ్య బాగా అలవాటైంది. అవతలి వారి జీవితాలను ప్రమాదంలోకి నెట్టడానికి సైతం వీళ్లు వెనుకాడటం లేదు.

నటీనటులను, వారి కుటుంబ సభ్యులను బజారుకీడుస్తున్న ఇలాంటి వారి ఆటకట్టించాలని నిర్ణయించుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇటీవల కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియా ఖాతాలను బ్యాన్ చేయించింది. ఈ లిస్ట్‌లో మరికొన్ని ఉన్నాయని.. త్వరలో వీటిపైనా చర్యలు తీసుకుంటామని మా ప్రతినిధులు వెల్లడించారు. ఈ తరహా బాధితుల్లో మిగిలిన వారి కంటే హీరోయిన్లే ఎక్కువ. ఇందులో బాలీవుడ్ నటి కృతి సనన్ ఒకరు.

bollywood actress Kriti Sanon reacts to wedding rumours with UK Businessman Kabir Bahia

తెలుగు సినిమా ద్వారానే కృతి సనన్ ఎంట్రీ ఇచ్చారు. 2014లో సూపర్‌‌స్టార్ మహేశ్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన వన్ నేనొక్కడినే హీరోయిన్‌గా ఆమె మొదటి చిత్రం. ఆ తర్వాత నాగచైతన్యతో దోచేయ్ మూవీ చేసినా అది అంతగా వర్కవుట్ కాకపోవడంతో బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టి వరుసగా ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా సెటిలైంది. బరేలీకి బర్ఫీ, లుకా చుప్పి, హౌస్‌ఫుల్ 4 వంటి హిట్ చిత్రాలతో కృతి సనన్ క్రేజ్ పెరగ్గా.. బ్రాండ్ అండార్స్‌మెంట్ల ద్వారా కూడా ఆమె రెండు చేతులా సంపాదిస్తోంది.

అయితే ఆదిపురుష్ సినిమా సమయంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కృతి సనన్ ప్రేమలో పడ్డారని.. రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. కల్కి 2898 ఏడీ ప్రమోషన్స్ సందర్భంగా బుజ్జిని లాంచ్ చేసే కార్యక్రమానికి ముందు తన జీవితంలోని ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నానని ప్రభాస్ ఒక పోస్ట్ పెడితే.. అంతా కృతి సనన్ గురించే అనుకున్నారు. ఆ తర్వాత ఎందుకో సోషల్ మీడియా వీరిద్దరి విషయంలో సైలెంట్ అయి రీసెంట్‌గా ప్రభాస్ ప్లేస్‌లో కబీర్ బహియా అనే వ్యక్తితో కృతికి లింక్ పెట్టేశారు . ఆమె కంటే కబీర్ పదేళ్లు చిన్న.. తన పుట్టినరోజు వేడుకను కబీర్‌తో కలిసి కృతి సెలబ్రెట్ చేసుకున్నారంటూ ఊహాగానాలు వినిపించాయి. త్వరలోనే కబీర్ - కృతిలు పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ గాసిప్స్ వైరల్ అయ్యాయి.

bollywood actress Kriti Sanon reacts to wedding rumours with UK Businessman Kabir Bahia

ఈ తప్పుడు వార్తలపై కృతి సనన్ మనస్తాపం చెందారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. నిరాధారమైన వార్తల వల్ల వచ్చే పరిణామాలను తనతో పాటు తన కుటుంబ సభ్యులు ఎదుర్కోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. అబద్ధాలపై నిత్యం స్పందించాలంటే చిరాకు వేస్తోందని.. నెగెటివ్ కామెంట్స్ పెట్టడం ట్రెండ్ అయ్యిందని, అభిప్రాయాలను స్వేచ్చగా బయటపెట్టడం.. అవతలి వారిపై రూమర్స్ స్ప్రెడ్ చేయడం ఒకటి కాదని కృతి పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Read more about: kriti sanon kabir bahia prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X