‘కమిట్‌మెంట్‌కి ఒప్పుకుంటే లక్ష ఇస్తానన్నాడు... అలా తప్పించుకున్నా’

చిత్ర పరిశ్రమలో ఎన్నో ఆశలు, కలలతో అడుగుపెట్టే అమ్మాయిలను అవకాశాల పేరుతో ట్రాప్ చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్న క్యాస్టింగ్ కౌచ్ రక్కసిపై నటీమణులు గళమెత్తుతూనే ఉన్నారు. కానీ నిత్యం ఏదో ఒక మూలన క్యాస్టింగ్ కౌచ్‌కి బలవుతున్న నటీమణుల గురించి బయటకు వస్తూనే ఉంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎందరో కామాంధుల చేతుల్లో వారి జీవితాలను నాశనం చేసుకున్నారు. తాజాగా క్యాస్టింగ్ కౌచ్‌పై ఓ బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..

ఆ నటి ఎవరో కాదు.. మాన్వీ గాగ్రూ. ఢిల్లీలో స్థిరపడిన కశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించారు మాన్వీ. నగరంలోనే చదువుకున్న ఈ ముద్దుగుమ్మ... తొలుత బుల్లితెరపై అడుగుపెట్టారు. డిస్నీ ఛానెల్‌లో ప్రసారమైన ధూమ్ మచావో ధూమ్ అనే టెలివిజన్ షోలో కనిపించారు. అనంతరం ది చీతా గర్ల్స్: వన్ వరల్డ్ అనే ఇంగ్లీష్ మూవీతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత నో వన్ కిల్డ్ జెస్సికా, పీకే, ఉజ్దా చమాన్, శుభ్ మంగళ్ జ్యాద సావధాన్, అమ్రాస్: ద స్వీట్ టేస్ట్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్, ఉజ్దా చామన్, 377 అబ్‌నార్మల్, గాయ్ ఇన్ ద స్కై, ఏ క్వశ్చన్ మార్క్ తదితర సినిమాలలో నటించారు మాన్వీ. అలాగే ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్, మేడ్ ఇన్ హెవెన్ తదితర వెబ్ సరీస్‌లలోనూ కనిపించారు గాగ్రూ.

Bollywood Actress Maanvi Gagroo Opens Up About Casting Couch Experience

2023లో కుమార్ వరుణ్ అనే వ్యక్తిని మాన్వీ గాగ్రూ పెళ్లాడారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆమె ఎప్పటికప్పుడు తన సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇతర వ్యక్తిగత విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. 40 ప్లస్‌లోనూ చెక్కు చెదరని గ్లామర్‌తో అభిమానులను రెచ్చగొడుతూ ఉంటారు. మనసులో ఏమున్నాసరే కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడటం మాన్వీ స్టైల్. ఈ విషయంలో ఎన్ని విమర్శలు ఎదురైనా సరే.. ఆమె తనకు నచ్చినట్లుగానే వ్యవహరిస్తున్నారు.

సినీరంగంలో మహిళ పాత్ర, భాగస్వామ్యం పెరగాలని మాన్వీ పలుమార్లు తెలిపారు. చిత్ర పరిశ్రమలో కేవలం తెరపైనే కాకుండా తెర వెనుక కూడా మహిళల భాగస్వామ్యం పెరగాలి. మరింత మంది మహిళా దర్శకులు, రచయితలు, నిర్మాతలు ముందుకు వచ్చినప్పుడే మహిళల కోణంలో ఉండే వాస్తవిక కథలు వెలుగులోకి వస్తాయని మాన్వీ ఉన్నారు. చెప్పడమే కాదు.. మహిళల ఆలోచనలో మార్పు తీసుకొచ్చేలా హీర్ సారా సిరీస్‌లో ఆమె కీలక పాత్ర పోషించారు. నగరంలో ఒంటరిగా ఉంటూ సమాజం కట్టుబాట్లును ఎదిరించి గుర్తింపు కోసం పోరాడే ఇద్దరు స్నేహితుల ప్రయాణాన్ని ఈ సిరీస్‌లో అద్భుతంగా చెప్పారు.

ఇటీవల ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాన్వీ గాగ్రూ మాట్లాడుతూ.. కెరీర్ తొలినాళ్లలో తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవం, ఇండస్ట్రీలో మహిళల పరిస్ధితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ సినిమాలో ఆఫర్ కోసం నాకు ఓ వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది. నువ్వు కాంప్రమైజ్‌కి ఒప్పుకుంటే లక్ష రూపాయలతో పాటు ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయని ఆ మెసేజ్‌లో ఉంది. కాంప్రమైజ్ అనే పదానికి అర్ధం తెలియక.. రాజీనా అని అతనికి రిప్లయ్ ఇచ్చాను. అయితే నేను మెంటార్‌గా భావించే ఓ క్యాస్టింగ్ డైరెక్టర్‌కు ఆ మెసేజ్‌ను చూపించాను.

అది చూసిన వెంటనే ఆయన ఆ మెసెజ్‌లను డిలీట్ చేసి, వాడి నెంబర్ బ్లాక్ చేయమని సీరియస్‌గా చెప్పడంతో నేను ఆశ్చర్యపోయా. ఎవరూ ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు ఫోన్‌లోనే ఇలాంటి విషయాలు మాట్లాడతారు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని హీరోయిన్లు వీటిని ఎదుర్కోవడం అంత సులభం కాదు. సినీరంగంలోకి ప్రవేశించే సమయంలో సెలబ్రిటీల పిల్లలకు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి. నెపోకిడ్స్‌కు ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. సినీ జనాలను వారు సులభంగా కలుసుకోగలరు. వారికి సినీరంగంపై అవగాహనతో పాటు నెట్‌వర్క్ ఉంటుంది. అయితే అంతిమంగా ఎవరు నిలబడతారో ప్రేక్షకులే నిర్ణయిస్తారని మాన్వీ పేర్కొన్నారు.

గుర్తింపు పొందడానికి, ఆడిషన్లు దక్కించుకోవడానికి, పరిశ్రమలో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి బయటి నుంచి వచ్చిన నటీనటులు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుందని మాన్వీ వెల్లడించారు. ఇలాంటి సంఘటనలు ఎదురైనా.. మాన్వీ కేవలం నటన, పని మీదే దృష్టి సారించి తన పరిమితుల మేరకు కెరీర్‌ను నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారగా.. క్యాస్టింగ్ కౌచ్ రక్కసి ఏ స్థాయిలో పంజా విసురుతోందో దీనిని బట్టి అర్ధమవుతోంది.

Read more about: maanvi gagroo casting couch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X