గ్లామర్ కంచె తెంచేసిన హీరోయిన్: లేటు వయసులోనూ శృతి మించిన హాట్ షో
హీరోయిన్లు ఎవరైనా గతంలో వరుసగా సినిమాలు చేయడం వల్లో.. కాంట్రవర్శీల వల్లో తరచూ వార్తల్లో నిలిచేవారు. అయితే, ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. దీనికి కారణం సోషల్ మీడియా అందుబాటులోకి రావడమే. దీనివల్ల సినిమాల్లో పెద్దగా నటించకున్నా చాలా మంది భామలు తెగ హైలైట్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా అందాలను ఆరబోస్తూ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నారు. అందులో ముదురు బ్యూటీ మలైకా అరోరా ఒకరు. చాలా కాలంగా గ్లామర్ ఫీల్డులో కొనసాగుతోన్న ఈ సుందరి.. సోషల్ మీడియాలో శృతి మించిన హాట్ షో చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని ఘాటు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ లుక్కేయండి!

స్పెషల్ సాంగ్‌లతో పాపులారిటీ
మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్నప్పుడే మలైకా అరోరా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ, ఆమెకు అంతగా గుర్తింపు మాత్రం రాలేదు. ఈ పరిస్థితుల్లో 'ఛయ్య ఛయ్య..', 'అనార్కలీ డిస్కో ఛాలీ', 'మున్నీ బద్నామ్' వంటి ఐటెం సాంగ్స్ చేసి గుర్తింపు పొందింది. అలాగే, తెలుగులో మహేశ్ బాబు 'అతిథి', పవన్ కల్యాణ్ 'గబ్బర్ సింగ్'లో స్పెషల్ సాంగ్స్‌లో మెరిసింది.

సల్మాన్ తమ్ముడితో విడాకులు
వరుస పెట్టి సినిమాలు, స్పెషల్ సాంగ్‌లు చేస్తూ కెరీర్ పరంగా స్థిరపడుతోన్న సమయంలోనే మలైకా అరోరా.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి తొమ్మిదేళ్లు కాపురం చేశారు. ఈ క్రమంలోనే ఈ జంటకు ఒక బాబు కూడా పుట్టాడు. ఇక, 2017లో మలైకా అరోరా పర్సనల్ రీజన్స్‌తో అర్భాజ్‌కు విడాకులిచ్చింది.

ఆ స్టార్ హీరోతో డేటింగ్ చేస్తూ
భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత మలైకా అరోరా బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్‌తో లవ్ ట్రాక్ నడుపుతోంది. మొదట్లో సీక్రెట్‌తో వ్యవహారం నడిపించి.. ఆ తర్వాత ఈ జంట మరింతగా రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తరచూ కలిసి తిరగడం.. డిన్నర్ డేట్లలో రచ్చ చేయడం.. హాలీడే ట్రిప్పులను ఎంజాయ్ చేయడం.. ఒకే ఇంట్లో కలిసి ఉండడం వంటివి చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

యాక్సిడెంట్.. మళ్లీ మొదలు
కొద్ది రోజుల క్రితం ఓ ఫ్యాషన్ షోకు వెళ్లొస్తోన్న సమయంలో మలైకా అరోరా యాక్సిడెంట్‌కు గురైంది. ఈ ప్రమాదంలో మలైకా అరోరా ప్రయాణిస్తోన్న కారు ముందు భాగం బాగా డ్యామేజ్ అయిపోయింది. దీంతో ఆమెకు కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. ఇక, చాలా రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత మలైకా మరోసారి ముఖానికి మేకప్ వేసుకుని షూట్ మొదలెట్టింది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ
గతంలో వరుసగా సినిమాలు, స్పెషల్ సాంగ్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేసినా.. ఈ మధ్య అంతగా కనిపించకున్నా మలైకా అరోరా సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతోంది. యోగా టిప్స్‌ను కూడా ఇస్తూ హడావిడి చేస్తోంది.

అందాల విందు చేస్తూ రచ్చ
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియా మలైకా అరోరా చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐదు పదుల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా కనిపిస్తోన్న ఈ భామ.. తరచూ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో కుర్రకారులో హీటును అమాంతం పెంచేస్తోంది. అంతేకాదు, ఇంటర్నెట్‌ను కూడా ఓ ఊపు ఊపేస్తూ దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతోంది.

బ్రాతో ఎద అందాల ఆరబోత
తాజాగా మలైకా అరోరా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె గ్రీన్ కలర్ బ్లేజర్ ధరించింది. కానీ, దాన్ని విప్పేసి బ్రాతో ఘాటుగా ఫోజులిచ్చింది. దీంతో మలైకా ఎద అందాలు మొత్తం చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇవన్నీ తక్కువ టైంలోనే వైరల్ అయిపోయాయి.


Click it and Unblock the Notifications











