అలా ఒక సెకను ఉంటే చాలు.. బాలీవుడ్ హాట్ బ్యూటీ కామెంట్స్ వైరల్

Malaika Arora: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మలైకా అరోరా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన హాట్ అండ్ ఫిట్‌నెస్‌ అందాల ప్రదర్శనతో నెటిజన్లను ఫిదా చేస్తోంది. నిత్యం తన రిలేషన్‌షిప్‌కు సంబంధించి లేదా ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌, లుక్స్‌పై నెట్టింట్లో రచ్చ చేస్తోంది. గత కొన్నిరోజులుగా పలు విషయాలతో ఆమె వార్తల్లో నిలుస్తున్న ఈ బాలీవుడ్ బ్యూటీ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఏం పోస్ట్ చేసింది? ఎవరిని ఉద్దేశించి ఆ పోస్ట్ చేసిందనేది ? ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ పోస్టు ఏంటో మీరు కూడా లుక్కేయండి.

హాట్ బ్యూటీ మలైకా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల ఆమె తండ్రి సూసైడ్ చేసుకుని మరణించారు. ఈ సమయంలో ఆమె మాజీ భర్త అర్బాజ్ ఖాన్, బాయ్‌ఫ్రెండ్ అర్జున్ కపూర్‌ ఆమెను పరామర్శించేందుకు వచ్చారు. అలాగే.. బాలీవుడ్ స్టార్స్ అర్జున్ కపూర్, మలైకా అరోరాలు విడిపోయారంటూ వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ ఎవరి లైఫ్ వారు చూసుకున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అర్జున్ కపూర్ అసలు విషయం చెప్పారు. దీపావళి బాష్ లో మలైకాతో బ్రేకప్ ను కన్ఫామ్ చేశారు. ప్రస్తుతం తాను ఒంటరిగానే ఉంటున్నట్లు వెల్లడించారు.

Bollywood actress Malaika Arora shared a interesting post on her Instagram Stories

బాలీవుడ్‌ ఐటమ్‌ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న మలైకా.. తొలుత సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ ను 1998లోనే పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ అర్హాన్ అనే కుమారుడు ఉన్నాడు. కానీ, పలు వ్యక్తిగత కారణాల వల్ల 2017లో అర్బాజ్ ఖాన్‌తో మలైకా విడాకులు తీసుకుంది. ఈ వ్యవహారం జరిగిన ఏడాది లోపే మలైకా అరోరా తనకంటే వయస్సులో చాలా చిన్నవాడైన అర్జున్ కపూర్ 2018 లో డేటింగ్ ప్రారంభించారు.వీళ్లిద్దరూ కలిసే ఉన్నారు. చాలా ఫారెన్ టూర్స్‌కి వెళ్లారు. అప్పట్లో వీరి ఫొటోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి.

ఈ విషయాన్ని వారు 2019లో తమ బంధాన్ని బహిరంగంగా అంగీకరించారు. బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారారు. వీరిద్దరికి మధ్య దాదాపు 12 సంవత్సరాల తేడా ఉంటుంది. దాదాపు 6 సంవత్సరాలు అర్జున్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలింది 50 ఏళ్ల మలైకా అరోరా. ఈ హాట్ జంట వయస్సు కారణంగా చాలాసార్లు ట్రోల్ బారిన పడ్డారు.కానీ వారిద్దరూ ఎప్పుడూ పట్టించుకోలేదు.

అయితే.. గత కొంతకాలంగా.. అర్జున్ కపూర్, మలైకా అరోరాలు బ్రేకప్ చెప్పుకున్నట్లు సోషల్ వీడియోలో వార్తలు వస్తున్న వస్తున్నాయి. ఇద్దరూ వేరు వేరుగా జీవితం గడుపుతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా ఈ జంట కలిసి కనిపించకపోవడంతో విడిపోయారనే వార్తలు వెలువడ్డాయి. ఇటీవల ఈ రూమార్స్ పై ‍అర్జున్‌ కపూర్‌ స్పందించారు. ముంబయిలోని దివాళీ బాష్‌కు ‍అర్జున్‌ కపూర్‌ హజరయ్యారు.

Bollywood actress Malaika Arora shared a interesting post on her Instagram Stories

ఈ సందర్భంగా మీడియా మిత్రులతో మాట్లాడుతూ.. తన వ్యక్తిగత జీవిత విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉన్నానంటూ ప్రకటించారు. ఈ ప్రకటనతో అర్జున్ మలైకాలు విడిపోయినట్లు క్లారిటీ వచ్చింది. బాలీవుడ్ హాట్ కపుల్ విడిపోయారంటూ ప్రచారం జరిగింది. ఓ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

ఇదెలా ఉంటే.. తాజాగా అర్జున్ కపూర్ కామెంట్స్ పై హీరోయిన్ మలైక అరోరా స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో హృదయం, ఆత్మ అంటూ ఓ ఇంట్రెస్టింగ్ కొటేషన్ ను షేర్ చేశారు మలైకా. అందులో "ఒక సెకను హృదయాన్ని తాకడం వల్ల జీవితకాలం పాటు ఆత్మను దగ్గరగా ఉండవచ్చు" అంటూ తన మనసులో మాటను బయటపెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

అంతకు ముందు మలైకా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనపై వచ్చే విమర్శలు తాను ఎప్పుడూ బాధ కలిగించలేదనీ, ప్రతికూల అంశాల నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం పర్సనల్ గా, కెరీర్ పరంగా తాను మంచి స్థానంలో ఉన్నాననీ, తన జీవితంలో జరిగిన మంచి, చెడు, రెండింటికీ తన నిర్ణయాలే కారణమన్నారు మలైకా. ఈ కామెంట్స్ తో ఇన్ డైరెక్ట్ గా తన బ్రేకప్ గురించే చెప్పిందనే ప్రచారం జరిగింది.

More from Filmibeat

Read more about: malaika arora arjun kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X