తన కంటే 20 ఏళ్లు పెద్ద .. ఆ హీరోతో లిప్‌లాక్‌కి కోటి రూపాయలు, వెలుగులోకి స్టార్ హీరోయిన్ బాగోతం
చిత్ర పరిశ్రమలో కథ డిమాండ్ మేరకు హీరో హీరోయిన్ల మధ్య లిప్ లాక్ సీన్లు, బెడ్ రూం, ఇతర రొమాంటిక్ సీన్స్ తీస్తుంటారు మేకర్స్. ఫ్యామిలీ ఆడియన్స్, క్రిటిక్స్ నుంచి విమర్శలు వచ్చినా ఈ విషయంలో దర్శక నిర్మాతలు తగ్గరు. కేవలం ఈ రొమాంటిక్ సీన్స్ వల్లే హిట్ అయిన సినిమాలు కూడా లేకపోలేదు. కానీ వీటిని షూట్ చేయడం, అందుకు నటీనటులను సిద్ధం చేయడం కత్తి మీద సాము లాంటిది.
భారతీయ చిత్ర పరిశ్రమలో ఎందరో హీరోయిన్లు వచ్చారు , వెళ్లారు కానీ కొందరు మాత్రమే తమ కంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు. అలాంటి వారిలో మాధురి దీక్షిత్ కూడా ఒకరు. 1967 మే 15న ముంబైలో జన్మించిన ఆమె.. నిజానికి అనుకోకుండానే సినిమాల్లోకి వచ్చారు. బాగా చదువుకుని మైక్రో బయాలజిస్ట్ కావాలని మాధురి అనుకున్నారు. మూడేళ్ల వయసులోనే డ్యాన్స్, ఎనిమిదేళ్ల వయసులోనే కథక్ నృత్యాలను నేర్చుకుని శెభాష్ అనిపించుకున్నారు.

17 ఏళ్ల వయసులోనే 1984లో అబోద్ అనే సినిమాతో చిత్ర సీమలో అడుగుపెట్టారు మాధురి . చిన్న పాత్ర అయినా సరే వచ్చిన ఏ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా నటిస్తూ వచ్చిన ఆమె నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తేజాబ్, రాం లఖాన్, పరిందా, త్రిదేవ్, కిషన్ కన్హయ్య వంటి సినిమాలతో హిందీ చిత్ర పరిశ్రమను ఊపేశారు. శ్రీదేవి, జయప్రద, హేమామాలిని వంటి దిగ్గజ తారల హవా ముగుస్తున్న దశలో హిందీలో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఎదిగారు మాధురి.
1990వ దశకం నుంచి 2000 వరకు ఆమె భారతీయ చిత్ర పరిశ్రమలో తిరుగులేని నటిగా వెలుగొందారు. డ్యాన్స్, నటన, అందం ఇలా ఏ విషయంలోనైనా ఆమెకు సాటి లేరంటూ విమర్శకులు సైతం ప్రశంసించారు. దిల్, సాజన్, బేటా, ఖల్ నాయక్, హం ఆప్కే హై కౌన్, రాజా వంటి సినిమాలు మాధురికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. నాలుగు దశాబ్ధాల కెరీర్‌లో 70కి పైగా సినిమాల్లో నటించిన మాధురి దీక్షిత్ 6 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకున్నారు.

చిత్ర పరిశ్రమకు ఆమె చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో మాధురిని సత్కరించింది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే డాక్టర్ శ్రీరామ్ నేనే అనే వ్యక్తిని మాధురి పెళ్లాడి.. భర్తతో కలిసి అమెరికాకు వెళ్లిపోయారు. ఈ దంపతులకు అరిన్, ర్యాన్ అనే ఇద్దరు కుమారులు సంతానం. వివాహం తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆమె తిరిగి భారతదేశానికి చేరుకుని రియాలిటీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.
ఇకపోతే.. మాధురి దీక్షిత్ కెరీర్‌లో 1988లో దిగ్గజ నటుడు వినోద్ ఖన్నాతో చేసిన దయావన్ సినిమా వివాదాస్పదమైంది. మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన నాయకుడికి రీమేక్‌గా హిందీలో దయావన్‌ను తెరకెక్కించారు. ఈ సినిమాలోని ఆజ్ ఫిర్ తుమ్ సే సాంగ్‌లో హీరో , హీరోయిన్ల మధ్య లిప్ లాక్‌తో పాటు బెడ్ రూం సీన్ ఉంటుంది. అప్పటికీ వినోద్ వయసు 42 ఏళ్లు కాగా.. మాధురి వయసు 20 ఏళ్లు. ఈ సీన్ నేటికీ హిందీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఈ మధ్య నెట్‌ఫ్లిక్స్‌లో ది ఫేమ్ గేమ్ అనే షోలో భాగంగా ఈ లిప్ లాక్ ప్రస్తావన రాగా.. మాధురి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సీన్ అవసరం లేనప్పటికీ పెట్టారని.. దానికి తాను నో చెప్పి ఉండాల్సిందని అన్నారు. అయితే ఈ సీన్‌లో నటించేందుకు మాధురికి 36 ఏళ్ల క్రితమే రూ.కోటి రెమ్యునరేషన్ ఇచ్చినట్లుగా చెబుతుంటారు.


Click it and Unblock the Notifications











